• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బిడెన్‌ గెలిస్తే చైనా గెలిచినట్లే- డ్రాగన్‌కు మేలు చేశారిలా- ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..

|

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో బిడెన్‌వైపే అమెరికన్లు మొగ్గుచూపుతున్నారని పలు సర్వేల్లో స్పష్టమవుతున్న నేపథ్యంలో ఆయనపై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తీవ్రంగా మాటలయుద్ధం చేస్తున్నారు. గతంలో ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేసిన అనుభవం ఉన్న బిడెన్‌ తనకు గట్టి ప్రత్యర్ధిగా భావిస్తున్న ట్రంప్‌.. గతంలో ఆయన తీసుకున్న నిర్ణయాలను గుర్తుచేస్తూ టార్గెట్‌ చేస్తున్నారు.. అదే సమయంలో అమెరికా వాణిజ్య ప్రత్యర్ధి చైనాను కూడా ఈ పోరులోకి లాగుతున్నారు. బిడెన్‌ గెలిస్తే చైనా గెలిచినట్లేనని ట్రంప్‌ ఓటర్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

అమెరికా ఎన్నికల్లో డెమోక్రాట్లకు బీజేపీ మద్దతు - ట్రంప్‌ ఆగ్రహం- తటస్ధమని ప్రకటన...

 ట్రంప్‌లో పెరుగుతున్న అసహనం..

ట్రంప్‌లో పెరుగుతున్న అసహనం..

నవంబర్‌ 3న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రిపబ్లికన్‌ అధ్యక్ష అభ్యర్ధి డొనాల్డ్‌ ట్రంప్‌కు అసహనం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఓవైపు జో బిడెన్‌ అభివృద్ధి మంత్రం జపిస్తూ తనకు పగ్గాలు అప్పగిస్తే అమెరికాను ఎలా గర్వంగా తలెత్తుకునేలా చేస్తానో చూస్తారంటూ ప్రచారం సాగిస్తుండగా.. ట్రంప్‌ మాత్రం ఆయన్ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుంటున్నారు. అసలే కరోనా కారణంగా అమెరికా ఎదుర్కొంటున్న ఇబ్బందులకు తానే కారణమంటూ వెల్లువెత్తుతున్న నిరసనలతో కాక మీదున్న ట్రంప్‌.. బిడెన్‌ గెలుపును చైనాకు లింక్‌ చేయడం ద్వారా ఆయన్ను టార్గెట్‌ చేస్తున్నారు. ముఖ్యంగా బిడెన్‌ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన కాలంలో అమెరికా అర్ధిక వ్యవస్ధ ఇబ్బందులు ఎదుర్కొందనే అంశాన్ని తెరపైకి తెస్తున్నారు.

 బిడెన్‌ గెలిస్తే చైనా గెలిచినట్లే....

బిడెన్‌ గెలిస్తే చైనా గెలిచినట్లే....

డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్ధి జో బిడెన్‌కు గతంలో ఉపాధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. దీంతో ఆయన్ను సరైన ప్రత్యర్ధిగా భావిస్తున్న ట్రంప్‌.. బిడెన్‌ చరిత్రను తవ్వే ప్రయత్నంలో పడ్డారు. ఇందులో భాగంగా గతంలో బిడెన్‌ హయాంలో అమెరికా ఉద్యోగాలన్నీ తీసుకెళ్లి చైనాకు అప్పగించారని ట్రంప్‌ సంచలన ఆరోపణలు చేశారు. గత 47 సంవత్సరాల్లో అమెరికా సృష్టించిన ఉద్యోగాలను ఆయన చైనాతో పాటు విదేశాలకు అప్పగించారని ట్రంప్‌ నిప్పులు చెరిగారు. గత నాలుగేళ్లుగా వాటిని వెనక్కి రప్పించేందుకు తాను ప్రయత్నించినట్లు ట్రంప్‌ చెప్పుకొచ్చారు.

 బిడెన్ నిర్ణయంతో చైనాకు మేలు...

బిడెన్ నిర్ణయంతో చైనాకు మేలు...

గతంలో ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన కాలంలో జో బిడెన్‌ ఉత్తర అమెరికా స్వేచ్చా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో చైనా ప్రపంచ వాణిజ్య సంస్ధలోకి ప్రవేశించింది. ఆ తర్వాత అమెరికాతో పోటీ పడే స్దాయికి తన వాణిజ్యాన్ని పెంచుకుంది. ఆ తర్వాత అమెరికా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా చైనాకు అడ్డుకట్ట వేయలేకపోతోంది. ఇప్పుడు అదే అంశాన్ని ట్రంప్‌ తన ఎన్నికల ప్రచారంలో వాడుకుంటున్నారు. బిడెన్‌ నిర్ణయం చైనాకు ఎలా మేలు చేసిందో చెప్తూ మరోసారి ఆయనకు ఓటేస్తే చైనాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారని ఓటర్లను హెచ్చరిస్తున్నారు. అమెరికాను నంబర్ వన్‌ స్ధానంలో ఉంచే వారు కావాలా లేక చైనాకు వంతపాడే వాళ్లు కావాలా అంటూ ప్రశ్నిస్తున్నారు.

  TikTok, Wechat పై నిషేధం విధించిన US.. వచ్చే ఆదివారం నుంచి డౌన్‌లోడ్‌లు నిలిపివేత!!
   ప్రచారాస్త్రంగా పన్నుల పెంపు...

  ప్రచారాస్త్రంగా పన్నుల పెంపు...

  అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న డెమోక్రాటిక్ అభ్యర్ధి జో బిడెన్‌ తన ప్రచారంలో భాగంగా వచ్చే పదేళ్లలో అమెరికాలో పన్నుల రాబడిని 4 ట్రిలియన్‌ డాలర్లకు పెంచుతామని హామీ ఇచ్చారు. దీంతో మధ్యతరగతికి ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. కానీ ఈ పన్నుల పెంపు ప్రతిపాదనను రిపబ్లికన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎగువ మధ్యతరగతిపై భారం మోపే పన్నుల పెంపు ప్రతిపాదనతో జో బిడెన్‌ అమెరికాను 50 ఏళ్ల వెనక్కి తీసుకెళ్తారని ట్రంప్ ఆరోపిస్తున్నారు. అమెరికాను ఆర్ధికంగా నిలబెట్టేందుకు పన్నుల పెంపు ప్రతిపాదనను డెమోక్రాట్లు తెరపైకి తీసుకురాగా.. ట్రంప్ మాత్రం ప్రజలపై భారంగా అభివర్ణిస్తున్నారు. దీంతో పన్నుల పెంపు కూడా ఇప్పుడు ఎన్నికల్లో ప్రధానాస్త్రంగా మారిపోయింది.

  English summary
  Former U.S. vice president Joe Biden has enormously harmed the U.S. economy in his five decades as a politician, President Donald Trump has said, adding that if the Democratic leader wins the November 3 polls it would be a win for China.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X