వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: ట్రంప్ ఆరోపణలు నిజమే -ఆధారాలతో విజిల్ బ్లోయర్లు -డొమినియన్ ఓటింగ్ సిస్టమ్ అక్రమాలంటూ

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయలంటూ ఆరోపణలు చేస్తోన్న ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఆయన క్యాంపెయిన్ తాజాగా మరో బాంబు పేల్చారు. డెమోక్రాట్లు మోసపూరితంగా గెలిచారన్న ఆరోపణలు వాస్తవమేనని, వాటికి సంబంధించిన ఆధారాలను బయటపెట్టడానికి డొమినియన్ విజిల్ బ్లోయర్లు సిద్ధంగా ఉన్నారని ట్రంప్ అటార్నీ రూడీ గిలియానీ చెప్పారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఆయన కీలక విషయాలను వెల్లడించారు..

Recommended Video

US Election 2020 Results: Trump Wins Alaska, Joe Biden On Donald Trump

 అమెరికాలో మళ్లీ ఎన్నికలు?: ట్రంప్ శిబిరం ట్వీట్‌తో కలకలం -అధికార మార్పిడి మళ్లీ అయనకేనట అమెరికాలో మళ్లీ ఎన్నికలు?: ట్రంప్ శిబిరం ట్వీట్‌తో కలకలం -అధికార మార్పిడి మళ్లీ అయనకేనట

ఫొటోలతో సహా ఆధారాలు..

ఫొటోలతో సహా ఆధారాలు..

అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలకు సంబంధించి డొమినియన్ సంస్థకు చెందిన ఇద్దరు విజిల్ బ్లోయర్లు(అనైతిక చర్యలో పాల్గొని, ఆ సమాచారాన్ని బయటపెట్టే వ్యక్తులు) ముందుకొచ్చారని, ఏయే రాష్ట్రాల్లో ఎన్ని లక్షల అక్రమ ఓట్లు పడ్డాయో, ఆ మోసపూరిత ప్రక్రియ ఎలా సాగిందో ఫొటోలతో సహా తగిన ఆధారాలు వాళ్ల దగ్గర ఉన్నాయని ట్రంప్ లాయర్ రూడీ గిలియానీ చెప్పారు. మీడియా దిగ్గజం స్టీవ్ బానన్ తో కలిసి బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఆయనీ అంశాలను వెల్లడించినట్లు ‘గేటెవే పండిట్' అనే మీడియా సంస్థ రిపోర్ట్ చేసింది. ఈ సంస్థ గత కొంతకాలంగా ఓటింగ్ సిస్టమ్ లోని లోపాలు,అక్రమాలపై పెద్ద ఎత్తున వార్తలు ప్రసారం చేస్తోంది. కాగా..

ట్రంప్‌కు ఊరట అలస్కాలో విజయం -ఫలితాలపై పోరు ముమ్మరం -ఎవరూ అడ్డుకోలేరని బైడెన్ గరంట్రంప్‌కు ఊరట అలస్కాలో విజయం -ఫలితాలపై పోరు ముమ్మరం -ఎవరూ అడ్డుకోలేరని బైడెన్ గరం

అసలేంటీ డొమినియన్ సిస్టమ్?

అసలేంటీ డొమినియన్ సిస్టమ్?

అమెరికాలో ఓటింగ్ ప్రక్రియకు అవసరమైన సాఫ్ట్ వేర్, యంత్రాలు, ఇతర సామాగ్రిని సరఫరా చేసే రెండో అతి పెద్ద సంస్థ పేరే ‘డొమినియన్'. 2020 ఎన్నికల్లో 30కిపైగా రాష్ట్రాల్లో ‘డొమినియన్ ఓటింగ్ సిస్టమ్'గా పిలిచే సాఫ్ట్ వేర్, ఓటింగ్ యంత్రాలను పేపర్ బ్యాలెట్లతోపాటే వినియోగించారు. డొమినియన్ సిస్టమ్ సాఫ్ట్ వేర్ లో ఉద్దేశపూర్వకంగా అవాంతరాలు సృష్టించి, లెక్కల్ని తారు మారు చేయడం ద్వారా డెమోక్రాట్లు మోసానికి పాల్పడ్డారని, ఆ కుట్రలో భాగం పంచుకున్న ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు విజిల్ బ్లోయర్లుగా మారి నిజాలు వెల్లడించేందుకు ముందుకొచ్చారని ట్రంప్ క్యాంపెయిన్ చెబుతున్నది. డొమినియన్ ఓటింగ్ మిషిన్లు ఉపయోగించినవాటిలో బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ గా మారిన జార్జియా, మిచిగన్ తదితర రాష్ట్రాలు కూడా ఉన్నాయి.

