డాక్టర్స్ రిపోర్ట్ ‘ఎక్స్‌లెంట్’: ట్రంప్ ఆరోగ్యంపై అనుమానాలు పటాపంచలు!

Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోగ్యం చాలా బాగుందని ఉందని ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైట్‌హౌజ్ డాక్టర్‌ రోనీ జాక్సన్ స్పష్టం చేశారు. అధ్యక్షుడిగా ట్రంప్‌ ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో శుక్రవారం ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించారు.

వాల్టర్‌ రీడ్‌ నేషనల్‌ మిలిటరీ మెడికల్‌ సెంటర్‌లో డాక్టర్‌ రోనీ జాక్సన్‌ నేతృత్వంలో కొన్ని గంటల పాటు ఈ పరీక్షలు జరిగాయి. బీపీ, కొలెస్ట్రాల్‌, బ్లడ్‌ షుగర్‌, గుండె స్పందన, బరువు వంటి పరీక్షలు చేశారు.

మీడయాతో

మీడయాతో

పరీక్షల అనంతరం డాక్టర్‌ రోనీ జాక్సన్‌ మీడయాతో మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ చక్కగా ఆరోగ్యంగా ఉన్నారని రోనీ స్పష్టం చేశారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని అన్నారు.

 16న మీడియాకు..

16న మీడియాకు..

ట్రంప్‌ ఆరోగ్యస్థితిపై పూర్తి నివేదికను జనవరి 16న మీడియాకు వెల్లడించనున్నారు. గత మూడు ప్రభుత్వాల సమయంలోనూ డాక్టర్‌ రోనీనే అధ్యక్షుడికి ఫిజీషియన్‌గా ఉన్నారు.

 ట్రంప్ ఆరోగ్యంపై విమర్శల నేపథ్యంలో..

ట్రంప్ ఆరోగ్యంపై విమర్శల నేపథ్యంలో..

సాధారణంగా ప్రతి అధ్యక్షుడికి రొటీన్‌ హెల్త్‌ పరీక్షలు నిర్వహిస్తుంటారు. అయితే ఇటీవల కొందరు ట్రంప్ మానసికస్థితిపై అనుమానాలు వ్యక్తంచేశారు. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, ప్రవర్తిస్తున్న తీరును చూస్తుంటే ఆయన మానసికంగా ఫిట్‌గా లేరంటూ విమర్శలు చేశారు.

తెలివైనవాడినంటూ ట్రంప్..

తెలివైనవాడినంటూ ట్రంప్..

తనపై విమర్శలను ఖండించిన ట్రంప్‌.. తనను తాను చాలా తెలివైన వ్యక్తినని, స్మార్ట్‌ అని ట్విట్టర్‌లో చెప్పుకొచ్చారు. అయితే శుక్రవారం జరిగిన వైద్య పరీక్షల్లో ట్రంప్‌ మెంటల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ లేదని ఇప్పటికే వైట్‌హౌస్‌ వెల్లడించింది. కాగా, అమెరికా అధ్యక్షుడైన తర్వాత ట్రంప్‌కు వైద్య పరీక్షలు నిర్వహించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
White House doctor Ronny Jackson says President Donald Trump is "in excellent health" following his physical Friday.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి