• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమెరికన్‌ డ్రీమర్స్‌పై ట్రంప్‌ కత్తి.. 7 వేలమంది భారతీయ అమెరికన్లకు గండం!

By Ramesh Babu
|

వాషింగ్టన్‌ : అమెరికాలో నివసించడానికి, పనిచేయడానికి అనుమతించే అధికారిక పత్రాలు లేని ఏడు వేల మంది భారతీయ అమెరికన్‌ యువకులు సహా దాదాపు 8 లక్షల మంది వర్క్ పర్మిట్లు రద్దుపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం ప్రకటన చేయనున్నారు.

దీంతో భారతీయ అమెరికన్లలో గుబులు మొదలైంది. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో వీరికి కొంత ఊరట లభించింది. ఇప్పుడు ట్రంప్ దృష్టి తమపై పడడంతో ఏ క్షణంలో ఆయన ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తారో, అమెరికా విడిచిపెట్టి స్వదేశాలకు వెళ్లిపొమ్మంటారేమో అనే భయం భారతీయ అమెరికన్లను వెంటాడుతోంది.

ఎవరీ అమెరికన్ డ్రీమర్లు?

ఎవరీ అమెరికన్ డ్రీమర్లు?

ఇతర దేశాల నుంచి తమ తల్లిదండ్రులతో పాటు వచ్చిన పిల్లలే ఈ యువకులు. వారిని అమెరికాలో డ్రీమర్లు(స్వాప్నికులు) అని పిలుస్తారు. అమెరికాలో జీవించడానికి, పనిచేయడానికి అవసరమైన డాక్యుమెంట్లు లేకున్నా ఈ పిల్లలు అమెరికాలోనే చదువుకుని, పెరిగి పెద్దయి, ఇక్కడే ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. వారిలో అత్యధికశాతం పొరుగుదేశమైన మెక్సికో, మధ్య, దక్షిణ అమెరికా దేశాల్లో పుట్టారు. ఇండియా, వియత్నాం వంటి ఆసియా దేశాలకు చెందిన ఇలాంటి యువకుల వాటా తొమ్మిది శాతానికి మించదని అంచనా.

డ్రీమర్ల వల్ల అమెరికన్లకు హాని?

డ్రీమర్ల వల్ల అమెరికన్లకు హాని?

ఈ అమెరికన్ డ్రీమర్ల వల్ల స్థానిక అమెరికన్లకు హాని జరుగుతోందని, డ్రీమర్లలో కొందరు చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారనేది ట్రంప్‌ మద్దతుదారుల ఆరోపణ. డ్రీమర్లకు రెన్యూవల్‌ సౌకర్యం తొలగించి, వారు జన్మించిన దేశాలకు పంపించేయాలనే డిమాండ్‌ రెండేళ్ల క్రితమే మొదలైంది. అమెరికన్లకు కష్టాలు వలసొచ్చిన వారి వల్లేననే వాదనకు ట్రంప్‌ హయాంలో మరింత బలం చేకూరింది. అయితే, ఇన్ని లక్షల మందిని అర్ధంతరంగా వారెరగని దేశాలకు పంపడం అన్యాయమని అన్ని పార్టీలకు చెందిన చాలా మంది నేతలు గుర్తించారు.

దయ చూపిన ఒబామా ప్రభుత్వం...

దయ చూపిన ఒబామా ప్రభుత్వం...

