• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ట్రంప్ మెరుపుల బడ్జెట్‌లో చంద్రన్నకు చోటు.. డెరెక్టుగా 25 బిలియన్ డాలర్ల నిధులు

|

గతవారమే అభిశంసన గండం నుంచి గట్టెక్కిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెట్టించిన ఉత్సాహంతో వచ్చే ఆర్థిక సంవత్సరానికి మెరుపుల బడ్జెట్ ప్రతిపాదించారు. 2021 ఏడాదికిగానూ మొత్తం 4.8 ట్రిలియన్ డాలర్ల విలువైన పద్దును వైట్ హౌజ్ మంగళవారం విడుదల చేసింది. ఎప్పటిలాగే కోతలకు ప్రాధాన్యమిస్తూ, అణ్వాయుధాల ఆధునీకరణపై దృష్టిసారించిన ట్రంప్.. ఈసారి చంద్రుడిపైకి మనిషిని పంపే ప్రాజెక్టుకు నేరుగా భారీ ఎత్తున నిధులు కేటాయించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆమేరకు నేషనల్ ఎరోనాటిక్స్ అండ్ స్సేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా)కు ఏకంగా 25 బిలయన్ డాలర్లు భారీగా నిధులు ప్రతిపాదించారు.

 చంద్రుడిపైకి తొలి మహిళ

చంద్రుడిపైకి తొలి మహిళ

1969లో అపోలో-11 అంతరిక్ష నౌక ద్వారా వ్యోమగాములు నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌, బజ్‌ అల్డ్రిన్‌ చంద్రుడిపై అడుగుపెట్టిన తర్వాత అమెరికా మళ్లీ అలాంటి ప్రయోగమేదీ చేపట్టలేదు. 2017లో ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత మరో మూన్ వాక్ కు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నాసాను ఆదేశించారు. ఆ మేరకు రంగం సిద్ధం చేస్తోన్న నాసా.. 2024లో చంద్రుడిపైకి తొలి మహిళను, మరో వ్యోమగామిని పంపేందుకు రెడీ అవుతున్నది. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న ప్రాజెక్టు కావడంతో బడ్జెట్ కేటాయింపులపై అనుమానాలు తలెత్తాయి. సాధారణంగా అమెరికా బడ్జెట్ లో నాసాకు ఒక స్థాయి వరకే బడ్జెట్ కేటాయింపులు ఉండేవి.. ట్రంప్ మాత్రం దాన్ని 25బిలియన్ డాలర్లకు పెంచేశారు. గతేడాదితో పోల్చుకుంటే ఇది 12 శాతం పెంపు.

ల్యాండింగ్ సిస్టమ్‌ ఎంతో తెలుసా?

ల్యాండింగ్ సిస్టమ్‌ ఎంతో తెలుసా?

నాసాకు బడ్జెట్ పెంపుతో ఏరోనాటిక్స్, టెక్నాలజీ, స్సేస్ సైన్స్ కు ఊతమిచ్చినట్లవుతుందని, తద్వారా కొత్త ఆవిష్కరణలు, అణ్వేషణలకు మార్గం సుగమం అవుతుందని నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రైడెన్‌స్టైన్ అన్నారు. చంద్రుడిపైకి మనిషిని పంపడమనేది చాలా ఖర్చుతో కూడుకున్న ప్రాజెక్టని, హ్యూమన్ ల్యాండింగ్ సిస్టమ్ తయారీకే మూడు బిలియన్ డాలర్లు వెచ్చించాల్సి ఉంటుందని ఆయన వివరించారు.

50 ఏళ్ల తర్వాత ట్రంప్ రికార్డు

50 ఏళ్ల తర్వాత ట్రంప్ రికార్డు

చంద్రుడిపై మనిషి అడుగుపెట్టిన తొలి ప్రాజెక్టు అపోలో-11కు అప్పటి ప్రభుత్వం నేరుగా నిధులు కేటాయించిందని, మళ్లీ 50 ఏళ్ల తర్వాత ఆ పని చేసిన ఘటత ట్రంప్ కే దక్కుతుందని నాసా సైంటిస్టులు చెప్పారు. 2024లో వ్యోమగాముల్ని చంద్రుడిపైకి పంపే లక్ష్యానికి బడ్జెట్ పెంపు ఎంతో మేలు చేస్తుందని అన్నారు. చంద్రన్న ప్రాజెక్టు పూర్తయిన వెంటనే.. మార్స్ పైకి మనిషిని పంపే ప్రయోగాలు వేగవంతం చేస్తామని జిమ్ బ్రైడెన్‌స్టైన్ చెప్పారు.

సంక్షేమ పథకాలకు భారీగా కోతలు

సంక్షేమ పథకాలకు భారీగా కోతలు

2021 వార్షిక బడ్జెట్ లో ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్.. మెడికేర్‌, మెడికెయిడ్‌ లాంటి సంక్షేమ పథకాలపై భారీగా కోతలు ప్రతిపాదించారు. అదేసమయంలో అణ్వాయుధాల ఆధునీకరణకు ఏకంగా 5వేల కోట్ల డాలర్లు ప్రతిపాదించారు. గత బడ్జెట్ కంటే ఇది 18 శాతం పెంపు. అమెరికా రక్షణ కోసం ట్రంప్ ప్రతిపాదించిన 74,050 కోట్ల డాలర్ల బడ్జెట్.. గతంలో వచ్చిన అన్ని బడ్జెట్‌ల కంటె ఎక్కువ కావటం గమనార్హం. కాగా, అధ్యక్షుడు ప్రతిపాదించిన బడ్జెట్ ను.. డెమోక్రాట్లు ఎక్కువున్న రిప్రెజెంటేటివ్స్ హౌజ్ ఆమోదిస్తుందా? తిరస్కరిస్తుందా? అనేది చర్చనీయాంశమైంది. సెనేట్ లో మాత్రం రిపబ్లికన్లదే ఆధిపత్యం కాబట్టి అక్కడ ఈజీగా గట్టెక్కుతుంది.

English summary
Nasa wants to land the first woman and the next man on the South Pole of the Moon by 2024 under its Artemis programme, and US President Donald Trump wants to raise US space agency's budget to return humans to the Moon and send astronauts to Mars.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more