• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ట్రంప్ షాకింగ్ నిర్ణయం: ఇమ్మిగ్రంట్లకు గ్రీన్ కార్డులు ఇవ్వకూడదని నిర్ణయం

|

అమెరికా: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అక్కడ ఉన్న భారతీయులపై పెద్ద ఎత్తున ప్రభావం పడుతోంది. మొన్నటికి మొన్న హెచ్4 వీసాలపై కఠిన నిర్ణయం తీసుకున్న ట్రంప్ సర్కార్...తాజాగా గ్రీన్ కార్డులపై మరో నిర్ణయం తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. అమెరికాలో నివసిస్తున్న వలసదారులకు గ్రీన్ కార్డు జారీ చేయకూడదనే నిర్ణయం ట్రంప్ సర్కార్ తీసుకోనున్నట్లు సమాచారం. ఇది అమల్లోకి వస్తే గ్రీన్ కార్డు ద్వారా లభించే ప్రభుత్వ పథకాలు, నగదు సహాయంలాంటివి నిలిచిపోతాయి. దీంతో అక్కడ వేలాది భారతీయులపై పెద్ద ఎత్తున ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ కొత్త ప్రతిపాదనపై హోమ్‌లాండ్ సెక్యూరిటీ సెక్రటరీ సెప్టెంబర్ 21న సంతకం చేసి దాన్నే హోమ్‌లాండ్ సెక్యూరిటీ శాఖ తన వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. ట్రంప్ నిర్ణయంపై సిలికాన్ వ్యాలీలో పని చేస్తున్న టెక్కీలు, ఇతర రాజకీయపార్టీలు భగ్గుమన్నాయి.

అమెరికాకు వచ్చేవారు తమ ఆర్థిక స్థితిని తెలపాలి

అమెరికాకు వచ్చేవారు తమ ఆర్థిక స్థితిని తెలపాలి


కొత్త నిబంధన ప్రకారం వీసాలు కోరుతున్న వలసదారులు అడ్మిషన్ల కోసం దరఖాస్తులు చేసుకున్నవారు, ప్రభుత్వ పథకాలను లేదా ఫలాలను వినియోగించుకోబోమని కచ్చితంగా చెబుతూ సంతకం చేసి ఇవ్వాలని ప్రతిపాదించారు. హెచ్-4 వీసాదారులకు పనిపరిమితులపై ఆంక్షలు విధించన నేపథ్యంలో గ్రీన్ కార్డు పై కొత్త నిబంధనలు తీసుకురావడం కలవరపాటుకు గురి చేస్తోంది. అంతేకాదు ఎవరైతే అమెరికాకు రావాలని భావిస్తున్నారో వారు ఆర్థికంగా తమకు తామే నిలదొక్కుగోగలమనే భరోసా ఇస్తూ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని హోమ్‌లాండ్ సెక్యూరిటీ శాఖ పేర్కొంది. ఈ విషయాన్ని హోమ్‌లాండ్ శాఖ సీరియస్‌గా పరిగణిస్తోందని దీనిపై ప్రజల నుంచి ప్రతిపాదనలను కూడా స్వాగతిస్తోందని ఆ శాఖ అధికారులు వెల్లడించారు.

 మంచి ఉద్దేశంతోనే కొత్త ప్రతిపాదనలు: హోమ్‌లాండ్ సెక్యూరిటీ శాఖ

మంచి ఉద్దేశంతోనే కొత్త ప్రతిపాదనలు: హోమ్‌లాండ్ సెక్యూరిటీ శాఖ

గ్రీన్ కార్డుపై తీసుకొస్తున్న కొత్త ప్రతిపాదనల అమలుకు బిల్లు ప్రవేశపెట్టి కాంగ్రెస్‌లో పాస్ చేయించి చట్టం చేస్తామని అధికారులు వెల్లడించారు.వలసదారులు కచ్చితంగా తమ ఆర్థిక స్తోమతను నిరూపించుకోవాల్సి ఉంటుందని అంతేకాక అమెరికాలో పన్ను కడుతున్న అమెరికన్లకు భారం కాకూడదన్న ఉద్దేశంతోనే ఈ ప్రతిపాదన తీసుకొచ్చినట్లు అమెరికా తెలిపింది.అయితే ఈ ప్రతిపాదనపై FWD మండి పడింది. ఈ సంస్థ ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్, డ్రాప్ బాక్స్, యాహూ, గూగుల్ లాంటి సంస్థలను రిప్రజెంట్ చేస్తుంది. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయంతో దేశం పెద్ద ఎత్తున నష్టపోతుందని చెప్పారు. ఈ విధానం అమలు చేస్తే కష్టపడే వలసదారులు లేదా అమెరికా అభివృద్ధికి తోడ్పడే వలసదారులను దేశం కోల్పోతుందని దీర్ఘకాలంలో ఇది అమెరికాకు భారీ నష్టం తీసుకొచ్చి పెడుతుందని FWD తెలిపింది.

 వలసదారులతోనే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతం

వలసదారులతోనే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతం


కొత్త ప్రతిపాదనలు అమలు చేయడమంటే అమెరికా ప్రభుత్వం నేరుగా ప్రజల ఆరోగ్యం, నివాసం, ఆర్థిక భద్రతను అణిచివేయడమే అని కొందరు అభిప్రాయపడ్డారు.అంతేకాదు తక్కువ వేతనాలు పొందుతున్న తల్లిదండ్రులకు శిక్ష విధించకూడదని, వారి పిల్లలకు కష్టాలను తీసుకురావద్దని మరికొందరు చెప్పారు. అదే సమయంలో వలసదారులుతో అమెరిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతోందని అన్నారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు అమెరికాలో గ్రీన్ కార్డు పొందేందుకు 6,32,219 మంది భారతీయులు వారి పిల్లలు ఎదురుచూస్తున్నారు.

English summary
The Trump administration may deny green cards to immigrants who have availed or may avail government benefits including food and cash assistance under new rules which could negatively affect hundreds of thousands of Indians living in the US. The proposed rule signed by the Homeland Security Secretary on September 21 and posted on the website of the Department of Homeland Security (DHS) was slammed by the Silicon Valley-based tech industry and political leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X