వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిక్ టాక్ పై నిషేధంపై ట్రంప్ తాజా నిర్ణయం .. కొత్త ఉత్తర్వులో టిక్ టాక్ కు ఊరట .. ఏం చేశారంటే

|
Google Oneindia TeluguNews

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్, ఎంటర్టైన్మెంట్ యాప్ టిక్‌టాక్ పై అమెరికా నిషేధం విధించటమే కాకుండా ఈ నిషేధం 45 రోజుల్లో అమల్లోకి రావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించిన విషయం తెలిసిందే . దీని కోసం ట్రంప్ చాలా సీరియస్ గా కార్యనిర్వాహక ఉత్తర్వును జారీ చేశారు . ఇప్పుడు తాజాగా టిక్ టాక్ యాజమాన్యానికి ఊరట కలిగిస్తూ మరో కార్యనిర్వాహక ఉత్తర్వును ఇచ్చారు ట్రంప్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వు టిక్‌టాక్‌కు తన అమెరికా కార్యకలాపాలను విక్రయించడానికి వెసులుబాటు కల్పించింది.

Recommended Video

TikTok Need to Find US Based Owner or it Will be Forced to Shut operations : Trump || Oneindia

బ్యాటరీలు లేకుండా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు: భద్రతకు ముప్పు అంటున్నమహీంద్రా ఎలక్ట్రిక్

నిషేధం గడువు పొడిగించిన ట్రంప్

నిషేధం గడువు పొడిగించిన ట్రంప్

గడువును పొడిగించడం ద్వారా కొంత ఉపశమనం కలిగించిన ట్రంప్ క్రొత్త ప్రకారం గత ఆదేశాలకు మరో 45 రోజులు కలిసివస్తుంది . మొత్తంగా ఇప్పుడు టిక్‌టాక్‌కు యుఎస్ ఆధారిత సంస్థకు అమ్ముకోటానికి 90 రోజుల సమయాన్ని ఇచ్చింది . లేకుంటే యుఎస్‌లో కార్యకలాపాలపై నిషేధం అమలవుతుంది. ఒకేవేళ యూఎస్ లో కార్యాకలాపాలు కొనసాగించుకోవాలంటే తప్పనిసరిగా యూఎస్ కంపెనీకి అమ్ముకోవాల్సిందే. లేదంటే వ్యాపారం మూసివేయవలసి వస్తుంది.

 యూఎస్ వ్యాపార సంస్థకు అమ్ముకోవాలని సూచన .. లేదంటే నిషేధం అమలు

యూఎస్ వ్యాపార సంస్థకు అమ్ముకోవాలని సూచన .. లేదంటే నిషేధం అమలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన యుఎస్ వ్యాపారాన్ని విక్రయించడానికి లేదా దాని అమెరికన్ కార్యకలాపాలను ముగించడానికి టిక్‌టాక్ యొక్క మాతృ సంస్థ బైట్‌డాన్స్‌కు కాలపరిమితిని పొడిగిస్తూ కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వులను జారీ చేశారు. మునుపటి ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుల ప్రకారం, బైట్‌డాన్స్‌కు 45 రోజుల గడువు ఇవ్వబడింది, అది సెప్టెంబర్ 20 తో ముగియనుంది. కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌తో బైట్‌డాన్స్‌కు మరికొంత కాలం స్వల్ప ఉపశమనం లభించింది, ఎందుకంటే ఇప్పుడు అమ్మకపు ఒప్పందం కుదుర్చుకోవడానికి నవంబర్ 12 వరకు సమయం ఉంది.

కొనుగోలు చేసే సంస్థ పాత డేటా పూర్తిగా తొలగించి సురక్షితంగా టిక్ టాక్ నిర్వహణ చెయ్యాలన్న యూఎస్

కొనుగోలు చేసే సంస్థ పాత డేటా పూర్తిగా తొలగించి సురక్షితంగా టిక్ టాక్ నిర్వహణ చెయ్యాలన్న యూఎస్

ఒకవేళ ఏదైనా అమెరికా సంస్థ టిక్ టాక్ ను కొనుగోలు చేస్తే అందులో ఉన్న డేటాను పూర్తిగా తొలగించాలి . అమెరికన్ వినియోగదారుల నుండి మొత్తం టిక్‌టాక్ డేటాను నాశనం చెయ్యాలి . టిక్ టాక్ కు సంబంధించిన పాత డేటా అంతా తొలగించి భద్రతా ప్రమాణాలు పాటిస్తూ నిర్వహించాల్సి ఉంటుందని యూఎస్ పేర్కొంది. మైక్రోసాఫ్ట్ బైట్‌డాన్స్ టిక్‌టాక్ యొక్క యుఎస్ వ్యాపారాన్ని కొనుగోలు చేయాలనే ఉద్దేశ్యాన్ని వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్ల అమెరికా అధ్యక్షుడితో కూడా చర్చించారు.

టిక్ టాక్ ను కొనుగోలు చెయ్యాలని చూస్తున్న మైక్రోసాఫ్ట్

టిక్ టాక్ ను కొనుగోలు చెయ్యాలని చూస్తున్న మైక్రోసాఫ్ట్

మైక్రోసాఫ్ట్ ఈ చర్చలు సెప్టెంబర్ 15, 2020 లోపు జరగవచ్చు అని ఆశిస్తున్నట్లు తెలిపింది. మైక్రోసాఫ్ట్ టిక్‌టాక్ ను ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్‌ లలో కూడా కొనుగోలు చేయడాన్ని పరిశీలిస్తున్నట్లు ఊహాగానాలు వచ్చాయి. మైక్రోసాఫ్ట్ టిక్ టాక్ విషయంలో చేస్తున్న టాక్స్ పై వ్యాఖ్యానిస్తూ, చైనా కమ్యూనిస్ట్ పార్టీతో సన్నిహిత సంబంధాలున్న ప్రచురణసంస్థ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్, యజమాని తన ఇంటికి అతిధులు వచ్చినప్పుడు దోచుకోవడం ఎలా ఉంటుందో టిక్ టాక్ మైక్రోసాఫ్ట్ కొనుగోలు కూడా అలాంటిదని వ్యాఖ్యానించారు .

English summary
A new executive order issued by the President of the United States Donald Trump has given some relief to TikTok by extending the deadline to sell its US operations. The new order adds 45 days to the initial deadline. In total now TikTok has 90 days to find a US based owner or else it will be forced to shut operations in the US.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X