• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కిమ్-ట్రంప్ భేటీ వెనుక రాడ్‌మన్! కంటతడి పెట్టి ఒబామాపై ఆగ్రహం, ఎవరీ డెన్నిస్ రాడ్‌మన్?

By Srinivas
|

సింగపూర్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షులు కిమ్ జాంగ్ ఉన్ చారిత్రక భేటీ మంగళవారం జరిగింది. ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి కనిపించింది. ఇరువురు అధినేతలు కూడా భేటీ విజయవంతమైందని చెప్పారు. ఈ భేటీ చాలామందిలో ఆనందం నింపింది. అందరితో పాటు మాజీ ఎన్‌బీఐ స్టార్ డెన్నిస్ రాడ్‌మన్ కూడా ఆనందం వ్యక్తం చేశారు.

చదవండి: ట్రంప్‌ను మించి!: రన్నింగ్ బాడీగార్డ్స్ నుంచి.. కిమ్ భద్రతా వలయం, నోరు వెళ్లబెట్టాల్సిందే

కిమ్‌-ట్రంప్‌ భేటీ సందర్భంగా రాడ్‌మన్‌ ఆనందంతో కన్నీటి పర్యంతమయ్యారు. తాను ఒక మానవతావాదిని అని, అమెరికన్లు, ఉత్తర కొరియన్లు స్నేహంగా ఉండేలా చేయడం తన బాధ్యత అన్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌ నినాదమైన 'మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌' క్యాప్‌ను ధరించారు. ట్రంప్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. కాగా, తనకు ట్రంప్‌ ఫోన్‌ చేసి కృతజ్ఞతలు తెలిపారని రాడ్‌మన్‌ చెప్పారు.

చదవండి: ట్రంప్-కిమ్ జాంగ్ భేటీ: కిమ్ ఇంగ్లీష్, సింగపూర్ ఎక్కడుందని వెతుకుతున్న అమెరికన్లు

వారధి రాడ్‌మాన్, బాస్కెట్ బాల్ ఆటకు కిమ్ వీరాభిమాని

వారధి రాడ్‌మాన్, బాస్కెట్ బాల్ ఆటకు కిమ్ వీరాభిమాని

డెన్నిస్ రాడ్‌మన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి కారణం ఉంది. రెండు దేశాల మధ్య అతను వారధి అయ్యాడు. రాడ్‌మన్ అమెరికా బాస్కెట్‌ బాల్‌ చరిత్రలో హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌‌గా నిలిచిపోయిన ఆటగాడు. కానీ, అంతకు మించిన ఘనత ఆయన సాధించాడు ఇప్పుడు. కిమ్ జాంగ్ ఉన్‌కు అమెరికాపై ఉన్న ఆలోచనను మార్చిన కీలక వ్యక్తుల్లో రాడ్‌మన్‌ కూడా ఒకరు. ప్రపంచంతో దూరంగా మెలిగే ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ బాస్కెట్‌ బాల్‌కు వీరాభిమాని.

కిమ్‌తో తొలిసారి రాడ్‌మన్ భేటీ

కిమ్‌తో తొలిసారి రాడ్‌మన్ భేటీ

ఈ నేపథ్యంలో 2013 ఫిబ్రవరిలో రాడ్‌మన్‌ ఓ టీవీ ఛానల్‌ సాయంతో ఉత్తర కొరియా వెళ్లి బాస్కెట్‌ బాల్‌ ఆటలను నిర్వహించారు. అనంతరం ఆయన కిమ్‌తో తొలిసారి సమావేశమయ్యారు. కిమ్‌ అధికారం చేపట్టాక కలిసిన తొలి అమెరికన్‌ రాడ్‌మన్‌. వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు నెలకొన్నాయి. ఉత్తర కొరియా నుంచి వచ్చిన తర్వాత రాడ్‌మన్‌ ఒక ట్వీట్‌ చేశారు.

