వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇద్దరిలో ఎవరి డామినేషన్!?: ట్రంప్ కోసం.. దటీజ్ కిమ్ జాంగ్ ఉన్! పలు ఆసక్తికర విషయాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

సింగపూర్: ప్రపంచం యావత్తు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షులు కిమ్ జాంగ్ ఉన్‌ల భేటీ జరిగింది. సానుకూల పరిణామాలు కనిపించాయి. ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యమంగా కొరియా ద్వీపకల్పంలో అణునిరాయుధీకరణ, శాంతిస్థాపనే ప్రధాన అజెండాగా సమావేశం జరిగింది. ఈ భేటీపై ఇరువురు నేతలు సంతృప్తి వ్యక్తంచేశారు. కిమ్‌తో భేటీ వెరీ వెరీ గుడ్ అని ట్రంప్ అన్నారు. చాలా సానుకూలంగా జరిగిందని, అందరూ ఊహించిన దాని కంటే అద్భుతంగా జరిగిందని నేను అనుకుంటున్నానని చెప్పారు. శాంతిస్థాపనకు ఈ సమావేశం ఉపయోగపడుతుందని కిమ్ అన్నారు.

ట్రంప్‌ను మించి!: రన్నింగ్ బాడీగార్డ్స్ నుంచి.. కిమ్ భద్రతా వలయం, నోరు వెళ్లబెట్టాల్సిందేట్రంప్‌ను మించి!: రన్నింగ్ బాడీగార్డ్స్ నుంచి.. కిమ్ భద్రతా వలయం, నోరు వెళ్లబెట్టాల్సిందే

ట్రంప్- కిమ్ దాదాపు 13 సెకండ్ల పాటు కరచాలనం చేశారు. ఇద్దరూ చాలాసేపు చప్పట్లు కొడుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తర్వాత తమ జాతీయ జెండాల వద్ద నిల్చొని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఆ తర్వాత హాలు వైపుకు వెళ్లారు. 1950-53 కొరియా యుద్ధం తర్వాత అమెరికా, ఉత్తర కొరియాలు శత్రు దేశాలుగా మారాయి. ఈ దేశాల అధ్యక్షుల మధ్య చర్చలు జరగలేదు. ఫోన్లోను మాట్లాడుకోలేదు. ఇప్పుడు వీరి భేటీ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.

ట్రంప్ పెద్దవాడు కాబట్టి ఉత్తర కొరియా సంప్రదాయం ప్రకారం కిమ్ ఇలా

ట్రంప్ పెద్దవాడు కాబట్టి ఉత్తర కొరియా సంప్రదాయం ప్రకారం కిమ్ ఇలా

భేటీ కోసం తాను బస చేసిన హోటల్‌ నుంచి ట్రంప్‌ తొలుత బయల్దేరారు. కానీ, వేదిక కేపెల్లా వద్దకు మాత్రం కిమ్‌ జాంగ్ ఉన్ త్వరగా చేరుకున్నారు. సాధారణంగా వయసులో పెద్ద అయిన డొనాల్డ్ ట్రంప్‌ గౌరవార్థం కిమ్‌ ఈ విధంగా చేశారని చెబుతున్నారు. ఈ విషయంలో కిమ్‌కు మార్కులు పడ్డాయి. కిమ్ కంటే ట్రంప్ 8 అంగులాలు ఎత్తుగా ఉన్నారు. అలాగే వయస్సులో 39 ఏళ్లు కిమ్ కంటే పెద్ద. కిమ్‌కు ట్రంప్ మూడుసార్లు షేక్ హ్యాండ్ ఇచ్చారు. దీంతో కిమ్‌కు ఆతిథ్యం ఇస్తున్న పాత్రను ట్రంప్ పోషించారని అంటున్నారు. వీరిద్దరు ఆరుసార్లు పరస్పరం తాకారు. ఇది వారి మధ్య ఉన్న అభిప్రాయ బేధాలు తగ్గేందుకు సానుకూల పరిణామాలుగా భావిస్తున్నారు. పైవిధంగా ట్రంప్-కిమ్‌ల శరీర భాషలను బట్టి వీరిలో ఎవరిది ఆధిపత్యమో అంటూ మార్కులు వేస్తున్నారు కొందరు.

