వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జార్జి బుష్ షాకిచ్చాడు: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఎంతో ఉత్కంఠగా సాగిన ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. దీంతో 45వ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు. మొదటి నుంచి ఆధిక్యాన్ని కనబర్చిన ట్రంప్.. చివరకు హిల్లరీపై పూర్తిఆధిక్యాన్ని చాటుకున్నారు. కాగా, 288 స్థానాల్లో ట్రంప్ గెలుపొందగా, 219 స్థానాల్లో హిల్లరీ గెలుపొందింది.

20న ప్రమాణ స్వీకారం

అమెరికా 45వ అధ్యక్షుడిగా రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ఘన విజయం సాధించారు. జనవరి, 20న మధ్యాహ్నం అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ యూఎస్‌ కాపిటోల్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నానికి ప్రస్తుత అధ్యక్షుడు బరాక్‌ ఒబామా పదవీ కాలం ముగియనుంది. తొలుత అమెరికా ఉపాధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేస్తారు.

అంతకుముందు పరిణామాలు

ట్రంప్‌ జోరు కొనసాగింది. మొత్తం 538 స్థానాలకు ట్రంప్‌ అధిక్యంలో సాగుతున్నారు. భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి రిపబ్లికన్ల అభ్యర్థి ట్రంప్‌ 244 చోట్ల అధిక్యంలో ఉండగా.. హిల్లరీ క్లింటన్‌ 215 చోట్ల ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎగ్జిట్‌ అంచనాలు మొదలైనప్పటి నుంచి హిల్లరీ కంటే అధిక్యంలో ఉన్న ట్రంప్‌ అంతకంతకూ తన అధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు.

అంతకుముందు సమాచారం ప్రకారం హిల్లరీ 197 స్థానాల్లో ఆధిక్యం చాటుకుంటుండగా, ట్రంప్ 187 స్థానాల్లో ఆధిక్యత చాటుకుంటున్నారు. కాగా, హోరాహోరీగా పోరు సాగుతోంది.

సమాచారం ప్రకారం డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో దూసుకెళ్తున్నారు. 25రాష్ట్రాల్లో పోలింగ్ ముగియగా 168 స్థానాల్లో ట్రంప్ ముందంజలో ఉండగా, హిల్లరీ కేవలం 108 స్థానాల్లోనే ఆధిక్యత చాటుకుంటున్నారు. అయితే, పెద్ద రాష్ట్రాల ఖాతా తెరిస్తే ఫలితాలు మారవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ ఆధిక్యం చాటుకుంటున్న నేపథ్యంలో ఆసియా స్టాక్ మార్కెట్లు పతనానికి దారితీసింది.

ట్రంప్‌కు జార్జిబుష్ ఝలక్

- ట్రంప్‌కు సొంత పార్టీకి చెందిన దిగ్గజం నుంచి అవమానం ఎదురైంది. అమెరికాకు రెండుసార్లు అధ్యక్షుడిగా పని చేసిన జార్డ్ డబ్ల్యు బుష్.. ట్రంప్‌కు ఓటేయడానికి నిరాకరించారు. తన పార్టీ అభ్యర్థి ట్రంప్‌కు, ప్రత్యర్థి డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు గానీ ఆయన ఓటేయలేదు. అయినా ట్రంప్ గెలుపొందారు.

- - వెర్మాంట్‌, మెసాచూసెట్స్‌, రోడ్‌ ఐలాండ్‌, న్యూజెర్సీ, మేరీల్యాండ్‌, కొలంబియా, డెలావర్‌, ఇల్లినాయిస్‌ రాష్ట్రాల్లోని 68 ఎలక్టొరల్‌ స్థానాల్లో హిల్లరీ గెలవగా, ట్రంప్‌ కెంటకీ, వెస్ట్‌ వర్జీనియా, టెన్నిస్సీ, మిస్సిసిపి, ఓక్లహామా రాష్ట్రాల్లోని 48 స్థానాల్లో విజయం సాధించారు. అధ్యక్షుడిగా గెలుపొందాలంటే 538 స్థానాలకు గానూ కనీసం 270 స్థానాల్లో విజయం సాధించాలి.

