వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తూచ్: నేను అలా అనలేదు... అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందన్న ట్రంప్

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట మార్చారు. హెల్సిన్కీ వేదికగా జరిగిన శిఖరాగ్ర సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో దాదాపు 40 నిమిషాల పాటు భేటీ అయ్యారు. అనంతరం ఇరునేతలు మాట్లాడారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా రష్యా ఆ ఎన్నికల్లో కలగజేసుకుందని అమెరికా నిఘావర్గాలు బహిర్గతం చేశాయి.

అయితే సమావేశం అనంతరం అమెరికా ఎన్నికల్లో రష్యా ఎందుకు జోక్యం చేసుకుంటుందని చెప్పి ట్రంప్ విమర్శలపాలయ్యారు. దీంతో మరోసారి ట్రంప్ తన వ్యాఖ్యలను కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేశాడు. తను అలా అనలేదని... రష్యా జోక్యం ఎందుకు చేసుకుందనబోయి రష్యా జోక్యం చేసుకోలేదని చెప్పినట్లు వివరణ ఇచ్చారు. అంతేకాదు అమెరికా నిఘా వర్గాలపై తనకు పూర్తి నమ్మకం ఉందని ట్రంప్ చెప్పుకొచ్చారు.

Trump reverses remark on Russia involvement in 2016 US Presedential elections

2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుంది అని చెబుతూనే... మరోవైపు మిగతా దేశాల హస్తం కూడా ఉండి ఉండొచ్చన్న అనుమానం ట్రంప్ వ్యక్తం చేశారు. వాస్తవానికి హిల్లరీ క్లింటన్‌పై ట్రంప్ విజయం సాధించాలనే గట్టి ఆశ రష్యాకు ఉన్నిందని... అందుకోసమే వారి ఎన్నికల్లో రష్యా కలగజేసుకున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. పుతిన్‌తో సమావేశం అనంతరం ట్రంప్ అమెరికాకు తిరిగి వస్తున్న సమయంలోనే సొంత పార్టీవారు, విపక్షపార్టీ వారు పెద్దఎత్తున విమర్శలు చేశారు. కొందరైతే రష్యాతో సమావేశం అవడమే చారిత్రక తప్పిదమని అన్నారు.

English summary
Donald Trump has backtracked on his support of Vladimir Putin’s denial of Russian involvement in election meddling, claiming he “misspoke” during a press conference with the Russian leader and “accepts” US intelligence reports that Moscow sought to influence the 2016 presidential election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X