వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాత్కాలిక ఉపశమనం: ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతిపై తాత్కాలికంగా ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్న దేశాలపై తాత్కాలికంగా ఆంక్షలు తొలగించారు. ఇ:దులో చైనా భారత్ దేశాలు కూడా ఉన్నాయి. ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతులు చేసుకుంటున్న దేశాలకు తాత్కాలికంగా ఉపశమనం కల్గిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్ ధరలను నియంత్రణలోకి తీసుకురావడం మార్కట్లను కంట్రోల్ చేయడం కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు డొనాల్డ్ ట్రంప్.

ముందుగా సోమవారం రోజున అమెరికా ఇరాన్‌పై తీవ్రమైన ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా ఇరాన్ బ్యాంకింగ్, ఎనర్జీ రంగాలపై ఆంక్షలు విధించింది. అంతేకాదు ఈ రంగాల్లో యూరోప్, ఆసియా ఖండాలకు చెందిన దేశాలు ఇరాన్‌తో సంబంధాలు నెరిపితే ఆ దేశాలపై చర్యలకు ఉపక్రమిస్తామని అమెరికా హెచ్చరించింది. అంతేకాదు ఇతర ఖండాలకు చెందిన దేశాలు కూడా ఇరాన్‌ నుంచి ఆయిల్ దిగుమతులు చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రంప్ సర్కార్ హెచ్చరించింది.

Trump gives temporary exemptions to India and other countries on oil exporting from Iran

ఇదిలా ఉంటే అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపే ఎనిమిది దేశాలకు ఆంక్షల నుంచి ఉపశమనం కలిగిస్తున్నట్లు తెలిపారు. ఆదేశాలు భారత్, చైనా, ఇటలీ, గ్రీస్, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, టర్కీ దేశాలపై తాత్కాలికంగా ఆంక్షలు ఎత్తి వేస్తున్నట్లు తెలిపారు. ఈ దేశాలు ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతులు చేసుకోవచ్చని తెలిపారు. ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంతగా కఠిన ఆంక్షలు ఇరాన్‌పై విధించామని చెప్పిన ట్రంప్... ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్ ధరలు పెరిగిపోతూ ఆర్థిక వ్యవస్థలు ఛిన్నాభిన్నం కాకూడదనే ఒకే ఒక్క ఆలోచనతో కాస్త వెనక్కి తగ్గినట్టు తెలిపారు. అయితే ఇలా ఆంక్షలు సడలించడం ద్వారా తాను ఏదో హీరో కావాలని కాదు కానీ... ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకునే తాత్కాలిక ఉపశమనం కలిగించినట్లు ట్రంప్ తెలిపారు.

English summary
US President Donald Trump on Monday defended his decision to give temporary exemptions to eight countries, including India and China, from the ban on Iranian oil imports, saying it was done so to keep global oil prices down and avoid causing a shock to the market.The US on Monday imposed "the toughest ever" sanctions on a defiant Iran aimed at altering the Iranian regime's "behaviour". The sanctions cover Iran's banking and energy sectors and reinstate penalties for countries and companies in Europe, Asia and elsewhere that do not halt Iranian oil imports.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X