వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాను భయపెట్టాలని చూడకు, చరిత్రలో చూడని పరిస్థితి వస్తుంది: ట్రంప్ తీవ్ర హెచ్చరిక

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాను భయపెట్టాలని చూస్తే అందుకు తగిన శిక్ష అనుభవించవలసి ఉంటుందని ఇరాన్ అధ్యక్షుడు రౌహనీకి హెచ్చరికలు జారీ చేశారు.

ఇటీవల ఇరాన్ అధ్యక్షులు హసన్ రౌహనీ.. ట్రంప్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మిస్టర్ ట్రంప్.. సింహం తోక పట్టుకొని ఆటలు ఆడవద్దని, అది చివరకి తీవ్ర ప్రమాదానికి కారణం అవుతుందని హెచ్చరించారు. ఇరాన్‌తో శాంతి సంబంధాలు నెలకొల్పడం ప్రపంచ శాంతికి కారణమనుతుందని, అదే ఇరాన్‌తో ుయద్ధం అన్ని యుద్ధాలకు తల్లి వంటిదని హెచ్చరించారు.

Trump just tweeted an all caps threat to Irans demented president Rouhani

దీనిపై ట్రంప్ అంతే ఘాటుగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా హెచ్చరిక జారీ చేశారు. మరోసారి అమెరికాను భయపెట్టాలని చూడవద్దని, లేదంటే చరిత్రలో మీరెప్పుడూ చవిచూడని పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని, మీ హింసాత్మక ధోరణికి మేం మద్దతిచ్చేది లేదు... జాగ్రత్త అంటూ కౌంటర్ ఇచ్చారు.

కాగా, 2015లో ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించి చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందాన్ని డొనాల్డ్ ట్రంప్‌ వెనక్కి తీసుకున్నారు. అప్పటి నుంచి ఇరాన్‌ మీద అగ్రరాజ్యం ఒత్తిడి పెంచుతోంది. దీంతో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

English summary
President Donald Trump has launched a furious all-caps rebuke of Iran, declaring on Twitter that any threats to the US would be met with unspecified dire consequences.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X