వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌కు శుభవార్త: డ్రీమర్లకు ప్రోత్సాహం, సిటిజన్‌షిప్‌పై ట్రంప్ కీలక ప్రకటన

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయులకు తీపి కబురును అందించారు. అమెరికాకు మైనర్లుగా వలస వచ్చి అక్కడే ఉంటున్న వారికి తగిన రకంగా ఆదుకొంటామని ట్రంప్ ప్రకటించారు. వారంతా బాధపడకూదదని ట్రంప్ చెప్పారు. అమెరికాకు మైనర్లుగా ఉన్న సమయంలోనే అమెరికాకు వచ్చి నివాసం ఉంటూ సిటిజన్‌షిప్‌ కోసం ఎదురు చూస్తున్నవారికి ట్రంప్ వ్యాఖ్యలు ఊరట కల్గిస్తున్నాయి.

అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకొన్న కొన్ని నిర్ణయాలు వలసదారులకు తీవ్ర ఇబ్బందులను కల్గించాయి. ట్రంప్ తీసుకొన్న నిర్ణయాలు ముఖ్యంగా ఇండియాకు చెందిన సాఫ్ట్‌వేర్ పరిశ్రమపై ప్రభావం చూపాయి.

దీనికి తోడు ఇండియన్ టెక్కీలపై ట్రంప్ నిర్ణయాలు ప్రభావితం చేశాయి. అమెరికాలోని స్థానికులకు ఉద్యోగావకాలు కల్పించాలని ట్రంప్ తీసుకొన్న నిర్ణయాలు టెక్కీలపై తీవ్రంగా చూపింది.

ఇండియన్లకు తీపి కబురు

ఇండియన్లకు తీపి కబురు

అమెరికాలో నివాసం ఉంటూ పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్న వారికి ట్రంప్ తీపి కబురు చెప్పారు. అమెరికాకు వలస వచ్చి శ్రమిస్తున్న భారతీయులు బారతీయులు బాధపడాల్సిన అవసరం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుదవారం నాడు ప్రకటించారు. వారికి తగిన ప్రోత్సాహకాలు అందిస్తామని ట్రంప్ ప్రకటించారు.

అమెరికాలో సుమారు 6.90 లక్షల వలసదారులు

అమెరికాలో సుమారు 6.90 లక్షల వలసదారులు

అమెరికాలో ప్రస్తుతం సుమా 6.90 లక్షల వలసదారులున్నారని ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలుస్తోంది. ఇందులో ఎక్కువగా భారత ఉప ఖండం నుండి వెళ్ళిన వారే ఉన్నారు. అమెరికాలో తల్లిదండ్రులు ఉద్యోగం కోసం వచ్చిన సమయంలో మైనర్లుగా అమెరికాకు వచ్చిన వారు అమెరికా పౌరసత్వం కోసం ఎదురు చూస్తున్నారు.అమెరికా పౌరసత్వం కోసం ధరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. అయితే వీటిపై అమెరికా ప్రభుత్వం కొంత కఠినంగా వ్యవహరించాలని భావించింది.ఈ నిర్ణయంతో వలసదారుల్లో ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో బుదవారం నాడు ట్రంప్ వలసదారులకు స్వాంతన కల్గించేలా వ్యాఖ్యలు చేశారు.

ఇమ్మిగ్రేంట్స్‌పై ట్రంప్ కీలక ప్రకటన

ఇమ్మిగ్రేంట్స్‌పై ట్రంప్ కీలక ప్రకటన

స్విట్జర్లాండ్ బయలుదేరే ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేంట్స్‌పై కీలక ప్రకటన చేశారు. ట్రంప్ ప్రకటనతో అమెరికా పౌరసత్వం కోసం ఎదురు చూస్తున్నవారిలో ఆశలు రేకెత్తాయి. అయితే పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్న ఆరు లక్షల మందికి పౌరసత్వం ఇస్తారా, ఇంకా మరేదైనా నిబంధనలను ముందుకు తీసుకొస్తారా అనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. త్వరలోనే దీనిపై మరింత స్పష్త వచ్చే అవకాశం ఉంది.

మెక్సికోకు గొడతాం

మెక్సికోకు గొడతాం

మెక్సికో సరిహద్దుల్లో గోడను కట్టి తీరుతామని అమెరికా అద్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ పని పూర్తయ్యేందుకు 10 నుంచి 12 సంవత్సరాల సమయం పట్టవచ్చని ట్రంప్ అంచనా వేశారు.

English summary
President Trump said on Wednesday that he is open to a path to citizenship after 10 to 12 years for hundreds of thousands of undocumented immigrants brought to the United States as children, days after rejecting a bipartisan plan with that as its centerpiece.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X