వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్టార్మీతో 1,30,000డాలర్ల ఎఫైర్ ఒప్పందం: ఎట్టకేలకు స్పందించిన ట్రంప్, ఏమన్నారంటే?

|
Google Oneindia TeluguNews

Recommended Video

స్టార్మీతో 1,30,000డాలర్ల ఎఫైర్ ఒప్పందం: ఎట్టకేలకు స్పందించిన ట్రంప్, ఏమన్నారంటే?

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు తనపై వచ్చిన ఎఫైర్లపై స్పందించారు. తాను ఎఫైర్ నడిపినట్లు ప్రచారం జరుగుతున్న పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కి 1,30,000డాలర్లు చెల్లించినట్లు తనకు తెలియదని ట్రంప్ స్పష్టం చేశారు.

2006లో ట్రంప్‌తో తనకు ఎఫైర్ ఉందని, అది బయట పెట్టకుండా ఉండేందుకు తనకు 2016 అక్టోబరులో ట్రంప్ ప్రైవేట్ అటార్జీ మైకేల్ కోహెన్ 1,30,000డాలర్లు చెల్లించారని స్టార్మీఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ట్రంప్ దీనిపై గురువారం స్పష్టతనిచ్చారు.

ట్రంప్ సమాధానం ఇదీ

ట్రంప్ సమాధానం ఇదీ

పోర్న్ స్టార్ స్టార్మీడేనియల్స్‌కు కోహెన్ భారీ మొత్తం డబ్బు చెల్లించిన విషయం మీకు తెలుసా? అని మీడియా ప్రశ్నించగా.. తనకు తెలియదని ట్రంప్ సమాధానమిచ్చారు. అయితే, ఆ తర్వాత ఇంకేమైనా ఉందా? అంటూ టాపిక్ డైవర్ట్ చేసేందుకు ప్రయత్నించారు.

ట్రంప్‌కి పోర్న్ స్టార్‌తో సంబంధం నిజమే, లక్ష డాలర్లు చెల్లించారు: అటార్నీ సంచలనంట్రంప్‌కి పోర్న్ స్టార్‌తో సంబంధం నిజమే, లక్ష డాలర్లు చెల్లించారు: అటార్నీ సంచలనం

 డైవర్ట్ చేసేందుకు ట్రంప్ యత్నం

డైవర్ట్ చేసేందుకు ట్రంప్ యత్నం

అయినా, మీడియా ప్రతినిధులు మాత్రం ఈ ఎఫైర్ గురించే ప్రశ్నలను సంధించారు. స్టార్మీకి మైకేల్ కోహెన్ ఎందుకు డబ్బులు ఇచ్చారని మీడియా ప్రశ్నించడంతో ట్రంప్ కొంత అసహనానికి గురయ్యారు. ఈ ప్రశ్న కోహెన్‌నే అడగాల్సిందని ట్రంప్ బదులిచ్చారు.

ఒప్పందం గురించి అతడ్నే అడగండి

ఒప్పందం గురించి అతడ్నే అడగండి

మైకేల్ తన ప్రైవేట్ అటార్నీ అని, అతడ్నే ఆ విషయంపై అడిగితే బాగుంటుందని స్పష్టం చేశారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తనకు తెలియదని ట్రంప్ చెప్పారు. స్టార్మీకి ఇవ్వడానికి మైకేల్‌కు ఆ డబ్బు తానే ఏర్పాటు చేశానన్న ఆరోపణలు ఎలాంటి వాస్తవం లేదని అన్నారు.

ట్రంప్‌కే తెలియకపోతే ఒప్పందం ఎక్కడిది?

ట్రంప్‌కే తెలియకపోతే ఒప్పందం ఎక్కడిది?

ఇది ఇలావుంటే, ఆ ఒప్పందంపై ఇటీవల స్టార్మీ డేనియల్స్ దావా కూడా వేశారు. ట్రంప్‌తో తన ఎఫైర్ బయటపెట్టకుండా ఉండేందుకు చేసిన ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరారు. ఒప్పంద పత్రాలపై ట్రంప్ సంతకం చేయనందున ఆ అగ్రిమెంట్ చెల్లదని స్టార్మీ చెబుతున్నారు. ఒప్పందం విషయం ట్రంప్‌కే తెలియకపోతే ఇక ఒప్పందం ఎలా అమలవుతుందని స్టార్మీ తరపు న్యాయవాది ప్రశ్నించారు.

English summary
US President Donald Trump on Thursday, April 5, said he had no idea about the payment of $130,000 by his personal attorney to adult film actress Stormy Daniels. It was his first remark in public on the issue after Daniels alleged that she had an affair with him before he became the president.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X