వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాతో భారత్‌కు సరిహద్దు లేదట: షాక్‌లో మోడీ, డొనాల్డ్ ట్రంప్ పరిజ్ఞానం ఈపాటిదేనట!

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: భారత్-చైనా సరిహద్దులను పంచుకుంటాయనే విషయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు తెలియదట. ఈ విషయాన్ని తాజాగా వెలువడిన ఓ పుస్తకం వెల్లడించింది. వాషింగ్టన్ పోస్ట్‌కు చెందిన ఇద్దరు పాత్రికేయులు ఫిలిప్ రుకర్, కరోల్ లియోనిగ్ రాస్తున్న పుస్తకం 'ఏ వెరీ స్టేబుల్ జీనియస్'లో ఈ మేరకు పేర్కొన్నారు.

చైనాతో భారత్ సరిహద్దు లేదంటూ ట్రంప్..

చైనాతో భారత్ సరిహద్దు లేదంటూ ట్రంప్..

భారత ప్రధాని నరేంద్ర మోడీతో జరిగిన సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పుకొచ్చారు. మోడీతో ట్రంప్ సమావేశం సందర్భంగా చైనా.. భారత్‌తో సరిహద్దును పంచుకోవడం లేదు అన్నారు.

ట్రంప్ మాటకు మోడీ షాక్..

ట్రంప్ మాటకు మోడీ షాక్..

ట్రంప్ చెప్పిన మాట విని మోడీ ఆశ్చర్యపోయారని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. అంతేగాక, ట్రంప్ ఏ మాత్రం సీరియస్‌గా ఉన్నట్లు కనిపించడం లేదని మోడీ ట్రంప్ సహాయకుడితో వ్యాఖ్యానించినట్లు పుస్తంలో రాసుకొచ్చారు. భేటీ తర్వాత అమెరికాతో దౌత్య సంబంధాలలో భారత్ ఒక అడుగు వెనుకకు వేసిందని పేర్కొన్నారు. పంచంలో జరిగిన కొన్ని చారిత్రాత్మక సంఘటనల గురించి డొనాల్డ్ ట్రంప్‌కు ఏ మాత్రం అవగాహన లేదని ఈ పుస్తకంలో వెల్లడించారు.

మోడీకి హార్బర్ దాడి గురించి కూడా తెలియదు..

మోడీకి హార్బర్ దాడి గురించి కూడా తెలియదు..

1941 డిసెంబర్‌లో జపాన్ పెరల్ హార్బర్‌పై దాడి చేసిన ఘటన గురించి కూడా ట్రంప్‌కు ఏమీ తెలియదని పేర్కొన్నారు. సదరు పుస్తకంలోని ఈ పరిణామాలను వాషింగ్టన్ పోస్టు బుధవారం ప్రచురించింది. భారత్-చైనా మధ్య 3,488 కి.మీ పొడవైన సరిహద్దు ఉందని, ఇందులో పలు ప్రాంతాల్లో భూభాగం విషయమై ఉభయ దేశాల మధ్య దశాబ్ధాలుగా పరిష్కారం కాని వివాదమున్నదని పేర్కొంది. కాగా, ట్రంప్ పాలనపై, రష్యాపై చేసిన రచనలకు గానూ 2018లో ఈ రచయితలిద్దరికీ పులిట్జర్ బహుబతి లభించింది.

తెలివైనవాడినంటూ.. ప్రసంగాల్లో దోషాలు..

తెలివైనవాడినంటూ.. ప్రసంగాల్లో దోషాలు..

ప్రపంచంలో జరిగిన చాలా విషయాలపై తనకు పూర్తి అవగాహన ఉందని, తాను చాలా తెలివైన వ్యక్తిగా ట్రంప్ పలుమార్లు ప్రకటించుకున్న విషయం తెలిసిందే. అయితే, చాలాసార్లు ఆయన జ్ఞానం ఏ పాటిదో ప్రపంచానికి తెలియజేశారు. ఓ సందర్భంలో నేపాల్, భూటాన్ భారత్‌లోనే ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. దేశాల పేర్లను కూడా ఆయన సరిగా పలకలేకపోవడం గమనార్హం. నేపాల్ దేశాన్ని నిపుల్ అని, భూటాన్ దేశాన్ని బటన్ అని పలికి ట్రంప్ తన అవగాహన ఏ పాటిదో చాటుకున్నారు.

English summary
US President Donald Trump once left Prime Minister Narendra Modi shocked and concerned by telling him India and China didn't share a border, a new book by two Pulitzer-winning journalists claims.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X