వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ కొత్త ఇన్నింగ్స్: ప్లోరిడాలో ఆఫీస్ ఓపెన్ -అభిశంసన తప్పదన్న ప్రెసిడెంట్ బైడెన్

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన వారం రోజులకే డొనాల్డ్ ట్రంప్ కొత్త ఇన్నింగ్స్ ఆరంభించారు. ఫ్లోరిడాలోని పామ్ బీచ్ కౌంటీలో కొత్త ఆఫీసును ఓపెన్ చేశారు. 'మాజీ అధ్య‌క్షుడి' హోదాలో ఆయ‌న అక్క‌డ నుంచి ప‌నిచేయ‌నున్నారు. ట్రంప్‌కు సంబంధించిన అన్ని అధికార ప్ర‌క‌ట‌న‌లు అక్క‌డ నుంచే వెలుబ‌డ‌నున్నాయి.

నిమ్మగడ్డపై జగన్ సర్కారు పిడుగు -కరోనా వ్యాక్సినేషన్ రీషెడ్యూల్? -ఎస్ఈసీదే బాధ్యతన్న సజ్జలనిమ్మగడ్డపై జగన్ సర్కారు పిడుగు -కరోనా వ్యాక్సినేషన్ రీషెడ్యూల్? -ఎస్ఈసీదే బాధ్యతన్న సజ్జల

2024 ఎన్నికల్లో ట్రంప్ మరోసారి పోటీకి దిగుతారనే ప్రచారాల నడుమ.. కొత్త ఆఫీసుల ద్వారా అమెరికన్లకు అన్ని రకాలుగా అందుబాటులో ఉంటానంటూ చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. 1987లో ఇండిపెండెన్స్ పార్టీ ద్వారా పొలిటికల్ కెరీర్ ఆరంభించిన ట్రంప్.. 1999లో రిఫార్మ్ పార్టీలో చేరారు. 2001లో డెమోక్రటిక్ పార్టీలో చేరి.. ఎనిమిదేళ్ల తర్వాత, అంటే, 2009లో రిపబ్లికన్ పార్టీలోకి జంప్ అయ్యారు. ఆ పార్టీ నుంచే అధ్యక్షుడిగా గెలిచి.. అమెరికా చరిత్రలోనే అత్యంత చెత్త ప్రెసిడెంట్ గా అపఖ్యాతిని మూటకట్టుకున్నారు. ట్రంప్ త్వరలోనే ప్యాట్రియాట్ పార్టీ పేరుతో కొత్త పార్టీ పెట్ట‌నున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చినా.. అలాంటిదేమీ లేదని ఇటీవలే క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే..

Trump sets up Office in Florida, Biden says impeachment trial has to happen

అమెరికా పార్లమెంట్ భవనమైన క్యాపిట‌ల్ హిల్ పై దాడి ఘ‌ట‌న నేపథ్యంలో హౌజ్ ప్ర‌తినిధులు ట్రంప్ అభిశంస‌న కోరుతూ సేనేట్‌కు తీర్మానం పంపిన విష‌యం తెలిసిందే. ఫిబ్ర‌వ‌రి 9వ తేదీ నుంచి సేనేట్‌లో అభిశంస‌న ప్ర‌క్రియ ప్రారంభం అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. ఏదో ఒక రూపంలో మ‌ళ్లీ ద‌ర్శ‌నమిస్తాన‌ని వైట్‌హౌజ్‌ను వీడి వెళ్తున్న స‌మ‌యంలో ట్రంప్ ఓ ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. కాగా,

నిమ్మగడ్డతో పోరులో జగన్ వైఫల్యానికి కారణమిదే -తర్వాత స్టెప్ ఇదైతేనే సేఫ్: ఎంపీ రఘురామనిమ్మగడ్డతో పోరులో జగన్ వైఫల్యానికి కారణమిదే -తర్వాత స్టెప్ ఇదైతేనే సేఫ్: ఎంపీ రఘురామ

డొనాల్డ్ ట్రంప్ అభిశంసనపై ప్రస్తుత ప్రెసిడెంట్ జోబైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బైడెన్ తొలి వంద రోజుల అజెండాలో.. రాజకీయ వ్యవహరాలకు సంబంధించి ట్రంప్ అభిశంసనను కూడా ప్రధానంగా చేర్చారు. సోమవారం ఓ కార్యక్రమంలో మాట్లాడిన ప్రెసిడెంట్ బైడెన్.. ట్రంప్ అభిశంసన తప్పదని, అలా జరగకపోతే దాన్నొక విపరీత పరిణామంగా భావించాల్సి ఉంటుందని బైడెన్ అన్నారు.

English summary
Former US President Donald Trump on Monday established an official post-presidency office in Palm Beach County setting up a vehicle for future public appearances and statements. US President Joe Biden said former president Donald Trump's impeachment trial in the US senate "has to happen."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X