తల్లిదండ్రుల కారణంగా అమెరికా వచ్చిన ఈ డ్రీమర్లు దేశ ఆర్థికవ్యవస్థ బలోపేతానికి కృష్టిచేస్తున్న కారణంగా వారిపై దయ చూపాలేగాని, శిక్షించరాదనే అభిప్రాయంతో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఏకీభవించారు. 2012లో ఆయన ఈ అమెరికన్ డ్రీమర్లకు ఈ మేరకు వెసులుబాటు కల్పించారు. దేశంలో పెరిగి ఉద్యోగాలు చేస్తున్న స్వాప్నికులను వారు పుట్టిన దేశాలకు పంపకుండా కాపాడడానికి 'బాల్యంలోనే వచ్చిన వారిపై చర్యల వాయిదా'(డిఫర్డ్ యాక్షన్‌ ఫర్‌ చైల్డ్‌హుడ్‌ అరైవల్స్‌-డాకా) అనే సహాయ కార్యక్రమాన్ని 2012 జూన్15న ఒబామా ప్రకటించారు. అమెరికా ఫెడరల్‌ సర్కారు నిధులతో అమలయ్యే ఈ కార్యక్రమం కింద లబ్ధి పొందడానికి దాదాపు 8 లక్షల మంది పెట్టుకున్న దరఖాస్తులను ఆమోదించారు.

ప్రతి రెండేళ్లకు వర్క్‌ పర్మిట్ల పొడిగింపు...

ప్రతి రెండేళ్లకు వర్క్‌ పర్మిట్ల పొడిగింపు...

అమెరికాలో డాకా ప్రోగ్రాం కింద అర్హత పొందిన యువతీ యువకులు ప్రతి రెండేళ్లకు తమ వర్క్‌ పర్మిట్లను పొడిగించుకునే అవకాశం కల్పించారు. అయితే ఈ రెన్యూవల్‌ సౌకర్యం తొలగించి, వారు జన్మించిన దేశాలకు పంపించడానికి వీలుగా డాకాను రద్దుచేయాలనే డిమాండ్‌ రెండేళ్ల క్రితమే మొదలైంది. అమెరికన్లకు కష్టాలు వలసొచ్చినవారి వల్లేననే వాదనకు ట్రంప్‌ హయాంలో బలం చేకూరింది. అయితే, ఇన్ని లక్షల మందిని అర్ధంతరంగా వారెరగని దేశాలకు పంపడం అన్యాయమని అన్ని పార్టీలకు చెందిన చాలా మంది నేతలు గుర్తించారు.

డాకా ప్రోగ్రాం రద్దుకు వ్యతిరేకంగా...

డాకా ప్రోగ్రాం రద్దుకు వ్యతిరేకంగా...

యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌, మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యా నాదెళ్ల వంటి మెగా టెక్‌ కంపెనీల ఉన్నతాధికారులు సైతం ఈ డాకా ప్రోగ్రాం రద్దును వ్యతిరేకిస్తున్నారు. పాలకపక్షమైన రిపబ్లికన్‌ పార్టీకి చెందిన సెనేటర్లు, ప్రతినిధుల సభ సభ్యులు, స్పీకర్‌ కూడా డ్రీమర్లకు డాకా ద్వారా లభిస్తున్న సౌకర్యాలు రద్దు చేయకూడదనే కోరుతున్నారు. అందుకే మంగళవారం ట్రంప్‌ వెంటనే డాకా రద్దుచేయకుండా ఆరు నెలలు యధాతథ స్థితి కొనసాగడానికి అవకాశమిస్తారని భావిస్తున్నారు. వర్క్‌ పర్మిట్లు ఇక ముందు పొడిగించుకునే వీలులేకుండా దాని స్థానంలో కొత్త చట్టం చేయాలని అమెరికా కాంగ్రెస్‌ను ట్రంప్‌ కోరవచ్చని అమెరికా మీడియా సంస్థలు అంచనా వేస్తున్నాయి.

English summary
US President Donald Trump is set to scrap a programme that grants work permits to immigrants who arrived in the country illegally as children, a move likely to impact more than 7,000 Indian-Americans, a media report said today. The programme -- Deferred Action for Children Arrival (DACA) -- was a key immigration reform of the former US President Barack Obama. White House Press Secretary Sarah Sanders told reporters on Friday that Trump would take a decision on the issue tomorrow. However, Politico in an exclusive story reported Sunday that Trump has already decided to rescind this programme and senior administration officials are now discussing the rollout of his decision which could come later this week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X