వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో వివాదాస్పద నిర్ణయంపై ట్రంప్ సంతకం, 'అవసరాల మేరకే హెచ్ 1 బీ వీసాలు'

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలకమైన వివాదాస్పద అంశంపై సంతకం చేశారు. ఒబామా కాలం నాటి పర్యావరణ మార్పులను చేస్తూ ట్రంప్ సంతకం చేశారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలకమైన వివాదాస్పద అంశంపై సంతకం చేశారు. ఒబామా కాలం నాటి పర్యావరణ మార్పులను చేస్తూ ట్రంప్ సంతకం చేశారు.

అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి తీసుకొంటున్న నిర్ణయాలన్నీ వివాదాస్పదంగానే మారాయనే విమర్శలున్నాయి.

అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ తీసుకొన్న నిర్ణయాల్లో ట్రావెల్ బ్యాన్, హెచ్ 1 బీ వీసా లాంటి వాటిపై తీవ్రమైన వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సి వచ్చింది.

అయినా ట్రంప్ తన నిర్ణయాలను మాత్రం మార్చుకోలేదు. తాను అనుకొన్నట్టుగా నిర్ణయాలను తీసుకొంటున్నారు. ట్రావెల్ బ్యాన్ పై కోర్టులు ట్రంప్ కు కోర్టుల నుండి చుక్కెదురైంది

మరో వివాదాస్పద నిర్ణయంపై ట్రంప్ సంతకం

మరో వివాదాస్పద నిర్ణయంపై ట్రంప్ సంతకం

క్లైమెంట్ చేంజ్ పై ఒబామా అధ్యక్షుడుగా ఉన్న కాలంలో నాటి ప్రమాణాలను మార్పు చేస్తూ ట్రంప్ పాలకవర్గం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశారు.

భూతాపంపై అంతర్జాతీయంగా చేస్తున్న పోరాటానికి ట్రంప్ నిర్ణయం పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. బొగ్గు పరిశ్రమను కాపాడుతానని ఎన్నికల్లో ఇచ్చిన హమీని నిలబెట్టుకొనేందుకు ట్రంప్ పర్యావరణ పరిరక్షణ ఏజెన్సీ పై సంతకం చేసినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

నూతన ఉద్యోగాల కోసమేనా?

నూతన ఉద్యోగాల కోసమేనా?

ఒబామా నాటి పర్యావరణ ప్రమాణాలను మార్పు చేయడం ద్వారా ఉత్పత్తి, నూతన ఉద్యోగాల కల్పన శకం ప్రారంభమైనట్టేనని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

అమెరికా ఇంధన శక్తిపై ఉన్న పరిమితులను ఎత్తివేసే చారిత్రాత్మక చర్యగా ట్రంప్ తన నిర్ణయాన్ని పేర్కొన్నారు. అమెరికన్లకు ఉద్యోగాలు లభించడం వల్ల దేశ సంపద పెరుగుతోందన్నారు. తద్వారా మన దేశాన్ని పునర్నిర్మించుకొనే అవకాశం లభిస్తోందని ట్రంప్ చెప్పారు.

అవసరాలకు అనుగుణంగానే హెచ్ 1 బీ వీసాలు

అవసరాలకు అనుగుణంగానే హెచ్ 1 బీ వీసాలు

అమెరికా ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగానే హెచ్ 1 బీ వీసాల సంఖ్యను పెంచడం లేదా కుదించాలని ఉత్తర్ కరోలినా సెనేటర్ థామ్ టిల్లిస్ చెప్పారు. సెనేట్ లో ఫైనాన్స్ కంపెనీలపై మంగళవారం జరిగిన చర్చల్లో ఆయన పాల్గొన్నారు. అమెరికా కంపెనీల అవసరాలను తీర్చగలిగే నైపుణ్యం గల వ్యక్తులు అమెరికాలో ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు.

 దేశంలో నిపుణులున్నారో లేదా తెలుసుకోవాలి

దేశంలో నిపుణులున్నారో లేదా తెలుసుకోవాలి

అమెరికా జీడీపీ వృద్దిరేటు 3.5 నుండి 4 శాతం మధ్య ఉందని, అంత వృద్దిని సాధించేందుకు దేశంలోని కంపెనీలకు అవసరమైన నిపుణులు ఉన్నారో లేదా తాను తెలుసుకోవాలని భావిస్తున్నట్టు ఆయన చెప్పారు.దేశ ఆర్థిక అవసరాలకు అనుగుణంగానే హెచ్ 1 బీ వీసాలను ఇవ్వాలని ఆయన కోరారు.

లాటరీ పద్దతిలోనే హెచ్ 1 బీ వీసాలు

లాటరీ పద్దతిలోనే హెచ్ 1 బీ వీసాలు

హెచ్ 1 బీ వీసాలను లాటరీ పద్దతిలోనే కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లను ఓ అమెరికా కోర్టు కొట్టేసింది. సాధారణంగా ఏడాదికి జనరల్ కేటగిరిలో 65 వేలు, యూఎస్ లో చదువుకొన్న ఇతర దేశాల వారి కేటగిరిలో 20 వేల హెచ్ 1 బీ వీసాలను మంజూరు చేస్తారు.


అయితే హెచ్ 1 బీ వీసాకు రెండింతలు ధరఖాస్తులు వస్తున్నాయి. దీంతో వీసాల మంజూరు చేయడానికి యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ లాటరీ పద్దతిని వినియోగిస్తోంది.దీనిని సవాల్ చేస్తూ పోర్ట్ లాండ్ కు చెందిన రెండు కంపెనీల కోర్టులో పిటిషన్ ను దాఖలు చేయగా కోర్టు కొట్టేసింది.

English summary
President Donald Trump has signed an executive order rolling back Obama-era rules aimed at curbing climate change.The president said this would put an end to the "war on coal" and "job-killing regulations
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X