వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డొనాల్డ్ ట్రంప్ రాజీనామా?: అభిశంసనకు ముందే: పదవీకాలం ముగిసినట్టు వెల్లడి: ఊహించని ట్విస్టులు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసన వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతోన్నాయి. వాషింగ్టన్‌లోని అమెరికా పార్లమెంట్ భవనం.. కేపిటల్ బిల్డింగ్‌పై డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుల భీకర దాడి అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు ఆయన కుర్చీకి ఎసరు పెట్టాయి. ఆయనను పదవి నుంచి ఉద్వాసన పలకడానికి కారణం అయ్యాయి. దీనికోసం అభిశంసన తీర్మానాన్ని అమెరికా ఉభయసభలో ప్రవేశపెట్టిన వెళ.. ట్రంప్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.

ట్రంప్ రాజీనామా చేశారా?

అభిశంసన తీర్మానాన్ని హౌస్‌లో ప్రవేశపెట్టడానికి ముందే డొనాల్డ్ ట్రంప్ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారనే ప్రచారం సాగుతోంది. అభిశంసన తీర్మానం ఆమోదం పొందడానికి అవసరమైనంత బలం డెమొక్రాట్లకు యూఎస్ కాంగ్రెస్, సెనెట్‌లో ఉండటం, సొంత పార్టీ రిపబ్లికన్ సెనెటర్లు కూడా మద్దతు పలకడం వంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఆయన తన పదవికి రాజీనామా చేశారని చెబుతున్నారు. అభిశంసన తీర్మానం నెగ్గుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని అంటున్నారు.

యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఏం చెబుతోంది?

అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవీకాలం 11వ తేదీన సాయంత్రం 7:48 నిమిషాలకు ముగిసినట్లు యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని తన అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ పదవీకాలం కూడా అదే సమయానికి ముగిసినట్లు తెలిపింది. ఇదొక అనూహ్య పరిణామంగా భావిస్తున్నారు. యూఎస్ హౌస్‌లో అభిశంసన తీర్మానాన్ని మైక్ పెన్స్ ప్రవేశపెట్టడానికి ముందే ఆయన పదవీకాలం ముగిసినట్లు ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

అభిశంసనపై కౌంటర్ అటాక్‌గా..

అభిశంసనపై కౌంటర్ అటాక్‌గా..

అభిశంసించడం ద్వారా పదవిని కోల్పోయిన అధ్యక్షుడిగా చరిత్రలో నిలిచిపోవాల్సి వస్తుందనే కారణంతో.. డొనాల్డ్ ట్రంప్ ముందుగానే రాజీనామా చేశారనే ప్రచారం సాగుతోంది. ఎనిమిదో తేదీ నాడే ట్రంప్ రాజీనామా చేశారని కూడా అంటున్నారు. 25వ సవరణ ద్వారా ఆయనకు ఉద్వాసన పలకాలని కేబినెట్‌లో చర్చకు వచ్చినప్పుడే ఆయన వైదొలిగారని, ఆ సమాచారాన్ని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికారికంగా ప్రకటించిందనే అభిప్రాయాలు సైతం వ్యక్తమౌతున్నాయి. ట్రంప్ రాజీనామా చేశారనే విషయాన్ని మాత్రం ఎవరూ నిర్ధారించట్లేదు. వైట్‌హౌస్ కూడా దీనిపై ఎలాంటి ప్రకటనను విడుదల చేయలేదు.

Recommended Video

Khammam Corporation Elections: ఖమ్మంలో కాషాయ జెండా - Bandi Sanjay | BJP rally in Khammam
బుధవారం ఓటింగ్..

బుధవారం ఓటింగ్..

మరోవంక- ట్రంప్‌ను అభిశంసించడానికి అవసరమైన ఏర్పాట్లు యూఎస్ కాంగ్రెస్, సెనెట్‌లో చకచకా సాగుతున్నాయి. దీనికి అవసరమైన తీర్మానాన్ని డెమొక్రాట్లు ప్రవేశపెట్టారు. దీనిపై విస్తృతంగా చర్చించిన అనంతరం ఓటింగ్ ఉంటుంది. బుధవారం ఉదయం 9 గంటలకు ఓటింగ్ నిర్వహిస్తారని అమెరికన్ మీడియా వెల్లడించింది. తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి కొందరు రిపబ్లికన్ పార్టీ సభ్యులు మద్దతు పలకుతుండగా.. మెజారిటీ మెంబర్లు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్‌నకు ఒక్క రోజు కూడా అమెరికా అధ్యక్షుడిగా కొనసాగే అర్హత లేదంటూ ఇదివరకు తాను చేసిన వ్యాఖ్యానాలను పెలోసీ.. సమర్థించుకున్నారు.

English summary
Impeach of US President Donald Trump grow stronger within the political corridors of Washington, the US State Department decided that Trump's presidency has already ended. On Monday, a message claiming that Donald Trump's presidency ended on January 11.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X