వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ మార్క్ బిజినెస్: ఏడాదికి 750 డాలర్ల పన్నే, అంతకుముందు నో, ఇండియాలో మాత్రం..

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్నాయి. ఎత్తుకు పై ఎత్తు వేయడంలో ట్రంప్, జో బిడెన్ బిజీగా ఉన్నారు. అయితే ట్రంప్ ఆదాయపు పన్నుకు సంబంధించి 'ద న్యూయార్క్ టైమ్స్' రిపోర్ట్ చేసింది. 2017లో ట్రంప్ 750 డాలర్ల పన్ను మాత్రమే చెల్లించాడని తన కథనంలో పేర్కొన్నది. అయితే ట్రంప్ వ్యాపారాలకు సంబంధించి ఇండియాలో లక్ష 45 వేల 400 డాలర్లు పే చేశారని నివేదించింది. దీంతో ట్రంప్ ట్యాక్స్ అంశం చర్చకు దారితీసింది. కానీ ఈ ఆరోపణలను ట్రంప్ తోసిపుచ్చారు. ఇదీ సత్యదూరం అని.. ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు.

 తక్కువ పన్ను చెల్లింపు..

తక్కువ పన్ను చెల్లింపు..

అమెరికాలో తక్కువ పన్ను చెల్లించారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొన్నది. పనామాలో 15 వేల 698 డాలర్లు, ఫిలిప్పీన్స్ లక్ష 56 వేల 824 డాలర్లు కట్టారని తెలిపింది. అయితే ఈ పన్ను చెల్లింపుల అంశాన్ని అధ్యక్షుడు తెలియజేయలేదని వెల్లడించింది. 2016లో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయిన సంగతి తెలిసిందే. అయితే ఏ ఏడాది కూడా తన వ్యాపారాలకు సంబంధించి 750 డాలర్లు చెల్లించారు. అయితే గత 10 నుంచి 15 ఏళ్ల లోపు ట్రంప్ ఆదాయపు పన్ను చెల్లించడం లేదు. కారణం ఏంటీ అడిగితే తాను సంపాదించిన ఆస్తి కన్నా.. కోల్పోతున్న డబ్బు ఎక్కువగా ఉంటుందని తెలిపాడని న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ చేసింది.

టీవీ షో హెయిర్ కట్ కోసం..

టీవీ షో హెయిర్ కట్ కోసం..

వాస్తవానికి విమానం, భోజనం, క్షవరం చేసుకోవడం వ్యాపార ఖర్చుల కింద చూపించాడు. ‘ద అప్రెంటిస్' అనే టీవీ షో కోసం హెయిర్ కట్ కోసం 70 వేల డాలర్లు వెచ్చించాడు. ఇదేకాదు ఇవాంకా ట్రంప్ మేకప్ ఆర్టిస్ట్ కోసం 95 వేల 464 డాలర్ల ఖర్చు చేశాడు.

Recommended Video

Top News Of The Day : మత్తు పదార్థాల కేసులో Mahesh Babu భార్య Namrata Shirodkar || Oneindia Telugu
 కలిసొచ్చిన వ్యాపారం

కలిసొచ్చిన వ్యాపారం

ట్రంప్ వ్యాపార సంస్థలు భారతదేశంలో ఉన్నాయి. ఆయన అధ్యక్ష పదవీ చేపట్టిన తొలి రెండేళ్లలో 2.3 మిలియన్ డాలర్లను ఆర్జించాయని న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. ఇండియాతోపాటు స్కాట్లాండ్, ఐర్లాండ్‌లలో 73 మిలియన్ డాలర్లను ఆర్జించింది. ఫిలిప్పీన్స్ నుంచి 3 మిలియన్ డాలర్లు, టర్కీ నుంచి మిలియన్ డాలర్లను సంపాదించారు. అయితే అమెరికా, యూరప్ వ్యాపారాలు మాత్రం నష్టాల్లో సాగుతున్నాయి.

English summary
US President Donald Trump paid only $750 in federal income tax for 2017, his first year in the White House.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X