• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ట్రంప్-కిమ్ ఇద్దరూ ఎల్‌కెజి పిల్లల్లా?: ఉ.కొరియాకు చైనా ఊహించని దెబ్బ..

|

మాస్కో/బీజింగ్: ఉత్తరకొరియా-అమెరికా మధ్య వివాదం ఇప్పట్లో సద్దుమణిగే అవకాశాలే కనిపించడం లేదు. ఢీ అంటే ఢీ అనే తరహాలో ఇరు దేశాలు యుద్దానికి కాలు దువ్వుతున్నట్లే కనిపిస్తున్నాయి.

కిమ్ రెచ్చగొట్టుడు ధోరణి రోజురోజుకు పెరిగిపోతుండటం ప్రపంచ దేశాలను కలవరపరుస్తోన్న అంశం. నిన్న మొన్నటిదాకా కిమ్ చర్యలన్ని.. తననో శక్తివంతుడిగా నిరూపించుకునే ప్రయత్నమే అనుకున్నప్పటికీ.. యుద్దం ఆలోచనలను కొట్టిపారేయలేని పరిస్థితి.

ఇదీ అసలు నిజం: కిమ్ యుద్ద కాంక్షపై బీబీసీ, 15ని.ల్లో చంపేందుకు ద.కొరియా ప్లాన్..

 రష్యా స్పందన:

రష్యా స్పందన:

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్, అమెరికా అధ్యక్షు డొనాల్డ్ ట్రంప్ ల మధ్య కొనసాగుతున్న మాటల యుద్దంపై రష్యా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌ స్పందించారు. వీరి మాటల యుద్దం ఎల్.కే.జీ పిల్లల మధ్య విభేదాలను తలపిస్తోందని ఛమత్కరించారు. ఈ విబేదాలు తగ్గటానికి సంయమనం అవసరమని ఆయన హితవు పలికారు.

ఉత్తరకొరియాతో గండమే?: ముక్కలు చేస్తామని హెచ్చరిక.. పుతిన్ ఇలా!

చూస్తూ ఊరుకోం:

చూస్తూ ఊరుకోం:

ఉత్తరకొరియా-అమెరికాల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు తెరపడాలంటే చాలా సమయం పడుతుందని, అలా ఈలోపు ఏ దేశం యుద్దానికి కాలు దువ్వినా సహించేది లేదని లావ్ రోవ్ తెలిపారు. ఉత్తరకొరియా అణుపరీక్షలను సహించేది లేదని, అదే సమయంలో ఆ దేశాన్ని యుద్దంతోనే దారికి తీసుకురావాలనుకోవడం కూడా కరెక్ట్ కాదని అన్నారు.

రష్యా-చైనా ఉసిగొల్పుతున్నాయా?: ఉ.కొరియా సీక్రెట్ జలాంతర్గామి, పాక్‌పై సుష్మా డౌట్!

  కిమ్‌ కోసం సెక్స్ బానిసలు ...ఒకవేళ గర్భం వస్తే వారిని ఏం చేసేవారో తెలుసా ? | Oneindia Telugu
  ఐరాస స్పూర్తితో:

  ఐరాస స్పూర్తితో:

  ఐక్యరాజ్యసమితి స్ఫూర్తికి, మార్గదర్శకాలకు అనుగుణంగా ఉత్తరకొరియా-అమెరికాల మధ్య రాజకీయ పరిష్కార మార్గం కోసం ప్రయత్నిస్తామని లావ్‌రోవ్ అన్నారు. ఈ క్రమంలో చైనాతో కలిసి ఆచరణాత్మక విధానాలతో ముందుకు వెళ్లడానికే మొగ్గుచూపుతామని, అంతేకానీ ఆలోచన లేని నిర్ణయాలతో దీన్ని ఎవరూ నిలువరించలేరని స్పష్టం చేశారు.

  కిమ్ జాంగ్‌కు రొడ్రిగో హెచ్చరిక: బొమ్మలతో ఆటలా?, పిచ్చోడా.. నువ్వో..?

