వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ భద్రతా సలహాదారుడికి కరోనా పాజిటివ్... వైట్ హౌస్ రియాక్షన్...

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు జాతీయ భద్రతా సలహాదారుగా వ్యవహరిస్తున్న రాబర్ట్ ఒబ్రెయిన్‌కు తాజాగా కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. అమెరికాలో ఇప్పటివరకూ కరోనా సోకినవారిలో అత్యున్నత స్థాయి అధికారి ఒబ్రెయినే కావడం గమనార్హం. ఒబ్రెయిన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ట్రంప్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వైట్ హౌస్ వర్గాలు స్పందించాయి.

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌లకు ఎలాంటి ప్రమాదం లేదని వైట్ హౌస్ స్పష్టం చేసింది.'ఒబ్రెయిన్‌కు తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం అతను సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నాడు. ట్రంప్,మైక్ పెన్స్‌లకు ఎలాంటి రిస్క్ లేదు. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ విధులు ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగుతాయి.' అని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి.

Trump Not at Risk white house reaction after National Security Adviser OBrien tested coronavirus positive

ఓ ఫ్యామిలీ ఈవెంట్‌లో పాల్గొన్న తర్వాత ఒబ్రెయిన్‌కు పాజిటివ్ లక్షణాలు బయటపడ్డాయని.. వారం రోజుల నుంచి అతను వైట్ హౌస్‌ కార్యాలయానికి రావట్లేదని అధికారులు తెలిపారు. చాలావరకు పనులు ఆయన తన ఇంటి నుంచే ఫోన్ ద్వారా చక్కబెడుతున్నారని తెలిపారు. వైట్ హౌస్ సిబ్బందికి నిరంతరం రెగ్యులర్‌గా కరోనా టెస్టులు చేస్తున్నట్లు చెప్పారు.

ప్రస్తుతం అమెరికాలో 43,98,184 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా... ఇప్పటివరకూ 1,50,053 మంది మృతి చెందారు. ప్రస్తుతం 21,01,307 యాక్టివ్ కేసులున్నాయి. అమెరికా తర్వాతి స్థానంలో 24లక్షల పైచిలుకు కేసులతో బ్రెజిల్,14లక్షల పైచిలుకు కేసులతో భారత్ ఉన్నాయి.

English summary
US President Donald Trump's national security adviser Robert O'Brien has tested positive for the novel coronavirus, but there is no risk of exposure to Trump or Vice President Mike Pence, the White House said in a statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X