వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్-కిమ్ భేటీ: ఆనందం, అద్భుతమంటూ ఇరు దేశాధినేతలు, ఇంకా ఏమన్నారంటే..?

|
Google Oneindia TeluguNews

Recommended Video

డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ భేటీ

సింగపూర్‌: ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా వీక్షిస్తుండగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ మంగళవారం తెల్లవారుజామున భేటీ అయ్యారు. సింగపూర్‌లోని కేపెల్లా హోటల్‌లో మొదట స్నేహపూర్వకంగా కరచాలనం చేసిన ఇరువురు దేశాధినేతలు.. అనంతరం నవ్వుతూ కెమెరాకు ఫోజు ఇచ్చారు.

పాపను కాపాడుకోవడానికి ఆ తల్లిదండ్రులు పడే వేదన వర్ణానాతీతం.. మీ సాయం కావాలి పాపను కాపాడుకోవడానికి ఆ తల్లిదండ్రులు పడే వేదన వర్ణానాతీతం.. మీ సాయం కావాలి

ఇటీవలివరకు ట్రంప్‌, కిమ్‌లు ఒకరిపై ఒకరు దూషణభాషణలు, ఒకరి మీద ఒకరు అణ్వస్త్రాలు కురిపిస్తామని బెదిరించుకున్న విషయం తెలిసిందే. అయితే, అంతలోనే వాతావరణం చల్లబడి, ఇద్దరూ చర్చలకు కూర్చుంటారని ఎవరూ ఊహించలేదు. అందుకే ప్రపంచమంతా సింగపూర్‌ భేటీవైపు ఆసక్తిగా చూసింది.

భేటీ ఏకాంతంగా చర్చలు

భేటీ ఏకాంతంగా చర్చలు

సింగపూర్‌లోని సెంటోసా దీవి వేదికగా జరిగిన ఈ చరిత్రాత్మక భేటీలో తొలిసారి కలిసిన ట్రంప్‌-కిమ్‌ ఆశావహ దృక్పథాన్ని వ్యక్తం చేశారు. తమ చర్చలు సఫలీకృతం అవుతాయని, తమ భేటీ విజయవంతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. మొదట దుబాసీల సాయంతో ట్రంప్‌-కిమ్‌ ఏకాంత ముఖాముఖి చర్చలు జరిపారు.

ఉత్సాహంగా నేతలు

ఉత్సాహంగా నేతలు

అనంతరం తమ దౌత్యాధికారులతో కలిసి.. ద్వైపాక్షిక చర్చలు జరిపారు. దాదాపు 40 నిమిషాలకుపైగా వీరి భేటీ జరిగింది. ఈ సందర్బంగా ట్రంప్‌-కిమ్‌ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఏకాంత ముఖాముఖి భేటీకి ముందు ట్రంప్‌, కిమ్ ఎంతో ఉత్సాహంగా కనిపించారు.

పరస్పరం అభినందనలు

పరస్పరం అభినందనలు

‘మిమ్మల్ని కలువడం ఆనందంగా ఉంది' అని కిమ్‌ అంటే.. కిమ్‌తో తన భేటీ అద్భుతమైన విజయం సాధిస్తుందని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ‘నాకు ఎంతో గొప్పగా ఉంది. మన సమావేశం నిజంగా ఫలప్రదం కాబోతుందని నేను భావిస్తున్నాను. మన మధ్య అద్భుతమైన అనుబంధం నెలకొనబోతోంది. ఆ విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు' అని ట్రంప్‌ కిమ్‌తో పేర్కొన్నారు.

మామూలు విషయమేమీ కాదు

మామూలు విషయమేమీ కాదు

ఈ క్రమంలో కిమ్‌ స్పందిస్తూ.. ‘ఇంతవరకు రావడం మామూలు విషయం కాదు. గతం మనముందు ఎన్నో అడ్డంకులు ఉంచింది. కానీ వాటన్నింటినీ అధిగమించి మనం ఈ రోజు ఇక్కడివరకు వచ్చాం' అని అన్నారు. మొదట ఇరువురు నేతలు కొంత అప్రమత్తతతో ముభావంగా ఉన్నట్టు కనిపించినా.. ఆ తర్వాత కాస్తా హుషారుగా పరస్పరం స్నేహపూర్వకంగా మాట్లాడుకున్నారు.

భేటీ విజయవంతమైనట్లే..!

భేటీ విజయవంతమైనట్లే..!

కాగా, అణ్వాయుధాలు ప్రధాన అంశంగా జరిగిన వీరి భేటీలో ఎలాంటి ఫలితం వచ్చిందనేది ఇంకా అస్పష్టంగానే ఉంది. కిమ్‌తో భేటీ అనంతరం ట్రంప్‌ మాట్లాడుతూ.. ఇరుదేశాల మధ్య అద్భుతమైన బంధం ఏర్పడబోతోందని అన్నారు. తాము ఇరువురం పెద్ద సమస్యను, పెద్ద సందిగ్ధాన్ని పరిష్కరించినట్టు చెప్పారు. కలిసి పనిచేస్తూ.. కలిసి సమస్యలు పరిష్కరించకుంటామని ఆయన తెలిపారు. ట్రంప్ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇరు దేశాధినేతలు పరస్పర సహకారం, అనుబంధాన్ని కొనసాగించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది.

English summary
U.S. President Donald Trump and North Korean leader Kim Jong Un met face-to-face Tuesday morning for their highly anticipated summit. After hours of talks, the U.S. president said he was heading toward "a signing" with Kim, but there was no immediate indication of what sort of agreement would be signed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X