వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేకప్ అమెరికా..చంద్రుడిపై ట్రంప్: 19వ శతాబ్దం నాటి సెటైరికల్ పాలిటిక్స్: కరోనా పోస్టర్ కలకలం

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అధ్యక్ష ఎన్నికలు సమీపించి వేళ.. అమెరికాలో ఓ పొలిటికల్ సెటైరికల్ పోస్టర్ ఒకటి కలకలం రేపుతోంది. కరోనా వైరస్ వల్ల అల్లకల్లోలానికి గురైన అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో స్వయంగా డిజైన్ చేసిన పోస్టర్ అది. లక్షా 30 వేల మందికి పైగా మృత్యువాత పడిన అమెరికాలో కరోనా వైరస్ సృష్టించిన పరిస్థితులకు అద్దం పట్టేలా ఈ పోస్టర్ ఉందని అంటున్నారు. ఈ పోస్టర్‌ను విడుదల చేసిన కొద్దిసేపట్లోనే ఇది వైరల్‌గా మారింది. నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

యూకేలో సెకెండ్‌వేవ్: మృత్యుముఖంలోకి బ్రిటన్: చలికాలం: లక్ష మంది ప్రాణాలకు నో గ్యారంటీయూకేలో సెకెండ్‌వేవ్: మృత్యుముఖంలోకి బ్రిటన్: చలికాలం: లక్ష మంది ప్రాణాలకు నో గ్యారంటీ

చంద్రుడిపై ట్రంప్

కరోనా వైరస్ అనే ఓ కొండను అధిగమించడానికి అమెరికన్ పౌరులు చేస్తోన్న ప్రయత్నాలకు అద్దం పట్టేలా దీన్ని డిజైన్ చేశారు. డాక్టర్లు, నర్సులు, ఇతర హెల్త్ వర్కర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులను ఫ్రంట్‌లైన్ వారియర్లుగా చిత్రీకరించారు. కరోనా శిఖరాన్ని అధిరోహించడానికి వారు చేస్తోన్న ప్రయత్నాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చంద్రుడిపై కూర్చుని తిలకిస్తున్నట్లుగా చిత్రీకరించారు. వేకప్ అమెరికా..ఫర్గెట్ ద పాలిటిక్స్, గెట్ స్మార్ట్ అనే క్యాప్షన్‌ను దానికి జత చేశారు.

కరోనా వైరస్‌తో పోరాటం..

మార్చి 1వ తేదీన న్యూయార్క్‌లో కరోనా వైరస్ కల్లోలం ఆరంభమైందని.. కిందటి నెల (జూన్) 19వ తేదీ నాటికి ఒక్క న్యూయార్క్‌లోనే 1220 ఆసుపత్రులను ప్రభుత్వం నిర్మించిందనే అర్థం వచ్చేలా ఈ పోస్టర్‌ను రూపొందించారు. కరోనా విజ‌ృంభణ ఆరంభమైనప్పటి నుంచీ దాన్ని నియంత్రించడానికి చేస్తోన్న పోరాటాన్ని ప్రతిబింబింపజేశారు. న్యూయార్క్ స్థానిక ప్రభుత్వం తీసుకుంటోన్న అలాంటి చర్యలన్నింటినీ ఇందులో పొందుపరిచారు. 19వ శతాబ్దం నాటి వాతావరణాన్ని, సెటైరికల్ పాలిటిక్స్‌ను మిళితం చేశారు.

Recommended Video

US Announces Visa Restrictions On Chinese Officials | టిబెట్ యాక్ట్ ప్రయోగం || Oneindia Telugu
 అంతా బాగానే ఉన్నప్పటికీ..

అంతా బాగానే ఉన్నప్పటికీ..

ఈ పోస్టర్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. పోస్టర్ అంతా బాగానే ఉన్నప్పటికీ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చంద్రుడిపై కూర్చున్నట్లుగా చిత్రీకరించడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కరోనా వైరస్‌పై ఫ్రంట్‌లైన్ వారియర్లు చేస్తోన్న పోరాటాన్ని డొనాల్డ్ ట్రంప్ చంద్రుడిపై కూర్చుని లగ్జరీగా చూస్తూ కాలక్షేపం చేస్తున్నారంటూ ప్రత్యర్థుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడి ఎన్నికల వేళ.. ఇలాంటి పోస్టర్ వెలువడటం ప్రజల్లో ఎలాంటి సంకేతాలను పంపించిందనే అంశంపై అధికార పార్టీ ఆరా తీస్తోంది.

English summary
New York Governor Andrew Cuomo has rolled out a coronavirus inspired poster to symbolize the state’s battle against the pandemic, but the eccentric artwork designed by the governor himself soon became a source of mockery online.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X