  ఎట్టకేలకు చైనా ఆ పని చేసింది:

  ఎట్టకేలకు చైనా ఆ పని చేసింది:

  రష్యా, చైనాల అండతోనే ఉత్తరకొరియా రెచ్చిపోతుందనేది అందరికీ తెలిసిన సత్యం. ఉత్తరకొరియాతో ముడిపడి ఉన్న వాణిజ్య సంబంధాల వల్లే చైనా ఆ దేశాన్ని వెనకేసుకొచ్చింది. ఆఖరికి ఐరాస ఒత్తిడి చేసినప్పటికీ.. ఆ దేశంతో ఎగుమతులు, దిగుమతులు ఇతరత్రా వాణిజ్య సంబంధాలను వదులుకోలేమని చైనా స్పష్టం చేసింది.

  కానీ ఎట్టకేలకు చైనా తన నిర్ణయం మార్చుకున్నట్లే కనిపిస్తోంది. ఉత్తరకొరియాకు ఎగుమతయ్యే ఆయిల్, పెట్రోలియం సహా ఇతరత్రా వాటిల్లో కోత పెట్టింది. చైనా కామర్స్ మినిస్ట్రీ ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

  అక్టోబర్ 1 నుంచి కేవలం రెండు మిలియన్ల బారెల్స్ పెట్రోలియం మాత్రమే ఎగుమతి చేస్తామని చెప్పింది. దీంతో ఉత్తరకొరియా అణు క్షిపణి ప్రయోగాలకు పెద్ద బ్రేక్ పడ్డట్లే అని చెప్పాలి. అంతేకాదు, టెక్స్‌టైల్ ఉత్పత్తులపై కూడా నిషేధం విధించాలని భావిస్తున్నట్లుగా కామర్స్ మినిస్ట్రీ పేర్కొనడం గమనార్హం. ఉత్తరకొరియా ప్రధాన ఆదాయ వనరుల్లో టెక్స్‌టైల్ ఉత్పత్తులు కూడా ఒకటి.

  అలాగే బొగ్గు, ఇనుము, సీ ఫుడ్, ఇతరత్ర వస్తువులను కూడా ఉత్తరకొరియా నుంచి కొనుగోలు చేయవద్దని నిర్ణయించింది. ఐరాస ఆంక్షల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.

  భయంకరమైన నిజాలు: భూతల నరకం ఉ.కొరియా, ప్రపంచానికి తెలియని అక్కడి బతుకు?

  ఉ.కొరియా ఇప్పటికైనా దిగొస్తుందా?:

  ఉ.కొరియా ఇప్పటికైనా దిగొస్తుందా?:

  మిత్రదేశం చైనా కూడా ఐరాస ఆంక్షలకు తలొగ్గక తప్పకపోవడంతో.. ఉత్తరకొరియా ఇప్పటికైనా దిగి వస్తుందా? అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం. ఉత్తరకొరియా తీరులో ఇప్పటికైనా మార్పు రాకపోతే చైనా ఆ దేశంతో పూర్తిగా తెగదెంపులు చేసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు.

  అదే జరిగితే వాణిజ్యం రంగంలో ఉత్తరకొరియా దిక్కు లేనిది అవుతుంది. మరే ఇతర దేశాలు కూడా దానితో చేతులు కలిపే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్.. ఇకనైనా వెనక్కి తగ్గుతాడా? లేక దేశం నాశనమైనా పరవాలేదని అదే దుందుడుకు వైఖరిని కొనసాగిస్తాడా అన్నది చూడాలి.

  8 నిజాలు: కిమ్ గురించి ప్రపంచానికి తెలియనవి, అదొక మిస్టరీ, దానికి డై-హార్డ్ ఫ్యాన్?

  English summary
  China has announced it will limit oil supplies to North Korea under UN sanctions over its nuclear and missile development,
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more