వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెన్షన్: నవంబర్‌లో ద.కొరియాకు ట్రంప్ , కిమ్‌కు 50 కి.మీ. దూరమే

ఉత్తరకొరియా ప్రపంచదేశాలను వణికిస్తున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఉత్తరకొరియా ప్రపంచదేశాలను వణికిస్తున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. ఈ ఏడాది నవంబర్ మాసంలో దక్షిణకొరియాలో పర్యటించనున్నట్టు ట్రంప్ గురువారంనాడు ప్రకటించారు.ట్రంప్ దక్షిణ కొరియాలో పర్యటిస్తే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ఏం చేస్తారనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.

ట్విస్ట్: కిమ్ వెనుక ఆ రెండు దేశాలు, కట్టడి చేయాలి: అమెరికాట్విస్ట్: కిమ్ వెనుక ఆ రెండు దేశాలు, కట్టడి చేయాలి: అమెరికా

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ఈ యేడాది నవంబర్ నెలలో తమ దేశానికి వస్తారని దక్షిణి కొరియా అధికారికంగా వెల్లడించింది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలతోపాటు ఉత్తర కొరియా దుందుడుకు చర్యలపై కూడా సమీక్ష చేస్తామని ప్రకటించింది.

Trump says he will visit China, Japan and South Korea in November

Recommended Video

North Korea vs US : Donald Trump issued an Ultimatum To Kim Jong-un
అయితే ఇప్పుడు ఇదే అంశం అటు అమెరికన్లను, ఇటు దక్షిణ కొరియన్లను ఆందోళన చెందేలా చేస్తోంది. ట్రంప్ కనుక దక్షిణ కొరియాకు వస్తే.. ఉత్తర కొరియా ఎలాంటి చర్యలకు పూనుకుంటుందోనని మేథావులు కూడా తీవ్రంగా మథనపడుతున్నారు.

ట్రంప్‌కు కిమ్ షాక్: అమెరికాను బూడిద చేస్తాం: ఉ. కొరియాట్రంప్‌కు కిమ్ షాక్: అమెరికాను బూడిద చేస్తాం: ఉ. కొరియా

ఉత్తర కొరియాకు కేవలం 35 మైళ్ల (దాదాపు 56 కిలోమీట్లరు) దూరంలోకి ట్రంప్ వస్తుండటంతో కిమ్ ఏం చేస్తారోనని చర్చ కూడ లేకపోలేదు. తనపై ఎన్నో ఆంక్షలకు కారణమైన ట్రంప్‌పై ఆగ్రహంతో కిమ్‌జాంగ్ ఎలాంటి దుస్సాహసానికయినా పూనుకునే అవకాశం ఉందని అధికారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

షాక్:కిమ్ తల నరికేందుకు 3 వేల మంది కమెండోలుషాక్:కిమ్ తల నరికేందుకు 3 వేల మంది కమెండోలు

దక్షిణ కొరియాకు వెళ్లిన తర్వాత ఉత్తర కొరియాపై చర్యలు తీసుకునే ఆలోచన ఉందా..? అని ట్రంప్‌ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. వేచిచూడండి అని ఆయన స్పందించారు. మొత్తానికి ట్రంప్ దక్షిణ కొరియా పర్యటన ఎలాంటి పరిస్థితులను క్రియేట్ చేస్తుందో వేచిచూడాలి.

English summary
US President Donald Trump on Thursday announced he intends to visit China, Japan and South Korea later this year, a blockbuster maiden presidential visit to Asia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X