వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Trump Impeachment : ట్రంప్‌ భవిష్యత్తేంటి ? చర్యలపై ఉత్కంఠ- అత్యవసర భేటీకి సెనేట్ నో

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష పదవిలో ఉంటూ కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌కు వ్యతిరేకంగా తన మద్దతుదారులను రెచ్చగొట్టిన వ్యవహారంలో ట్రంప్‌పై ప్రవేశపెట్టిన అభిశంసనను ప్రతినిధుల సభ ఆమోదించింది. అయితే ఆ తర్వాత ఏం జరగబోతోందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి ట్రంప్‌ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాల్సిన సెనేట్‌కు ప్రస్తుతం సెలవులు ప్రకటించారు. కానీ ట్రంప్‌ అభిశంసన తర్వాత అత్యవసర సమావేశం నిర్వహించేందుకు సెనేట్‌ ముందుకు రాకపోవడంతో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ పెరుగుతోంది.

Recommended Video

Donald Trump Impeachment : ట్రంప్‌ అభిశంసన తర్వాత ఏం జరగబోతోంది ? ట్రంప్‌ పై చర్యలు...!! || Oneindia
ట్రంప్‌ అభిశంసన తర్వాత ఏం జరగబోతోంది ?

ట్రంప్‌ అభిశంసన తర్వాత ఏం జరగబోతోంది ?

అమెరికా క్యాపిటల్‌ భవనంపై దాడికి తన మద్దతుదారులను పురికొల్పారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న డొనాల్ట్‌ ట్రంప్‌ను ప్రతినిధుల సభ అభిశంసించింది. ఈ మేరకు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ 232-197 ఓట్ల తేడాతో ఆమోదించింది. ఈ తీర్మానం ఆమోదంతో అమెరికన్‌ పార్లమెంటులోని రెండు సభల్లో ప్రతినిధుల సభ అభిశంసన పూర్తయినట్లయింది. తదుపరి సెనేట్‌లోనూ ట్రంప్‌పై అభియోగాలు నిర్ధారిస్తూ నిర్ణయం తీసుకుంటే ట్రంప్‌ భవిష్యత్తు ఏమవుతుందో స్పష్టత రానుంది. దీంతో ట్రంప్‌ విషయంలో సెనేట్‌ నిర్ణయం కీలకంగా మారింది.

 అమెరికన్‌ సెనేట్‌కు సెలవులు

అమెరికన్‌ సెనేట్‌కు సెలవులు

ప్రస్తుతం అమెరికా రెండు చట్టసభల్లో ఒకటైన సెనేట్‌కు సెలవులు ప్రకటించారు. జనవరి 19న సెనేట్‌ తిరిగి సమావేశం కావాల్సి ఉంది. జనవరి 20న అమెరికా కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం ఉంది. అంటే జనవరి 19న సమావేశమై ట్రంప్‌ భవిష్యత్తుపై సెనేట్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ మేరకు ప్రతినిధుల సభ ఆమోదించిన అభిశంసన దస్త్రాన్ని డెమోక్రాట్లు సెనేట్‌కు పంపుతున్నారు. ట్రంప్‌పై దాఖలైన అభియోగాలను సెనేట్‌ విచారించి నిర్ణయం తీసుకోవాలంటే కొంత సమయం పడుతుంది. కానీ జనవరి 20న కొత్త అధ్యక్షుడిగా బైడెన్‌ ప్రమాణ స్వీకారం చేయగానే ట్రంప్‌ వైట్‌హౌస్‌ వీడిపోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కానీ సెనేట్‌ నిర్ణయం తీసుకునే పరిస్దితి లేదు.

 అత్యవసర భేటీకి సెనేట్ నిరాకరణ

అత్యవసర భేటీకి సెనేట్ నిరాకరణ

క్యాపిటల్‌ హిల్‌ భవనంపై దాడికి సంబంధించి డొనాల్డ్‌ ట్రంప్‌ను ప్రతినిధుల సభ అభిశంసించిన తర్వాత సెనేట్‌కు దస్త్రం చేరినా ప్రస్తుతం సభకు సెలవులు ప్రకటించారు కాబట్టి దీనిపై ఎలాంటి పురోగతి ఉండదు. కాబట్టి బైడెన్‌ పదవి చేపట్టే లోపే ట్రంప్‌పై చర్యలు తీసుకునేందుకు సెనేట్‌ను అత్యవసర సమావేశం నిర్వహించాలని డెమోక్రాట్లు కోరారు. కానీ అత్యవసరంగా భేటీ అయ్యేందుకు సేనెట్‌ నిరాకరించడంతో వారికి గట్టి ఎధురుదెబ్బ తగిలినట్లయింది. ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు బలంగా ఉంటే సెనేట్‌లో మాత్రం రిపబ్లికన్ల ఆధిక్యం ఉంది. అయినా రిపబ్లికన్లలో చాలా మంది ట్రంప్‌ను వ్యతిరేకిస్తున్నారు. కానీ ట్రంప్‌పై తక్షణ చర్యలకు వారు కూడా సిద్ధంగా లేరు.

ట్రంప్‌ భవిష్యత్తులో పోటీ చేయకుండా అనర్హత ?

ట్రంప్‌ భవిష్యత్తులో పోటీ చేయకుండా అనర్హత ?

అమెరికా అధ్యక్షుడిగా ఉంటూ రెండుసార్లు అభిశంసనకు గురైన డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రస్తుతం ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. మరో ఐదు రోజులు గడిస్తేనే కానీ సెనేట్‌ భేటీ కాదు. జనవరి 19న భేటీ అయినా అదే రోజు ట్రంప్‌ విషయంలో నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి జనవరి 20న బైడెన్‌ పగ్గాలు చేపట్టాక ట్రంప్ పదవి నుంచి తప్పుకుంటారు.

ఆ తర్వాతే సెనేట్‌ ట్రంప్‌ భవిష్యత్తుపై చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ట్రంప్‌ను దోషిగా నిర్ధారించడం వరకే సెనేట్‌ పని అని యూఎస్‌ కోర్టు జడ్జి ఒకరు వాష్టింగ్టన్‌ పోస్టుకు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. అటు సెనేట్‌లో ఉన్న 100 మంది సభ్యుల్లో మూడింట రెండో వంతు అంటే 67 మంది మద్దతు ఇస్తే ట్రంప్‌ను దోషిగా నిర్ధారించేందుకు వీలు కలుగుతుంది. అదే ట్రంప్‌ను భవిష్యత్తులో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా నిలువరించాలంటే సాధారణ మెజారిటీ అయిన 51 సభ్యుల బలం సరిపోతుంది. అదే జరిగితే ట్రంప్‌కు 2024 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోతుంది.

English summary
Donald Trump's political fate is now in the hands of the US Senate, which will hold an impeachment trial to determine whether Trump should be convicted
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X