వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పన్ను ఎగవేతలో తన తల్లిదండ్రులకు డొనాల్డ్ ట్రంప్ సహకరించాడు: అమెరికా పత్రిక కథనం

|
Google Oneindia TeluguNews

అమెరికా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఇన్‌కమ్ టాక్స్ నిఘా వేసిందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ తన తల్లిదండ్రులు పన్ను కట్టకుండా ఉండేందుకు సహకరించారన్న ఆరోపణలు ప్రస్తుతం అమెరికాలో వినిపిస్తున్నాయి. అంతేకాదు తన తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి వారసత్వంగా పెద్ద మొత్తంలో డబ్బులు ట్రంప్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ డబ్బు గురించి ట్రంప్ ఎప్పుడూ ప్రస్తావించలేదు. తాను చెప్పిన సంపాదనకంటే ఈ డబ్బులు చాలా ఎక్కువగా ఉన్నాయి.

ట్రంప్ 1990లో పన్ను కట్టకుండా ఎగవేశాడని అమెరికా ప్రముఖ దినపత్రిక న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. అంతేకాదు కట్టిన దాంట్లో కూడా చాలా మోసాలు ఉన్నాయని పేర్కొంది. దీంతో వారసత్వంగా వచ్చిన ఆస్తులు మరింత పెరిగాయని దినపత్రిక వెల్లడించింది. అయితే చాలా సందర్భాల్లో తన తండ్రి నుంచి కొంత సహాయం పొందినట్లు ట్రంప్ చెప్పారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫ్రెడ్ ట్రంప్ నుంచి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకు కొంత సహాయం పొందినట్లు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయితే న్యూయార్క్ టైమ్స్ పత్రిక క్షుణ్ణంగా చేసిన పరిశోధనలో అదంతా తప్పు అని తేల్చింది. సక్రమంగా ఏది సంపాదించలేదని వెల్లడించింది. తండ్రి రియల్ ఎస్టేట్ కార్యక్రమాలకు ట్రంప్ ఈ రోజున్న డాలర్ విలువ ప్రకారం 413 మిలియన్ డాలర్లు నాడు అందుకున్నారని పత్రిక వెల్లడించింది.

డొనాల్డ్ ట్రంప్ మూడేళ్ల వయసున్నప్పుడే తన సంపాదన ఈ రోజు డాలర్ విలువతో పోలిస్తే 2లక్షల డాలర్లు. ఇక 8 ఏళ్లకే ఆయన అపరకోటీశ్వరుడిగా అవతారమెత్తారు. ఇక కాలేజీలో డిగ్రీ పూర్తి చేయగానే తన తండ్రి దగ్గర నుంచి ట్రంప్ ఏడాదికి ఒక మిలియన్ డాలర్లు పొందేవారు.ఇక ట్రంప్ 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు వచ్చే సరికి ఆయన ఏడాదికి 5 మిలియన్ డాలర్లు సంపాదించేవారు. ఈ నగదు మొత్తం ఆయన తండ్రి టాక్స్ కట్టకుండా ట్రంప్‌ పేరుకు బదిలీ చేయడం...అలా సహకరించాడని న్యూయార్క్ టైమ్స్ పత్రిక వివరించింది. అంతేకాదు ట్రంప్ తన సోదరులు సోదరీమణులు కొన్ని లేని కంపెనీలను సృష్టించారని పేర్కొంది. మరోవైపు ట్రంప్ తండ్రి కొన్ని మిలియన్ డాలర్లు పన్ను కట్టకుండా ఎలా ఎగవేయాలో పక్కా ప్రణాళిక వేసి దాన్ని అమలు చేశారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. 1999లో ట్రంప్ తండ్రి మరణించారని 2000 ట్రంప్ తల్లి మేరీ ట్రంప్ మరణించారని అంతకుముందు తమ ఐదుగురు పిల్లలకు ఒక బిలియన్ డాలర్లు బదిలీ చేశారని పత్రిక స్పష్టం చేసింది. దీంతో కనీసం ఎంతలేదన్న 550 మిలియన్ డాలర్లు పన్ను కట్టాల్సి ఉంది కానీ ట్రంప్ మాత్రం 52.2 మిలియన్ డాలర్లే పన్నుగా కట్టినట్లు రికార్డులు చూపిస్తున్నాయని పత్రిక పేర్కొంది.

Trumps parents were helped by him to dodge millions of dollars in taxes:The New York Times

ఇదిలా ఉంటే న్యూయార్క్ టైమ్స్‌లో వచ్చిన వార్తలపై స్పందించేందుకు ట్రంప్ నిరాకరించారు. మరోవైపు ఆయన లాయర్ చార్ల్‌స్ హార్డర్ ఈ వార్తలన్నీ అవాస్తవం అని తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో అధ్యక్షుడు ట్రంప్‌కు ఎలాంటి సంబంధం లేదని వాటన్నిటినీ అతని కుటుంబ సభ్యులు చూసుకుంటున్నారని తెలిపాడు. ఇదిలా ఉంటే గత అధ్యక్షుల్లా ట్రంప్ తన టాక్స్ రిటర్న్స్ గురించి ఇప్పటి వరకు బహిర్గతం చేయలేదు. అయితే ఒక వేళ నిజంగానే ట్రంప్ తన తల్లిదండ్రులు పన్ను కట్టకుండా ఉండేందుకు సహకరించారన్న ఆరోపణలు రుజువైతే ఆయన పై ఎలాంటి క్రిమినల్ విచారణ ఉండదని అయితే పన్ను ఎగవేతకు గాను ఆయన భారీగా జరిమానా కట్టాల్సి ఉంటుందని టాక్స్ ఎక్స్‌పెర్ట్స్ చెబుతున్నారు.

English summary
United States President Donald Trump “participated in dubious tax schemes during the 1990s, including instances of outright fraud, that greatly increased the fortune he received from his parents”, The New York Times said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X