వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ చికిత్స ఖర్చు తడిసిమోపెడు - కరోనా మందుల కంటే తిరుగుళ్లకే అధికం

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కరోనా వైరస్ బారినపడి, త్వరితగతిన కోలుకున్న సంగతి తెలిసిందే. అయితే, సారుగారి మెడికల్ బిల్లు మాత్రం.. సాధారణ అమెరికన్లతో పోల్చుకుంటే భారీగా ఉండటం గమనార్హం. ప్రెసిడెంట్ కాబట్టి ట్రంప్ వైద్య ఖర్చులన్నీ ఫెడరల్ సర్కారే భరిస్తుంది. కరోనా బిల్లులకు సంబంధించి సామాన్యులకు, ట్రంప్ కు మధ్య వ్యత్యాసాలపై అక్కడి మీడియా పలు రిపోర్టులను ప్రచురించింది.

లారీ క్లీనర్ నుంచి ఎమ్మెల్యేగా -శోకంలో కార్మిక లోకం - సీపీఐ నేత గుండా మల్లేశ్ కన్నుమూతలారీ క్లీనర్ నుంచి ఎమ్మెల్యేగా -శోకంలో కార్మిక లోకం - సీపీఐ నేత గుండా మల్లేశ్ కన్నుమూత

డోనాల్డ్ ట్రంప్ కొవిడ్-19 చికిత్స కోసం అమెరికన్ ఆరోగ్య వ్యవస్థలో లక్ష డాలర్లకంటే ఎక్కువ ఖర్చయినట్లు న్యూయార్క్ టైమ్స్ ఒక నివేదిక తెలిపింది. ఆ పత్రిక లెక్కల ప్రకారం.. ట్రంప్ కు కొవిడ్ చికిత్సలో భాగంగా అందించే యాంటీబాడీలు, ఇతర మెడిసిన్ కంటే.. ఆయన టెస్టుల కోసం పలు మార్లు ప్రత్యేక హెలికాప్టర్ లో చేసిన ప్రయాణాల ఖర్చు అధికంగా ఉంది. సాధారణ పౌరుడికి 10వేల డాలర్లు అయ్యే బిల్లు కాస్తా.. ట్రంప్ కు మాత్రం లక్షల డాలర్లుగా ఉంది. దీనిని ఫెడరల్ ప్రభుత్వమే భరిస్తున్నది.

Trump’s medical bill would cost an average American citizen at least $100k, report says

కరోనా చికిత్స కోసం ట్రంప్.. వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్‌ కు హెలికాప్టర్ ద్వారా రాకపోకలు సాగించడం వల్లే మెడికల్ బిల్లు తడిసిమోపెడు అయిందని టైమ్స్ పేర్కొంది. అంతేకాదు, ఒక సాధారణ అమెరికన్ కరోనా టెస్టు చేయించుకోడానికి 100 డాలర్లు ఖర్చయితే, ఇప్పటిదాకా కరోనా టెస్టు కోసం అత్యధిక ఖర్చు ప్రెసిడెంట్ పేరుమీదే జరిగినట్లు టైమ్స్ తెలిపింది.

నిజానికి ట్రంప్ కు అందించిన రెజెనెరాన్ యాంటీబాడీ కాక్టెయిల్, రెండెసివీర్ లపై చార్జీలు లేవు. క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా వాటిని పూర్తిగా ఉచితంగానే అందజేస్తున్నారు. కొవిడ్ చికిత్స పేరుతో భారీ వసూళ్లకు పాల్పడకుండా కట్టుదిట్టమైన చర్యలు ఉన్నప్పటికీ.. చాలా మంది ప్రజలు అధిక బిల్లులతో బెంబేలవుతున్నట్లు రిపోర్టులు వచ్చాయి. అధ్యక్షుడి చికిత్సకు లక్ష డాలర్ల వరకు ఖర్చు అయిందన్న అంచనాలు రాజకీయంగానూ చర్చనీయాంశం అయ్యాయి.

జగన్ ఆమె దుస్తులు విప్పేస్తున్నారు - సీఎంగా 3.5ఏళ్లు కష్టం - కాపాడేది ఆయనొక్కడే: ఎంపీ రఘురామ జగన్ ఆమె దుస్తులు విప్పేస్తున్నారు - సీఎంగా 3.5ఏళ్లు కష్టం - కాపాడేది ఆయనొక్కడే: ఎంపీ రఘురామ

అమెరికాలో 60 ఏళ్లు పైబడిన రోగికి కొవిడ్-19 చికిత్స కోసం ఆసుపత్రిలో చేరేందుకు సగటున 61,912డాలర్లు ఖర్చవుతున్నదని, క్లెయిమ్స్ డేటాబేస్, ఫెయిర్ హెల్త్ నుంచి వచ్చిన డేటా ప్రకారం.. అదే సంస్థ చెల్లించిన సగటు మొత్తం 31,575డార్లుగా అని టైమ్స్ అంచనా వేసింది. మార్చిలో, కైజర్ ఫ్యామిలీ ఫౌండేషన్ నుండి వచ్చిన విశ్లేషణ ప్రకారం, యజమాని బీమా ఉన్నవారికి కోవిడ్ -19 చికిత్స యొక్క సగటు వ్యయం, మరియు సమస్యలు లేకుండా, సుమారు, 9,763 డాలర్లు ఖర్చు అవుతుంది. చికిత్సలో సమస్యలు ఉన్న ఎవరైనా బిల్లులు సుమారు 20,292 డాలర్లకు పెరిగాయి.

కరోనా వైరస్ కు మోస్ట్ ఎఫెక్టెడ్ దేశంగా ఉన్న అమెరికాలో ఇప్పటివరకు 80.04లక్షల కేసులు నమోదుకాగా, మొత్తం 2.20లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అంతాకలిపి సుమారు 52 లక్షల మంది వ్యాధి నుంచి కోలుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 26.27లక్షలుగా ఉంది.

English summary
Donald Trump's medical treatment for coronavirus would have cost more than $100,000 in the American health system, a report by The New York Times has said. According to calculations by the newspaper, the president’s arrival and departure by helicopter, multiple coronavirus tests, oxygen, steroids and an experimental antibody treatment would have amounted to tens of thousands to any normal citizen. As the president, the cost of Mr Trump’s treatment are covered by the federal government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X