వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ మాట: ఏప్రిల్ నాటికి ప్రతీ అమెరికన్‌ను వ్యాక్సిన్.. పూర్తిస్థాయిలో అందుబాటులో..

|
Google Oneindia TeluguNews

అగ్రరాజ్యం అమెరికాను కూడా కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. 6.8 మిలియన్లకు పైగా పాజిటివ్ కేసులు రావడంతో అమెరికా వణికిపోతోంది. వైరస్‌కు వ్యాక్సిన్ రావడం మరింత ఆలస్యం అవడంతో కేసులు కూడా పెరుగుతున్నాయి. అయితే వ్యాక్సిన్ గురించి మరోసారి అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశారు. తమ దేశంలోని ప్రతీ పౌరునికి మరో 7 నెలల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని వివరించారు. ఈ వార్త అమెరికన్లకు కాస్త ఊరట కలిగిస్తోంది.

 మరోసారి తప్పులో కాలేసిన డొనాల్డ్ ట్రంప్: జో బిడెన్‌పై ట్వీట్ రివర్స్ మరోసారి తప్పులో కాలేసిన డొనాల్డ్ ట్రంప్: జో బిడెన్‌పై ట్వీట్ రివర్స్

వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ప్రతీ పౌరుడికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని ట్రంప్ అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. వైరస్ విజృంభించడం వల్ల నెల నెల మిలియన్ల కొద్దీ డోసులు అవసరవుతాయని తెలిపారు. అయితే ఏప్రిల్ వరకు మాత్రం పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ ఉంటుందని.. కొరత ఉండబోదు అని చెప్పారు. అన్నీ నిర్దారణ పరీక్షలు చేసి.. సేఫ్ అని ఫేడరల్ హెల్త్ రెగ్యులేటరీ ఆమోదం తెలిపిన 24 గంటల్లో వ్యాక్సిన్ మార్కెట్‌లో వస్తుందని తెలిపారు.

Trump says he expects to have coronavirus vaccine for every American by April

Recommended Video

BJP Didn’t Fight Nizam, Congress Did, Says Uttam Kumar Reddy | Oneindia Telugu

కరోనా వైరస్ కోసం వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తోందని.. త్వరలోనే తాము వైరస్‌ను జయిస్తామని తెలిపారు. అయితే పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ అక్టోబర్ వరకు వస్తుందని ఇదివరకు ట్రంప్ పేర్కొన్నారు. కానీ వ్యాక్సిన్ ఎప్పుడు వస్తోందనే అంశంపై నిపుణులు మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. ప్రయోగాలు చివరి దశలో ఉన్నందున.. సమయం చెప్పడం లేదు. కానీ ఒక్కసారి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే.. వైరస్‌ను తరిమికొడతామని ట్రంప్, నిపుణులు చెబుతున్నారు.

English summary
President Donald Trump said on Friday he expects to have available enough doses of a coronavirus vaccine for every American by April.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X