వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్:7 కోట్ల ఓట్లతో ట్రంప్ గెలుపు! -తుపాకులు, స్ప్రే,బ్యాట్లతో దాడులు-అమెరికాలో తీవ్రమైన అల్లర్లు

|
Google Oneindia TeluguNews

అమెరికా ఎన్నికల్లో విజేత ఎవరో తేలిపోయింది. తుది ఫలితాలు రావడానికి మరికొన్ని రోజుల సమయం పట్టే అవకాశమున్నా, పలు రాష్ట్రాల ఎన్నికల అధికారుల ప్రకటన మేరకు డెమోక్రటిక్ అభ్యర్థి జోబైడెన్ ఇప్పటికే మ్యాజిక్ మార్కును దాటేయడంతో అధ్యక్ష మార్పు ఖాయమైపోయింది. కానీ ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం గెలిచింది తానే అని కరాకండిగా చెబుతున్నారు. ఎన్నికల్లో అక్రమాలపై తాజాగా మరికొన్ని ప్రకటనలు చేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఆయన మద్దతుదారులు రోడ్లపైకొచ్చి ఎన్నికల ఫలితాలను ఖండిస్తూ, కనపడ్డవాళ్లందరిపై భయానక రీతిలో దాడులు చేస్తున్నారు..

కమలగెలుపుపై చంద్రబాబు ఆసక్తికరం -అమెరికా 49వ వైస్ ప్రెసిడెంట్ -శాంతి కోరిన వైసీపీ నేత పీవీపీకమలగెలుపుపై చంద్రబాబు ఆసక్తికరం -అమెరికా 49వ వైస్ ప్రెసిడెంట్ -శాంతి కోరిన వైసీపీ నేత పీవీపీ

71 మిలియన్ల ఓట్లతో గెలిచాను..

71 మిలియన్ల ఓట్లతో గెలిచాను..

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలను ఆయా రాష్ట్రాలే నిర్వహిస్తుండటం, ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ పాత్ర నామమాత్రంగా ఉండటం, ఈసారి సగానికిపైగా ఓట్లు పోస్టల్ బ్యాలెట్ రూపంలో రావడం, వాటిని ఎప్పటి వరకు స్వీకరించాలి, ఎలా లెక్కబెట్టాలనే దానిపై రాష్ట్రాల్లో వేర్వేరు నిబంధనలు ఉండటంతో ఫలితాల వెల్లడిలో గందరగోళం ఏర్పడింది. ఎలక్షన్ డే(మంగళవారం) ముగిసి ఐదు రోజులవుతున్నా ఇంకా పోస్టల్ బ్యాలెట్లు లెక్కిండం కుట్రే అని, కౌంటింగ్ కేంద్రాల్లోకి రిపబ్లికన్ పరిశీలకులను అనుమతించడం లేదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపిస్తున్నారు. తాజాగా తాను 71 మిలియన్ (7 కోట్ల) లీగల్ ఓట్లతో గెలుపొందానని ఆయన ప్రకటించుకున్నారు.

 అడగని వాళ్లకూ బ్యాలెట్ పంపారు..

అడగని వాళ్లకూ బ్యాలెట్ పంపారు..

‘‘అమెరికా చరిత్రలోనే ఇదొక అద్భుతమైన గెలుపు. ఒక సిట్టింగ్ ప్రెసిడెంట్ కు ఏకంగా 71 మిలియన్ల ఓట్లు రావడం గొప్ప విషయం. ఈ 7 కోట్ల ఓట్లూ నాకు లీగల్ గా వచ్చినవే. తద్వారా నేనే గెలిచాను. ఎన్నికల్లో జరిగిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. మా అబ్జర్వర్లను కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా.. అడగని వాళ్లకు కూడా కోట్ల సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్లను పంపారు'' అని ట్రంప్ మండిపడ్డారు. జోబైడెన్ విజయం ఖరారైన తర్వాత కూడా ట్రంప్ ఈ తరహా ప్రకటనలు చేయడంతో రిపబ్లికన్ మద్దతుదారులు రెచ్చిపోయారు..

ట్రంప్ ఖేల్ ఖతం: దుకాణం సర్దేశాడా? -వైట్‌హౌజ్‌ ఖాళీకి సామాన్ల తరలిపు వ్యాన్ -వైరల్ వీడియోట్రంప్ ఖేల్ ఖతం: దుకాణం సర్దేశాడా? -వైట్‌హౌజ్‌ ఖాళీకి సామాన్ల తరలిపు వ్యాన్ -వైరల్ వీడియో

అమెరికాలో అల్లకల్లోలం..

అమెరికాలో అల్లకల్లోలం..

ఎన్నికల్లో 71 మిలియన్ ఓట్లతో తానే గెలిచానని ట్రంప్ ప్రకటించుకున్న కాసేపటికే అమెరికా వ్యాప్తంగా అల్లర్లు మొదలయ్యాయి. పలు రాష్ట్రాల్లోని ట్రంప్ మద్దతుదారులు తుపాకులు చేతపట్టి వీధుల్లోకి దూసుకొచ్చారు. ఎన్నికల ఫలితాలను ఖండిస్తూ, జోబైడెన్ అక్రమంగా గెలిచాడని, అసలైన విజయం ట్రంప్ దే అని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అప్పటికే రోడ్లపైన చేరి సంబురాలు చేసుకుంటోన్న బైడెన్ మద్దతుదారులపై ట్రంప్ అనుకూల గ్యాంగులు దాడులకు పాల్పడ్డాయి.వాషింగ్టన్, న్యూయార్క్, మిచిగన్, ఓరెగాన్ తదితర రాష్ట్రాల్లో ట్రంప్ వర్గం దాడులకు పాల్పడుతోన్న ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి.

పెప్పర్ స్ప్రే, బ్యాట్లతో విధ్వంసం..

పెప్పర్ స్ప్రే, బ్యాట్లతో విధ్వంసం..

అమెరికా కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నానికే బైడెన్ గెలుపు ఖరారైనట్లు వెల్లడైంది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలు, కౌంటీల్లో డెమోక్రటిక్ మద్దతుదారులు పెద్ద ఎత్తున సంబురాలు ప్రారంభించారు. పబ్లిక్ ప్లేసుల్లో డీజే సౌండ్లతో డ్యాన్సులు చేశారు. ఆ తర్వాత ట్రంప్ వరుస ప్రకటనలతో ఆయన సపోర్టర్లు సైతం వీధుల్లోకి రావడంతో చాలా చోట్ల వాతావరణం మారిపోయింది. వాషింగ్టన్, న్యూయార్క్, మిచిగన్, ఓరెగాన్ రాష్ట్రాల్లో ట్రంప్ అనుకూల నిరసనకారులు.. రోడ్లపై వీరంగం సృష్టించారు. కంటికి కనిపించినవాళ్లందరిపైనా పెప్పర్ స్ప్రే చల్లుతూ, బేస్ బాల్ బ్యాట్లతో రోడ్లపై వెళుతోన్న కార్లను ధ్వంసం చేశారు. ఇలాంటి విధ్వంసకాండలు దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి రిపోర్ట్ అవుతున్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నిస్తోంది..

English summary
I WON THE ELECTION, GOT 71,000,000 LEGAL VOTES, says us president donald trump on latest tweet. pro-Trump citizens have taken to the streets, claiming that President Trump had won re-election, refusing to accept a race that has been called by ever major poll. Pro-Trump, right-wing groups using pepper spray on people and attacking vehicles with baseball bats. meanwhile With Biden's victory safely in the bag, cities across America have erupted in joy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X