వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'డబుల్ థంబ్స్ అప్‌' చూపించారు సరే... పూర్తిగా కోలుకున్నట్లేనా.. ట్రంప్ డిశ్చార్జిపై ప్రశ్నలు...

|
Google Oneindia TeluguNews

కరోనా బారినపడి గత నాలుగు రోజులుగా వాల్టర్ రీడ్ మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిశ్చార్జి అయ్యారు. ఆస్పత్రి నుంచి వైట్ హౌస్‌కి చేరుకున్న ఆయన... ముఖానికి ఉన్న మాస్కును తొలగించి ఫోటోలకు పోజులు కూడా ఇచ్చారు. తాను ఫిట్‌గా ఉన్నానని చెప్పేలా రిపోర్టర్లకు 'డబుల్ థంబ్స్ అప్'తో సైగ చేశారు. అనంతరం ఎగ్జిక్యూటివ్ మాన్షన్‌లోకి వెళ్లిన ట్రంప్... వరుస ట్వీట్లు చేశారు. త్వరలోనే ఎన్నికల క్యాంపెయిన్‌‌కు సిద్దమవుతున్నట్లు తెలిపారు.

కీలక ఘట్టం... ముఖాముఖి డిబేట్‌కు సిద్దమైన ట్రంప్-బైడెన్... అందరి కళ్లు అటువైపే...కీలక ఘట్టం... ముఖాముఖి డిబేట్‌కు సిద్దమైన ట్రంప్-బైడెన్... అందరి కళ్లు అటువైపే...

థంబ్స్ అప్ సైగ...

థంబ్స్ అప్ సైగ...

వైట్ హౌస్‌కి చేరుకున్న సమయంలో ముఖానికి వైట్ సర్జికల్ మాస్కుతో కనిపించారు ట్రంప్. ఎప్పటిలాగే మెట్ల దారిలో వైట్ హౌస్ పోర్టికో అంతస్తులోకి వెళ్లారు. అక్కడే తన మాస్కును తొలగించి రిపోర్టర్లందరికీ థంబ్స్ అప్ సైగ చేశారు.తనను వెట్ హౌస్‌కి తరలించిన హెలికాప్టర్ మెరైన్ వన్‌కు సైనిక వందనం చేశారు. అనంతరం వరుస ట్వీట్లు చేసిన ట్రంప్... అమెరికన్లు కరోనా వైరస్‌కు భయపడవద్దని చెప్పారు. వైరస్‌ను ఎదుర్కొనేందుకు అందరం కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు. తన ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

హడావుడిగా డిశ్చార్జి...?

హడావుడిగా డిశ్చార్జి...?

మిలటరీ ఆస్పత్రిలో ట్రంప్‌కు చికిత్స అందించిన డా.నేవీ సీన్ కోన్లే సోమవారం(అక్టోబర్ 5) మాట్లాడుతూ.... ట్రంప్ ఇన్ఫెక్షన్‌తోనే ఉన్నారని... మరో వారం గడిస్తే తప్ప వైరస్ నుంచి పూర్తిగా బయటపడలేరని భావించామన్నారు. కానీ డిశ్చార్జికి కావాల్సిన అన్ని అర్హతలు ఉండటంతో ఆయన్ను పంపించేసినట్లు చెప్పారు. అయితే హడావుడిగా ట్రంప్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవడంతో ఆయనతో ఉండే అధికారులకు భయం పట్టుకుంది. ట్రంప్ శరీరంలో ఇంకా వైరస్ ఉండటంతో... ఆయనతో కలిసి పనిచేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇప్పటికీ వైరస్‌తోనే...?

ఇప్పటికీ వైరస్‌తోనే...?

అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ ట్రంప్ తీరును తప్పు పట్టారు. ట్రంప్ కోలుకోవడం సంతోషంగా ఉందన్న ఆయన... ట్రంప్ చేసిన కామెంట్లపై మాత్రం అభ్యంతరం వ్యక్తం చేశారు. 2లక్షల పైచిలుకు మంది అమెరికన్లను బలిగొన్న వైరస్‌ పెద్ద సమస్యేమీ కాదన్నట్లు మాట్లాడటం సరికాదన్నారు. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్&ప్రివెన్షన్ ప్రకారం... స్వల్ప లక్షణాల నుంచి ఒక మాదిరి లక్షణాలతో కోవిడ్ 19 బారినపడ్డవారి నుంచి చాలామందికి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి కనీసం 10 రోజులైన ఐసోలేషన్‌లో ఉండి తీరాలి. కానీ ట్రంప్ మాత్రం నాలుగు రోజులకే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవడంపై చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Recommended Video

Top News Of The Day : China పై Donald Trump ఆగ్రహం.. చర్యలకు డిమాండ్! || Oneindia Telugu
రెండెసివర్‌తో మెరుగుపడ్డ ఆరోగ్యం...

రెండెసివర్‌తో మెరుగుపడ్డ ఆరోగ్యం...

అక్టోబర్ 2న ట్రంప్ కరోనా వైరస్ బారినపడిన సంగతి తెలిసిందే. కరోనావైరస్ పరీక్షల్లో పాజిటివ్ అని నిర్దారణ అయిన 24 గంటల లోపే ఆయన ఆస్పత్రిలో చేరారు. ట్రంప్‌తో పాటు ఆయన సతీమణి,అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ కూడా కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ దశలోనే ఉన్న రెండెసివిర్ డ్రగ్‌ను ట్రంప్‌కు ఇవ్వడంతో ఆయన ఆరోగ్యం మెరుగుపడినట్లు వైద్యులు తెలిపారు.

English summary
President Donald Trump checked out of hospital on Monday after four days of emergency treatment for Covid-19, pulling off his mask the moment he reached the White House and vowing to quickly get back on the campaign trail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X