• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చైనాకు గట్టి షాకిచ్చిన ట్రంప్ .. చైనీస్ కంపెనీలకు యూఎస్ లో చెక్ పెట్టే బిల్లుతో మరో ట్రేడ్ వార్

|

మరి కొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష పదవికి దూరం కాబోతున్న ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనా కు మరో షాక్ ఇచ్చారు. చైనా పై తన చివరి అస్త్రాన్ని ప్రయోగించిన డోనాల్డ్ ట్రంప్ చైనా కంపెనీలను యూఎస్ నిబంధనలు పాటించకుంటే అమెరికా స్టాక్ ఎక్స్చేంజి నుండి తొలగించే బిల్లుపై సంతకం చేశారు. తమ దేశంలో అన్యాయమైన వాణిజ్య పద్ధతులు అవలంభిస్తోంది అంటూ చాలాకాలంగా విరుచుకుపడుతున్న ట్రంప్ తాజాగా తీసుకున్న నిర్ణయం చైనా కు గట్టి షాక్ ఇచ్చింది.

చైనా మరో షాకింగ్ నిర్ణయం: ఆ బోర్డర్ వెంట ముళ్ళ తీగలతో 2 వేల కిలోమీటర్ల అతి పెద్ద గోడ నిర్మాణంచైనా మరో షాకింగ్ నిర్ణయం: ఆ బోర్డర్ వెంట ముళ్ళ తీగలతో 2 వేల కిలోమీటర్ల అతి పెద్ద గోడ నిర్మాణం

 కంపెనీలు యూఎస్ ఆడిట్ కి అనుమతించక పోతే స్టాక్ ఎక్స్చేంజ్ నుండి తొలగించే బిల్లు

కంపెనీలు యూఎస్ ఆడిట్ కి అనుమతించక పోతే స్టాక్ ఎక్స్చేంజ్ నుండి తొలగించే బిల్లు

ఇంతకు ముందు చైనా దిగుమతులపై బిలియన్ డాలర్ల వ్యాపారం చేస్తోందంటూ టారిఫ్ లను విధించింది యూఎస్ . ఇక ఇప్పుడు ఏకంగా చైనా కంపెనీలను తమ స్టాక్ ఎక్సేంజ్ నుండి తొలగించే సంచలన నిర్ణయం తీసుకొని బిల్లుపై సంతకం పెట్టారు డోనాల్డ్ ట్రంప్.అమెరికన్ రెగ్యులేటర్లను వారి ఆర్థిక ఆడిట్లను సమీక్షించడానికి అనుమతించకపోతే చైనా కంపెనీలను యుఎస్ ఎక్స్ఛేంజీల నుండి తొలగించగల చట్టంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం సంతకం చేశారు.

హోల్డింగ్ ఫారిన్ కంపెనీస్ జవాబుదారీ చట్టం ప్రకారం ఇతర దేశాల సంస్థలకు కఠినమైన రూల్స్

హోల్డింగ్ ఫారిన్ కంపెనీస్ జవాబుదారీ చట్టం ప్రకారం ఇతర దేశాల సంస్థలకు కఠినమైన రూల్స్

హోల్డింగ్ ఫారిన్ కంపెనీస్ జవాబుదారీ చట్టం ప్రకారం కంపెనీలు తమ సంస్థలు విదేశీ ప్రభుత్వానికి చెందినవి కావు లేదా విదేశీ ప్రభుత్వాలచే నియంత్రించబడవు అని చూపించాల్సిన అవసరం ఉంది అలాగే యు.ఎస్. పబ్లిక్ అకౌంటింగ్ పర్యవేక్షణ బోర్డు వారి ఆర్థిక ఆడిట్లను సమీక్షించడానికి అనుమతించాలి. యు.ఎస్ వెలుపల ఏ దేశానికి చెందిన కంపెనీలకు అయినా ఈ చట్టం వర్తిస్తున్నప్పటికీ, బిల్లు మాత్రం చైనా సంస్థలైన అలీబాబా గ్రూప్, పిండుడువో మరియు పెట్రోచైనా వంటి చైనా కంపెనీలను లక్ష్యంగా చేసుకొని ఉద్దేశించబడింది అని తెలుస్తోంది.

