వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీ దేశంలో ఏం జరుగుతుందో తెలుసా: బ్రిటన్ ప్రధానిపై ట్రంప్ ఫైర్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. బ్రిటన్ ప్రధాని థెరిసా మేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం వ్యతిరేక వీడియోలను ట్రంప్‌ రీట్వీట్‌ చేయడం సరికాదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.

ట్రంప్‌ రీట్వీట్‌ చేసిన వీడియోలు ఓ బ్రిటన్‌ మహిళ పోస్టు చేసినవి కావడంతో.. థెరిసా విమర్శలను ఆయన తిప్పికొట్టారు. తనపై దృష్టిపెట్టడం మాని.. మీ దేశం గురించి ఆలోచించాలని ట్రంప్‌ హితవు పలికారు.

బ్రిటన్ మహిళ ట్వీట్

ఆ వివాదం వివారల్లోకి వెళితే.. బ్రిటన్‌ ఫస్ట్‌ అనే జాతీయవాద గ్రూపు డిప్యూటీ లీడర్‌ జైడా ఫ్రాన్సెస్‌ ఇటీవల తన ట్విట్టర్‌ ఖాతాలో మూడు వీడియోలను పోస్టు చేశారు.
ముస్లిం వలసదారులు ఓ చిన్నారిని కొట్టడం, వర్జిన్‌ మేరీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం, ఓ టీనేజీ కుర్రాడిని ముస్లిం యువత కొట్టి చంపడం.. ఇవే ఆ మూడు వీడియోలు.

రీట్వీట్ చేసిన ట్రంప్‌పై థెరిసా

రీట్వీట్ చేసిన ట్రంప్‌పై థెరిసా

కాగా, ఆమె ట్వీట్ చేసిన ఈ వీడియోలను ట్రంప్‌ బుధవారం రీట్వీట్‌ చేశారు. దీంతో ట్రంప్‌ రీట్వీట్లపై థెరిసా విమర్శలు చేశారు. అలాంటి వీడియోలను ట్రంప్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో రీట్వీట్‌ చేసి వాటికి ప్రచారం కల్పించడం ఎంతమాత్రం సరికాదని థెరిసా అన్నారు.

యూకేలో ఏం జరుగుతుందో తెలుసా?

యూకేలో ఏం జరుగుతుందో తెలుసా?

ఈ నేపథ్యంలో స్పందించిన ట్రంప్‌.. థెరిసాపై ప్రతి విమర్శలకు దిగారు. ‘ప్రధాని థెరిసా మే.. నాపై దృస్టి పెట్టడం మానండి. యూకేలో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఉగ్రవాదంపై ముందు దృష్టిపెట్టండి. మేం మంచిపనే చేస్తున్నాం' అంటూ ట్రంప్‌ ట్వీట్‌ చేశారు.

ట్రంప్‌కు ప్రశంస

ఇది ఇలా ఉండగా, ట్రంప్.. థెరిసా మేకు ట్విట్టర్ వేదిక హితవు పలికిన వ్యాఖ్యలను జైడా ఫ్రాన్సెస్ తన ఖాతాలో రీట్వీట్ చేశారు. అంతేగాక, చాలా బాగా చెప్పారు ట్రంప్.. అంటూ ఆయనను ప్రశంసించారు. తనకు ట్రంప్ సహాయం కావాలని కోరారు.

English summary
US President Donald Trump publicly rebutted British Prime Minister Theresa May on Thursday for criticising.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X