వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్‌కు షాకిచ్చిన జర్నలిస్టు... ఆ ప్రశ్న వేసేసరికి..!

|
Google Oneindia TeluguNews

మరో మూడు నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇటు రిపబ్లికన్ అభ్యర్థిగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలో మళ్లీ నిలుస్తుండగా డెమొక్రటిక్ పార్టీ నుంచి జోబిడెన్ అధ్యక్ష పదవికి రేసులు ఉన్నారు. ఈ క్రమంలోనే వరస మీడియా సమావేశాలు, జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు ట్రంప్ సమాధానాలు చెబుతున్నారు. అయితే డొనాల్డ్ ట్రంప్‌కు మాత్రం ఓ జర్నలిస్టు నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. దీంతో ఒక్కసారిగా అధ్యక్షుల వారు షాక్‌కు గురయ్యారు.

Recommended Video

Donald Trump Walks Out Of News Conference After Reporter Asks Question || Oneindia Telugu
 వైట్‌హౌజ్‌లో ప్రెస్ మీట్

వైట్‌హౌజ్‌లో ప్రెస్ మీట్

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో వరుస ప్రెస్‌మీట్లను నిర్వహిస్తున్నారు అధ్యక్షుడు ట్రంప్. ఈ క్రమంలోనే ఎప్పటినుంచో ఓ ప్రశ్న అడగాలని ఐదేళ్లుగా ఎదురు చూశారు ఎస్వీ డేట్ అనే ఓ జర్నలిస్టు. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్‌హౌజ్‌లోని మీడియా సమావేశం నిర్వహించే గదికి వచ్చారు. ఇక ముందుగా మాట్లాడిన ట్రంప్ ఆ తర్వాత జర్నలిస్టుల నుంచి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అన్నారు. ఈ క్రమంలోనే ట్రంప్‌ను పలు ప్రశ్నలు అడగడం ప్రారంభించారు జర్నలిస్టులు. జర్నలిస్టులు వేస్తున్న ప్రశ్నలకు ట్రంప్ సమాధానం చెబుతూ వచ్చారు. అనుకోకుండా ఆయన్ను ఓ ప్రశ్న షాక్‌కు గురిచేసింది.

ట్రంప్‌ను ఇబ్బంది పెట్టే ప్రశ్న వేసిన రిపోర్టర్

వరుస ప్రశ్నలకు వరుసగా సమాధానం చెబుతూ వచ్చిన ట్రంప్‌కు ఎస్‌వీ డేట్‌ అనే జర్నలిస్టు నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. గత మూడేళ్లలో అమెరికా ప్రజలకు అన్నీ అబద్దాలే చెప్పారని మీరు అంగీకరిస్తారా అని జర్నలిస్ట్ డేట్స్ అడిగారు. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు ట్రంప్. అబ్దధాలు వంచనల గురించి ప్రశ్నించారు. ఇందుకు ట్రంప్ ఎవరు చేశారని తిరిగి ప్రశ్నించారు. దీంతో మీరు ప్రజలను అబద్ధాలతో వంచనకు గురిచేశారని మరోసారి స్పష్టంగా డేట్ చెప్పారు. డేట్ అనే వ్యక్తి హఫింగ్టన్ పోస్ట్ వైట్ హౌజ్ కరస్పాండెంట్‌గా పనిచేస్తున్నారు. వేలల్లో అబద్దాలు చెప్పారని డేట్ చెబుతుండగా ట్రంప్ మధ్యలోనే ఆయన ప్రశ్నకు బ్రేక్ వేసి మరో జర్నలిస్టు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఆ జర్నలిస్టు పేరోల్ టాక్స్ పై ప్రశ్న సంధించారు.

 మళ్లీ అవకాశం వస్తే అదే ప్రశ్న

మళ్లీ అవకాశం వస్తే అదే ప్రశ్న

గత నెల జూలైలో ట్రంప్ తన పాలనలో 20వేలకు పైగా అబద్ధాలు తప్పుడు మాటలు చెప్పారని ప్రముఖ పత్రిక వాషింగ్టన్ రిపోర్ట్ చేసింది. ఇది పక్కనబెడితే తనకు తొలిసారిగా ట్రంప్‌ను ప్రశ్నలు అడిగే ఛాన్స్ వచ్చిందని అందుకే ఆ ప్రశ్న వేసినట్లు డేట్ చెప్పారు. మార్చి నెలలో కూడా ఇదే ప్రశ్న వేస్తున్న సమయంలో మధ్యలోనే బ్రేకులు వేశారని అయితే ఈ సారి ట్రంప్ తనను మరిచిపోయి ఉంటారని అందుకే అవకాశం ఇచ్చి ఉంటారని డేట్ చెప్పారు. అంతేకాదు తాను ఎప్పుడు ప్రశ్నలు వేసేందుకు అవకాశం ఇచ్చినా మూడేళ్ల పాలనలో తాను చెప్పిన అబద్ధాలపైనే ప్రశ్నించాలని ఎప్పటి నుంచో అనుకున్నట్లు డేట్ చెప్పారు. అయితే ట్రంప్ ఆడిన అబద్దాలు మరో 10 ఏళ్లు గుర్తుండిపోతాయని చెప్పారు. ట్రంప్ తన ప్రశ్నను విస్మరిస్తారని ముందే తెలుసని అందుకు ప్రిపేర్ కూడా అయినట్లు డేట్ చెప్పారు.

ఇక మరోసారి ఛాన్స్ వస్తే ఎలాంటి ప్రశ్న వేస్తారని అడుగగా... అందుకు తెలివిగా సమాధానం చెప్పారు డేట్. గతంలో అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదని ... అబద్ధాలు ఎందుకు చెప్పారని తిరిగి ప్రశ్నిస్తానని డేట్ చెప్పారు.

English summary
US President was shocked when a journalist had asked him about the lying to the American people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X