- సమాచారం మేరకు.. ట్రంప్ కంటే హిల్లరీ లీడ్‌లో ఉన్నారు. హిల్లరీ - ట్రంప్ 68-48తో ఉన్నారు. అధ్యక్షుడు కావాలంటే 270 ఎలక్ట్రోరల్ ఓట్లు కావాలి.
- ఇల్లినాయిస్, న్యూజెర్సీ, మసాచ్యుసెట్స్, మేరీల్యాండ్, డేలవేర్, రోడే ఐస్‌ల్యాండ్, కొలంబియా జిల్లాల్లో హిల్లరీ క్లింటన్ గెలుస్తుందని చెబుతున్నారు.
- వెస్ట్ వర్జీనియాలో డొనాల్డ్ ట్రంప్ గెలుస్తాడని సీఎన్ఎన్ అంచనా వేసింది.

- సౌత్ కరోలినా, జార్జియాలలో ఓటింగ్ ముగుస్తోంది.
- ఇండియానా, కెంటకీలలో డొనాల్డ్ ట్రంప్ గెలుపొందారు. వెర్మోంట్‌లో హిల్లరీ గెలిచారు. ( సీఎన్ఎన్ అంచనాలు)

- మొదటి ఆరు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి.
- అజుషాలో కాల్పులు జరిగాయి. నలుగురిని ఆసుపత్రికి తరలించారు. పోలింగ్ స్టేషన్‌ను మూసివేశారు.

- ఇండియానాలో డొనాల్డ్ ట్రంప్ 69.3 శాతం, హిల్లరీ క్లింటన్ 27.5 శాతంతో ఉన్నారు.
- కెంటకీలో డొనాల్డ్ ట్రంప్ 79.1 షాచం. హిల్లరీ క్లింటన్ 18 శాతం ఓట్లతో ఉన్నారు.
- ఇండియానా, కెంటకీలలో పోలింగ్ ముగిసింది.

- సిఎన్ఎన్ ఎగ్జిట్ పోల్ ప్రకారం 22 శాతం మంది అనుభవానికి, మరో 22 శాతం మంది ఎవరు కరెక్ట్ చూసి ఓటు వేశారు.
- సీఎన్ఎన్ ఎగ్జిట్ పోల్ ప్రకారం 38 శాతం మంది కొత్త అధ్యక్షులు మార్పు చేయాలని కోరుకుంటున్నారని, 62 శాతం మంది సెప్టెంబర్‌కు ముందే ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకున్నారు.

- పలుచోట్ల ఓటింగ్ మిషన్లలో సమస్య కారణంగా ఓటర్లు పెద్ద ఎత్తున క్యూ కట్టారని తెలుస్తోంది.

- ఎన్నికల ఫళితాలను తాను మన్‌హటన్‌లోని ట్రంప్ టవర్ నుంచి కుటుంబం, స్నేహితులతో కలిసి చూస్తానని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఫలితాలపై చాలా ఉత్కంఠంగా ఉందని చెప్పారు.

- గ్రాండ్ పార్లే, టెక్సాస్‌లలో ఓటింగ్ సమయాన్ని పెంచారు. ఎలక్షన్ జడ్జ్ మంగళవారం ఉదయం తన నివాసంలో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో సమయాన్ని పెంచారు.

- బెట్టింగ్స్, సర్వేల్లోను హిల్లరీ క్లింటనే ముందంజలో ఉన్నారు.
- లాస్ వెగాస్‌లలో పలుచోట్ల ఓటింగ్ సమయాన్ని పెంచారని ట్రంప్ ప్రచార బృందం నెవెడాలో లాసూట్ ఫైల్ చేసింది.
- గవర్నర్ మైక్ పీస్ తన ఓటు హక్కును ఉపయోగించుకున్నారు.
- డొనాల్డ్ ట్రంప్ గెలుస్తారని రిపబ్లికన్ విశ్వాసం వ్యక్తం చేసింది.
- ట్రంప్ తన ఓటును న్యూయార్క్ సిటీలో వేశారు.
- నేను ట్రంప్‌కు ఓటేయాలని నిర్ణయించుకున్నానని డొనాల్డ్ ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

- ఈ ఎన్నికల్లో మేం గెలవకుంటే నా జీవితంలోనే మొదటిసారి అత్యంత మనీ వేస్ట్, ఎనర్జీ వేస్ట్ సమయం ఇది అవుతుందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.