మొదట పలకరించిన కిమ్

మొదట పలకరించిన కిమ్

ఈ భేటీ జరిగే ప్రదేశానికి కిమ్ ముందు వచ్చారు. ఉత్తర కొరియా సంప్రదాయం ప్రకారం ఏదైనా సమావేశానికి వయసులో చిన్నవాళ్లే ముందుగా సభ వద్దకు రావాలని అంటున్నారు. అది గౌరవంగా భావిస్తారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సమావేశం ప్రారంభానికి కేవలం 60 సెకన్ల ముందు వచ్చారు. ముందుగా కిమ్‌.. ట్రంప్‌ను పలకరించారు. 'ప్రెసిడెంట్‌.. మిమ్మల్ని కలవడం బాగుంద'ని కిమ్‌ అన్నారు. 'ఇది నా గౌరవం.. మీతో అద్భుతమైన సంబంధం ఉంటుందని భావిస్తున్నా. అందులో ఎటువంటి సందేహం లేద'ని ట్రంప్‌ బదులిచ్చారు.

సైన్స్ ఫిక్షన్ సినిమాలా చూస్తూ ఉండి ఉంటారు

సైన్స్ ఫిక్షన్ సినిమాలా చూస్తూ ఉండి ఉంటారు

ఆ తర్వాత ఇరు దేశాధినేతలు సమావేశం‌ జరిగే గది వైపు తరలివెళ్లారు. ట్రంప్‌తో కిమ్ మాట్లాడుతూ.. ఈ సమావేశాన్ని ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా చూస్తుంటుందని, చాలామంది ఈ దృశ్యాన్ని ఓ సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాలాగా చూస్తూ ఉండి ఉంటారని అన్నారట. ట్రంప్‌-కిమ్‌ సమావేశమయ్యేందుకు వేసిన టేబుల్‌కు 80ఏళ్ల చరిత్ర ఉంది. సింగపూర్‌ సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఉపయోగించిన టేబుల్‌ను ఈ చారిత్రక భేటీ కోసం వినియోగించారు.

కిమ్-ట్రంప్ ఫోటోలు వైరల్

కిమ్-ట్రంప్ ఫోటోలు వైరల్

ప్రాన్స్‌కాక్‌టెయిల్‌, గ్రీన్‌ మ్యాంగో కిరాబు, కొరియన్‌ వంటకాలు, అవకాడో సలాడ్‌, డార్క్‌ చాక్లెట్‌ టార్లెట్‌ గనచీ, హగెన్‌-డస్‌ వెనీలా ఐస్‌క్రీం, పేస్ట్రీతో పాటు వివిధ వంటకాలను ప్రత్యేకంగా ట్రంప్‌-కిమ్‌ కోసం సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన మెనూని వైట్ హౌస్ విడుదల చేసింది. ట్రంప్ - కిమ్‌లు తొలిసారి భేటీ కావడంతో వారిద్దరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

భోజనానికి ముందు నవ్వించిన ట్రంప్

భోజనానికి ముందు నవ్వించిన ట్రంప్

కిమ్‌ జాంగ్ ఉన్న గత రాత్రి సింగపూర్‌ వీధుల్లో కొద్దిసేపు నడిచారు. ఆ సమయంలో ఆయనను చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు వచ్చారు. వారిని చూసి కిమ్‌ ఆశ్చర్యపోయారని అంటున్నారు. కిమ్‌ తన కోసం ప్రత్యేకంగా సొంత టాయిలెట్‌ కిట్‌ను వెంట తెచ్చుకున్నారు. మరోవైపు, భోజనానికి ముందు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అందర్నీ నవ్వించాయట. ఇప్పుడే అందరు మంచి ఫోటో తీసుకోండని, ఇద్దరం సన్నగా, అందంగా, బాగున్నామని భోజనానికి వెళ్లడానికి ముందు మీడియాతో అన్నారు. దీంతో అఖ్కడ అందరూ నవ్వేశారు.

English summary
The White House has released the full text of the joint statement signed by US President Donald Trump and North Korean leader Kim Jong-un.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X