వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేనైతే ఆయుధం లేకున్నా ఫ్లోరిడా స్కూల్‌కు వెళ్ళేవాడిని: ట్రంప్

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్:తన వద్ద ఆయుధం లేకపోయినా ఫ్లోరిడా స్కూల్‌లో విద్యార్ధులను కాపాడేందుకు తాను వెళ్ళేవాడినని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అమెరికాలో గవర్నర్ల సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అమెరికాలోని ప్లోరిడా స్కూల్‌లో కాల్పుల ఘటనల్లో సుమారు 17 మంది మరణించారు.

ఫ్లోరిడా ఘటనపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీరు నన్ను పరీక్షించే వరకు నమ్మలేరు. కానీ అలాంటి పరిస్థితుల్లో ఆయుధం లేకున్నా తాను విద్యార్థులను కాపాడేందుకు వెళ్ళేవాడినని ట్రంప్ గవర్నర్ల సదస్సులో వ్యాఖ్యానించారు.

Trump says he would have run into Florida school without a weapon

పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ట్రంప్‌ అధికారులను ఆదేశించారు. ఇలాంటివి జరగకుండా దీర్ఘాకాలిక చర్యలు అవసరమని పేర్కొన్నారు. స్కూల్‌ సిబ్బందిలో శిక్షణ పొందిన, తగిన ధ్రువీకరణ పత్రం కలిగిన వారి వద్ద ఆయుధాలు ఉంచాలని సూచించారు.

స్కూల్లో ఆయుధాలతో సెక్యురిటీ గార్డులను నియమించడం కుదురతుందని అనుకోవట్లేదని పేర్కొన్నారు. ఫ్లోరిడా స్కూల్‌లో దాడి జరిగిన సమయంలో డ్యూటీలో ఉన్న డిప్యూటీ షెరీఫ్‌ల ప్రవర్తన చాలా దారుణంగా ఉందని అన్నారు. గత వారం కొందరు డిప్యూటీ షెరీఫ్‌ల పనితీరు గమనించానని చెప్పారు. న్యాయ విభాగం ముందు తనతో సహా ఎవ్వరూ ఎక్కువ కాదని వెల్లడించారు.

English summary
President Donald Trump said Monday that he would have charged into a Florida school during the shooting there earlier this month even if he were unarmed."I really believe I’d run in there even if I didn’t have a weapon," Trump told governors meeting at the White House to discuss school safety.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X