- ఓటు వేసిన అనంతరం హిల్లరీ క్లింటన్ మాట్లాడారు. తానే గెలస్తానని చాలామంది భావిస్తున్నారని చెప్పారు. ఇది ఆనందంగా ఉందని అభిప్రాయపడ్డారు.

- న్యూయార్క్‌లో డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తన ఓటు హక్కును ఉపయోగించుకున్నారు.

- న్యూహ్యాంప్‌షైర్‌లోని డిక్స్ విల్లే నాట్స్, హార్ట్జ్ లొకేషన్, మిల్స్ ఫీల్డ్ తదితర మూడు పట్టణాల్లో సంప్రదాయ మిడ్ నైట్ ఓటింగు నిర్వహించగా, ఈ మూడింట ట్రంప్‌కు 32 ఓట్లు, హిల్లరీకి 25 ఓట్లు వచ్చిన విషయం తెలిసిందే.

Trump or Hillary- Catch it live here

- ఈస్టర్న్ టైం జోన్‌ పరిధిలో వున్న న్యూయార్క్‌, కనెక్టికట్‌, ఇండియానా( కొన్నిప్రాంతాలు), కెంటకీ (కొన్ని ప్రాంతాలు), మైనె, న్యూజెర్సీ, వర్జీనీయా (7 రాష్ట్రాలు) రాష్ట్రాల్లో పోలింగ్‌ ప్రారంభమైంది. ఈ రాష్ట్రాల్లో అమెరికన్లతో పాటు ఆసియా, ఆఫ్రికా దేశాల నుంచి వచ్చి స్థిరపడిన వారు కూడా అధికసంఖ్యలో ఉన్నారు.

- వర్జీనియాలోని రిచ్‌మండ్‌లో టిమ్‌ కెయిన్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అమెరికా ఉపాధ్యక్ష పదవికి డెమోక్రటిక్‌ పార్టీ తరఫున టిమ్‌ కెయిన్‌ బరిలో నిలిచారు.

- మెక్సికన్లకు ట్రంప్ భయం

మెక్సికన్లు ట్రంప్ గెలుస్తాడేమోనని భయపడుతున్నారట. సాధారణంగా అమెరికాలో ఎన్నికలు జరిగితే మెక్సికోలో సంబరాలు ఉంటాయి. ఆ దేశాల మధ్య ఆర్థిక, సామాజిక సంబంధాలు బాగున్నాయి. కానీ తన ప్రచారంలో ట్రంప్ దూకుడైన వ్యాఖ్యలు చేయడంతో మెక్సికో ప్రజలు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. అక్రమ వలసలను అడ్డుకునేందుకు సరిహద్దు వెంట గోడ కట్టిస్తానని ట్రంప్ ప్రచారంలో చెప్పారు. అమెరికాతో సరిహద్దున ఉన్న మెక్సికో నుంచి వలసలు ఎక్కువగా ఉన్నాయి.

- అమెరికాలో టైం జోన్ల తేడా వల్ల కొన్ని ప్రాంతాల్లో పోలింగ్‌ జరుగుతుండగానే, కొన్నిచోట్ల ఫలితాలు విడుదలవుతుంటాయి.

- చాలామంది ఎవరికి ఓటు వేయాలో తేల్చుకోలేకపోతున్నారని తెలుస్తోంది. ట్రంప్ పద్ధతి నచ్చకపోయినా చాలామంది ఆయనకే ఓఠు అంటున్నారు. హిల్లరీ గెలవాలని మరికొంతమంది కోరుకుంటున్నారు.

- పోటీ హోరాహోరీగా ఉంటుందని చాలామంది భావిస్తున్నారు.
- నాలుగున్నర గంటలకు ఎన్నికలు ప్రారంభమయ్యాయి.

