వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిక్కీ హేలీని తొలగిస్తాం: భారత సంతతి మహిళపై ట్రంప్ జోక్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్కడికెళ్లినా తన నోటి దురుసును ఆపుకోలేకపోతున్నారు. ఈసారి భారత సంతతిపైన నోరుపారేసుకున్న ట్రంప్.. ఆ తర్వాత ప్రశంసలు కురిపించారు.‘నిక్కీ హేలీని ఐక్యరాజ్య సమితికి అమెరి

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్కడికెళ్లినా తన నోటి దురుసును ఆపుకోలేకపోతున్నారు. ఈసారి భారత సంతతి మహిళపైన నోరుపారేసుకున్న ట్రంప్.. ఆ తర్వాత ప్రశంసలు కురిపించారు.'నిక్కీ హేలీని ఐక్యరాజ్య సమితికి అమెరికా రాయబారి పదవి నుంచి తొలగిస్తాం..' అని ట్రంప్ అన్నారు. ఆ వెంటనే తాను జోక్ చేశానని స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి రాయబారిగా నిక్కీ హేలీ కొనసాగితున్న విషయం తెలిసిందే.
ట్రంప్ వందరోజుల పాలన సందర్భంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో రాయబారులతో సోమవారం ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అందరిముందు నిక్కీ హేలీపై పొగడటంతోపాటు ఇలా సెటైర్లు కూడా వేశారు.

Trump ‘jokes’ Haley could be replaced

'నిక్కీ హేలీ చాలా చక్కగా పనిచేస్తున్నారు. ఆమె పనితీరు పట్ల అందరూ సంతృప్తిగా ఉన్నారా..? లేకపోతే చెప్పండి వెంటనే తొలగించి వేరొకర్ని నియమిద్దాం' అని ఈ సమావేశంలో ట్రంప్ అన్నారు. ఈ మాటలు అన్న వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ట్రంప్ మరికొన్ని వ్యాఖ్యలు చేశారు.

'నిక్కీ హేలీని తొలగించే ప్రసక్తే లేదు. అలాంటి ఉద్దేశం కూడా లేదు. ఆమె చాలా బాగా పని చేస్తున్నారు' అని ట్రంప్ చెప్పారు. తన పక్కనే కూర్చున్న నిక్కీ హేలీపై ట్రంప్ ఈ విధమైన సరదా వ్యాఖ్యలు చేయడంతో సమావేశంలో నిక్కీ హేలీతోపాటు ఇతర సభ్యుల ముఖాల్లో నవ్వులు విరిశాయి.

English summary
Trump was kicking off Monday’s lunch with 14 ambassadors of countries on the U.N. Security Council – its top decision-making body – when he asked the room if they liked Haley, the U.S. ambassador. Trump said that if they didn’t, “she could easily be replaced.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X