అతిపెద్ద కుంభకోణం..

అతిపెద్ద కుంభకోణం..


‘డొమినియన్ ఓటింగ్ సిస్టమ్'లో అక్రమాలపై ఆ సంస్థలోనే పనిచేసిన విజిల్ బ్లోయర్లు బయటపెట్టబోతున్నారన్న వార్త అమెరికా రాజకీయాల్లో కలకలం రేపింది. ‘‘ఎన్నికల అక్రమాలపై ట్రంప్ చెప్పింది నిజం. విజిల్ బ్లోయర్లు ముందుకు రావడమే అందుకు నిదర్శనం''అని ట్రంప్ అనుకూల విద్యార్థి సంఘం నేత ర్యాన్ ఫోర్నియర్ చేసిన ట్వీట్ ను ట్రంప్ కొడుకు ఎరిక్ రీట్వీట్ చేస్తూ.. ‘‘ఇది ఆరంభం మాత్రమే.. అసలు కథ ముందుంది''అని కామెంట్ పెట్టారు. ‘‘ఓరి దేవుడా.. ఎన్నికలను దొంగిలించారా? ఓట్లను తారుమారు చేశారా? ఈ లెక్కన ట్రంప్ కు 9కోట్ల పైచిలుకు ఓట్లు వచ్చుండాలి. ప్రపంచ చరిత్రలోనే ఇది అతి పెద్ద కుంభకోణం''అని ప్రముఖ రచయిత వేన్ అలెన్ రూట్ కామెంట్ చేశారు. అయితే వీళ్లందరి ట్వీట్లను ‘తప్పుడు సమాచారం'గానే భావించాలని ట్విటర్ సంస్థ హెచ్చరించింది. మరోవైపు..

సాఫ్ట్‌వేర్ సేఫ్.. అక్రమాలు జరగలేదు..

సాఫ్ట్‌వేర్ సేఫ్.. అక్రమాలు జరగలేదు..

దేశవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణకు ఉపయోగించిన సాఫ్ట్ వేర్ లో ఎలాంటి అవాంతరాలు చోటుచేసుకోలేదని డొమినియన్ ఓటింగ్ సిస్టమ్స్ వివరణ ఇచ్చింది. డొమినియన్ యంత్రాల వల్లే ఓట్ల లెక్కింపులో తప్పులకు, అక్రమాలు జరిగాయన్న ఆరోపణ నిరాధారమైందని ఆ సంస్థ పేర్కొంది. పలు రాష్ట్రాల ఎన్నికల అధికారులు, ఎన్నికల పర్యవేక్షకులు కూడా డొమినియన్ సిస్టమ్ లో తప్పులు లేవని కరాకండిగా చెప్పారు. అక్రమాలు జరిగాయంటూ ప్రెసిడెంట్ ట్రంప్, ఆయన క్యాంపెయిన్ చేస్తున్న ప్రచారంపై ఖండనలు వెలువడుతున్నాయి. అయితే, ట్రంప్ అటార్నీ రూడీ గిలియానీ చెప్పినట్లు ఆ విజిల్ బ్లోయర్ల దగ్గరున్న ఆధారాలు బయటపడి, అవి నిజమే అని నిర్ధారణ అయ్యేంత వరకు దీనిని తప్పుడు సమాచారంగానే పరిగణించాల్సి ఉంటుందని అబ్జర్వర్లు చెప్పారు. దీనిపై డెమోక్రాట్లు స్పందించాల్సి ఉంది.

English summary
us president donald trump's Attorney Rudy Giuliani on wednesday confirmed that whistleblowers from Dominion have come forward. Dominion voting machines have been used across the United States during the presidential election, and whistleblowers are now coming forward from the software giant. trump's son eric trump calls it This is just the beginning
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X