వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Witch hunt: డొనాల్డ్ ట్రంప్ ఛరిష్మా తగ్గట్లేదుగా: యూఎస్ సెనెట్ మళ్లీ ప్రయత్నించినా

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్.. మాజీ అయినప్పటికీ.. ఆయన ఛరిష్మా ఏ మాత్రం తగ్గట్లేదు. అమెరికా సెనెట్‌పై ఆయనకు ఉన్న పట్టు సడల్లేదు. కిందటి నెల వాషింగ్టన్‌లో చోటు చేసుకున్న హింసాత్మక పరిస్థితులు, అల్లర్లకు డొనాల్డ్ ట్రంపే కారణమంటూ ఆయనపై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం సెనెట్‌లో వీగిపోయింది. పలువురు రిపబ్లికన్ పార్టీ సభ్యులు ఆయనకు అండగా నిలిచారు. ఈ తీర్మానం వీగిపోవడంతో వాషింగ్టన్ అల్లర్ల వ్యవహారంలో డొనాల్డ్ ట్రంప్.. నిర్దోషిగా బయటపడినట్టయింది. దీనిపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. తన ప్రజాబలం తగ్గలేదని రుజువైందని వ్యాఖ్యానించారు.

 ట్రంప్ కొత్త పార్టీ?: పేరు ఖరారు: టార్గెట్ 2024: బిడెన్‌‌ కంటి మీద కునుకు లేకుండా స్కెచ్ ట్రంప్ కొత్త పార్టీ?: పేరు ఖరారు: టార్గెట్ 2024: బిడెన్‌‌ కంటి మీద కునుకు లేకుండా స్కెచ్

వాషింగ్టన్‌లో చోటు చేసుకున్న హింసాత్మక పరిస్థితులు, పార్లమెంట్ భవనంపై దాడి వంటి ఘటనలకు డొనాల్డ్ ట్రంప్ కారణమంటూ యూఎస్ సెనెట్ ఆయనపై రెండోసారి అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. వరుసగా అయిదు రోజుల పాటు దీనిపై చర్చ కొనసాగింది. అనంతరం తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు. ఈ తీర్మానం.. 57-43తో వీగిపోయింది. ట్రంప్‌‌ను అభిశంసించడానికి డెమొక్రాట్లు చేసిన ప్రయత్నాలు మరోసారి బెడిసికొట్టినట్టయింది. ట్రంప్‌ను అభిశంసించాలంటూ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి అనుకూలంగా 43 మంది, వ్యతిరేకంగా 57 మంది ఓటు వేశారు.

Trump impeachment trial: Senate acquits former president for second time

అమెరికా అధ్యక్ష చరిత్రలో ఇప్పటిదాకా నాలుగుసార్లు అభిశంసన తీర్మానాలు ప్రవేశపెట్టగా.. ఒక్క డొనాల్డ్ ట్రంపే రెండుసార్లు దాన్ని ఎదుర్కొన్నారు. ఆయనను అభిశంసించడానికి డెమొక్రాట్లు వరుసగా చేసిన రెండు ప్రయత్నాలు విఫలం అయ్యాయి. అభిశంసన తీర్మానం వీగిపోయిన అనంతరం.. డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. ఇప్పటికీ తనకు ప్రజాబలం తగ్గలేదని మరోొసారి రుజువైందని పేర్కొన్నారు. ఒక నాయకుడిపై రెండుసార్లు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టి.. ఎదురుదెబ్బలు తిన్న నేతలుగా డెమొక్రాట్లు చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు. దీన్ని విచ్ హంట్‌ (Witch hunt)గా ఆయన అభివర్ణించారు.

English summary
US Senate acquits Donald Trump in impeachment trial on charge of inciting insurrection. Many Republicans back former president. The Senate on Saturday acquitted former President Donald Trump in a 57-43 vote in his second impeachment trial.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X