 చైనా కంపెనీలకు షాక్ ఇచ్చే నిర్ణయం . మరో ట్రేడ్ వార్ కు ఆస్కారం

చైనా కంపెనీలకు షాక్ ఇచ్చే నిర్ణయం . మరో ట్రేడ్ వార్ కు ఆస్కారం

అధ్యక్షుడు ట్రంప్ వచ్చే నెలలో పదవికి దూరం కానున్న సమయంలో ఈ బిల్లు చైనా మరియు యుఎస్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతోందని అర్థమవుతోంది. మరో ట్రేడ్ వార్ కు శ్రీకారం చుడుతుంది అని అర్ధం అవుతుంది. జాతీయ భద్రతా సమస్యలను పేర్కొంటూ చైనా అధికారులు స్థానిక అకౌంటింగ్ సంస్థలను పరిశీలించకుండా విదేశీ నియంత్రకాలను చాలాకాలంగా అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ట్రంప్ తీసుకువచ్చిన ఈ బిల్లు యూఎస్ అకౌంటింగ్ పర్యవేక్షణ బోర్డు ఆర్థిక ఆడిట్ లకు అనుమతించకుంటే ఆ కంపెనీలను స్టాక్ ఎక్సేంజ్ నుంచి తొలగించవచ్చు.

 యూఎస్ క్యాపిటల్ మార్కెట్ నుండి లాభపడుతున్న చైనా .. చెక్ పెట్టటానికే ట్రంప్ నిర్ణయం

యూఎస్ క్యాపిటల్ మార్కెట్ నుండి లాభపడుతున్న చైనా .. చెక్ పెట్టటానికే ట్రంప్ నిర్ణయం

అమెరికా క్యాపిటల్ మార్కెట్ నుండి దశాబ్దాల తరబడి చైనా సంస్థలు లాభాలను ఆర్జిస్తున్నాయి . ఆ ప్రయోజనాలన్నీ చైనా ఆర్ధిక అభివృద్ధికి ఉపయోగపడుతున్నాయని ట్రంప్ విమర్శిస్తున్నారు .చైనా సంస్థలు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవడం లేదని, అందువల్ల వీటిలో పెట్టుబడి పెట్టిన అమెరికన్లు నష్టపోతున్నారని ఆరోపిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అందుకే తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గా తెలుస్తుంది. యు.ఎస్. అధ్యక్షుడు ఈ బిల్లుపై సంతకం చేయటం చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది .

 పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ఈ బిల్లు బలహీనపరుస్తుందంటున్న చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ బిల్లుపై ట్రంప్ సంతకం చెయ్యటానికి ముందు, చైనా

పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ఈ బిల్లు బలహీనపరుస్తుందంటున్న చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ బిల్లుపై ట్రంప్ సంతకం చెయ్యటానికి ముందు, చైనా

విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హువా చునైంగ్ మాట్లాడుతూ, ఇది యుఎస్ క్యాపిటల్ మార్కెట్లపై ప్రపంచ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని బలహీనపరుస్తుందన్నారు. యుఎస్ క్యాపిటల్ మార్కెట్ల ప్రపంచ స్థితిని బలహీనపరుస్తుందని , యుఎస్ ప్రయోజనాలను దెబ్బతీస్తుంది అని పేర్కొన్నారు. ఇది సహేతుకమైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించిన నాటి నుండి కరోనా వైరస్ ను తయారుచేసింది చైనానేనని , చైనాపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్న ట్రంప్ అప్పటినుండి చైనాపై నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా తీసుకున్న నిర్ణయం మాత్రం రెండు దేశాల మధ్య మరో ట్రేడ్ వార్ కు కారణం అవుతుంది .

English summary
President Donald Trump on Friday signed legislation that could remove Chinese companies from U.S. exchanges if American regulators are not allowed to review their financial audits.The “Holding Foreign Companies Accountable Act” will require companies to establish that they are not owned or controlled by a foreign government and allow the U.S. Public Accounting Oversight Board to review their financial audits.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X