కెన్నిత్ బే విడుదల, రాడ్‌మన్ విజ్ఞప్తి పక్కన పెట్టిన ఒబామా ప్రభుత్వం

కెన్నిత్ బే విడుదల, రాడ్‌మన్ విజ్ఞప్తి పక్కన పెట్టిన ఒబామా ప్రభుత్వం

ఈ ట్వీట్‌లో ఉత్తర కొరియాలో పదిహేనేళ్లుగా బందీగా ఉన్న కెన్నిత్‌ బేని విడుదల చేయాలని కిమ్‌ను కోరారు. కిమ్ సానుకూలంగా స్పందించి విడుదల చేశారు. 2013లో మరోసారి ప్యోంగ్‌యాంగ్‌కు వెళ్లి బాస్కెట్‌ బాల్‌ను ఆడాడు. ఆ సందర్భంగా కిమ్‌ కుటుంబ సభ్యులను కూడా కలిశారు. అక్కడి నుంచి వచ్చాక తర్వాత ఉత్తర కొరియాతో చర్చలకు నాటి అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామాను ఒప్పించే ప్రయత్నాలు చేశారు. కానీ, ఒబామా ప్రభుత్వం రాడ్‌మన్‌కు అవకాశమివ్వలేదు. ఈ విషయాన్ని స్వయంగా రాడ్‌మన్‌ తెలిపారు.

క్షమాపణలు చెప్పినా.. దర్యాఫ్తు

క్షమాపణలు చెప్పినా.. దర్యాఫ్తు

రాడ్‌మన్ 2014లో మరోసారి ఉత్తర కొరియా వెళ్లారు. ఆ సమయంలో అతను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అతను క్షమాపణ చెప్పినప్పటికీ అమెరికా ప్రభుత్వం వదల్లేదు. కిమ్‌ ఇచ్చే వేలాది డాలర్లను తీసుకురావడం ద్వారా చట్టాన్ని అతిక్రమించాడని దర్యాప్తు చేపట్టింది. ఓ దశలో ఉత్తర కొరియా పౌరసంబంధాల అధికారి పాత్ర పోషిస్తున్నాడని విమర్శలు ఎదుర్కొన్నాడు.

రాడ్‌మన్‌కు చంపుతామని బెదిరింపులు

ఆ సమయంలో రాడ్‌మన్‌ను చంపుతామని బెదిరింపులు వచ్చాయి. ఆ తర్వాత అతను కిమ్‌ను కలుసుకోలేదు. 2017లో ఉత్తర కొరియా క్రీడా శాఖ మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ప్రస్తుత అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌ రచించిన ఆర్ట్‌ ఆఫ్ ది డీల్‌ పుస్తకాన్ని ఇతర బహుమతులను కిమ్‌ జాంగ్ ఉన్ కోసం పంపించారు. ట్రంప్ - కిమ్ భేటీపై రాడ్‌మన్ స్పందిస్తూ.. ఇరుదేశాలు ఒక్కటి చేసేందుకు ప్రయత్నాలు చేశామని, సంతోషాలు నింపుదామని, ట్రంప్ దీనిని మరింత ముందుకు తీసుకుపోవాలని ఆకాక్షించారు. ఈ భేటీ పట్ల తాను సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. ఒబామా తన విజ్ఞప్తిని పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాడ్‌మన్‌పై ట్రంప్ నాడు, ఆహ్వానం లేకపోవడంపై నేడు

రాడ్‌మన్‌పై ట్రంప్ నాడు, ఆహ్వానం లేకపోవడంపై నేడు

అణు నిరాయిధీకరణ చర్చల్లో ఆరు లేదా ఏడు అడుగుల మాజీ ఎన్‌బీసీ ఆటగాడు ఉండొచ్చన్న విషయం తనకు తెలియదని చర్చలకు కొద్ది రోజుల ముందు ట్రంప్‌ అన్నారు. ఆయన జీ7 సమావేశానికి వెళ్లినప్పుడు మాత్రం డెన్నిస్‌ రాడ్‌మన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. పడినా వెంటనే పుంజుకునే తత్వం రాడ్‌మన్‌కు ఉందని ట్రంప్‌ అన్నారు. రాడ్‌మన్‌ను చర్చలకు ఎందుకు ఆహ్వానించలేదో ట్రంప్‌ ప్రెస్‌ కార్యదర్శి హోగెన్‌ క్లుప్తంగా చెప్పారు. ట్రంప్‌ ఒక్కరే అణునిరాయుధీకరణ చర్చలను బాగా చేయగలరని భావించారన్నారు. కాగా, వారి భేటీ సమయంలో రాడ్‌మన్ సింగపూర్లోనే ఉన్నారు.

English summary
Former NBA star and North Korea Chairman Kim Jong Un's friend Dennis Rodman is in Singapore to witness the historic Trump-Kim summit on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X