- హిల్లరీకి షాకిచ్చిన ట్రంప్

తొలి ఫలితంలో డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గెలిచినా, ఆ తర్వాత న్యూహాంప్‌షైర్‌లోని మూడు చున్న పట్టణాల ఫలితాలు విడుదలతో.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దూసుకెళ్లారు. ఇక్కడ ట్రంప్ ముందంజలో ఉన్నారు. మూడు నగరాలు.. డిగ్జివిల్లే నాచ్‌, హార్ట్స్‌ లొకేషన్‌, మిల్లీస్‌ఫీల్డ్‌లలో అర్ధరాత్రి పోలింగ్ ప్రారంభమైంది. ఇక్కడ ట్రంప్‌ 32 ఓట్లు గెలుచుకోగా, హిల్లరీ 25 ఓట్లు గెలుచుకున్నారని తెలుస్తోంది. ఈ మూడు నగరాల్లో కలిపి వంద మంది కంటే తక్కువ ఓటర్లు ఉంటారు.

తొలి ఫలితం విడుదలైన డిగ్జివిల్లే నాచ్‌లో హిల్లరీకి నాలుగు ఓట్లు, ట్రంప్‌కు రెండు ఓట్లు వచ్చిన విషయం తెలిసిందే. హార్ట్స్‌ లొకేషన్‌ టౌన్‌లో కూడా హిల్లరీదే ఆధిక్యం. హిల్లరీకి 17 ఓట్లు రాగా, ట్రంప్‌కు 14 ఓట్లు వచ్చాయి. మిల్లీస్‌ఫీల్డ్‌లో ట్రంప్‌ 16 ఓట్లు గెలుచుకోగా, హిల్లరీ నాలుగు ఓట్లు మాత్రమే దక్కించుకోగలిగారు. మూడు ప్రాంతాల్లో కలిపి ట్రంప్‌కు 32, హిల్లరీకి 25 ఓట్లు వచ్చాయి.

- తొలి ఫలితంలో హిల్లరీ గెలుపు

అమెరికా ఎన్నికల్లో తొలి ఫలితం మధ్యాహ్నం వెలువడింది. న్యూ హ్యాంప్‌షైర్‌లోని డిగ్జ్‌విల్లే నాచ్‌లో పోలింగ్‌ పూర్తయి ఫలితం వచ్చేసింది. ఇక్కడి ఎనిమిది ఓట్లలో డెమోక్రటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ నాలుగు ఓట్లు గెలుచుకోగా, రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ రెండు ఓట్లు గెలుచుకున్నారు.

2016 అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ తొలి గెలుపు నమోదు చేసుకున్నారు. ఇక్కడ ఎనిమిది మంది ఓటర్లు ఓటు వేయగా నాలుగు హిల్లరీకి, రెండు ట్రంప్‌కు, స్వతంత్రులు గేరీ జాన్సన్‌, మిట్టీ రోమ్నీ చెరొక ఓటును గెలుచుకున్నారు.

కెనడా సరిహద్దు నుంచి 20 కి.మీ. దూరంలో ఉన్న ఈ ఊరిలో 24 గంటల ముందుగానే తొలి ఫలితం వెలువడుతుంది. ఎందుకంటే ఇక్కడ అర్థరాత్రి పోలింగ్‌ మొదలవుతుంది. అధ్యక్ష ఎన్నికల్లో ఇక్కడే పోలింగ్‌ ప్రారంభం కావడం ఆనవాయితీగా వస్తోంది. అమెరికాలో 12 గంటల పాటు పోలింగ్‌ జరిగిన తర్వాత ఒక్కో రాష్ట్రంలో పోలింగ్‌ కేంద్రాలను మూసేస్తారు. ఆ వెంటనే కౌంటింగ్‌ మొదలవుతుంది. టైమ్‌ జోన్లు వేర్వేరుగా ఉండడం వల్ల ఒక చోట ఫలితాలు వెలువడుతున్న సమయానికి మరో రాష్ట్రంలో పోలింగ్‌ కొనసాగుతూనే ఉంటుంది.

English summary
A polarised US heads to the polls on Tuesday after a bruising, nasty campaign that leaves Democrat Hillary Clinton with a slim lead over her Republican rival Donald Trump after she received a reprieve from the Federal Bureau of Investigation (FBI) over investigations into her email server use.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X