వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జో బైడెన్ రాకముందే డొనాల్ ట్రంప్ జంప్: కరోనా, నిరుద్యోగితలే అధ్యక్ష భవనానికి దూరం నెట్టాయి

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ జనవరి 20న పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే, ఈ కార్యక్రమానికి డొనాల్డ్ ట్రంప్ హాజరవుతారా? అనేది ప్రశ్నార్థకంగానే మిగిలింది. అసలు బైటెన్ విజయాన్నే అంగీకరించని ట్రంప్. ప్రమాణస్వీకారానికి హాజరయ్యే విషయాన్ని ఇప్పటి వరకు ప్రకటించలేదు.

జనవరి 20న జో బైడెన్ ప్రమాణ స్వీకారానికి వచ్చే ముందుగానే ట్రంప్ అక్కడ్నుంచి వెళ్లిపోనున్నట్లు సమాచారం. ఫ్లోరిడాలోని పామ్ బీచ్ మార్ ఏ లోగో క్లబ్‌కి వెళ్లేందుకు ట్రంప్ ఇప్పటికే ప్లాన్ వేసినట్లు తెలిసింది. డొనాల్డ్ ట్రంప్ బుదవారం వాషింగ్టన్ నుంచి బయలుదేరి వెళ్లనున్నారు.

అమెరికా చరిత్రలో ఓ సమస్యాత్మక అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారని పలువురు పేర్కొంటున్నారు. ట్రంప్ రెండోసారి అభిశంసన కూడా ఎదుర్కోవడం గమనార్హం. జో బైడెన్ ప్రమాణస్వీకారానికి వచ్చే ముందే ట్రంప్ అక్కడ్నుంచి బయల్దేరి తన పాబ్ బీచ్‌కు వెళ్లనున్నారు.

 Trump leaves town an outcast, trailed by Coronavirus pandemic, joblessness

నేటితో అధ్యక్ష పదవికి వీడ్కోలు పలకబోతున్న డొనాల్డ్ ట్రంప్ మరో విమర్శకు తెరతీశారు. 1989 నుంచి వస్తున్న వీడ్కోలు లేఖ సంప్రదాయానికి స్వస్తి పలికారు ట్రంప్. కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌కు శుభాకాంక్షలు చెబుతూ ఎలాంటి లేఖ రాయకుండానే ట్రంప్ పదవి నుంచి దిగిపోనున్నారు.

కొత్త అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలుపుతూ వీడ్కోలు రాసే సంప్రదాయానికి రొనాల్డ్ రీగన్ శ్రీకారం చుట్టారు. 2017లో పదవి నుంచి దిగిపోవడానికి ముందు ఒబామా కూడా డొనాల్డ్ ట్రంప్‌నకు లేఖ రాశారు. కానీ, ఇప్పుడు జో బైడెన్‌కు ట్రంప్ మాత్రం ఎలాంటి అభినందన లేఖ రాయడం లేదు. దీంతో ట్రంప్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 1869లో కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆండ్రూ జాన్సన్ కూడా హాజరు కాకపోవడం గమనార్హం. ఆ తర్వాత ఆ జాబితాలో డొనాల్డ్ ట్రంప్ చేరారు.

కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోలేక పోవడం, ఉద్యోగాల కల్పనలో విఫలం కావడంతో డొనాల్డ్ ట్రంప్‌ను అమెరికా ప్రజలు అధ్యక్ష పదవికి దూరం పెట్టారు. కరోనా ప్రబలుతున్న తొలి రోజుల్లోనే తగిన చర్యలు తీసుకుని ఉంటూ అమెరికాలో అత్యధిక మరణాలు, కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యేవి కావు. ఈ క్రమంలోనే ప్రజలు ట్రంప్‌నకు వీడ్కోలు పలికారు.

English summary
Trump intends to leave in the morning for his Mar-a-Lago club in Palm Beach, Florida, arriving before President-elect Joe Biden is inaugurated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X