వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కమలా హ్యారిస్‌పై జాత్యంహకార కుట్ర ?- తోసిపుచ్చిన ట్రంప్- పోటీకి మాత్రం అర్హత లేదని వెల్లడి..

|
Google Oneindia TeluguNews

అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న భారతీయ-జమైకాన్ అమెరికన్ కమలా హ్యారిస్ పేరు ఇలా అధ్యక్ష ఎన్నికల్లో ఖరారైందో లేదో ఆమెకు వ్యతిరేకంగా కుట్రలు మొదలైపోయాయని స్ధానికంగా సోషల్ మీడియా దుమ్మెత్తి పోస్తోంది. దీనంతటికీ ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే కారణమన్న ప్రచారం తీవ్రంగా సాగుతోంది. అమెరికన్ స్ధానికత లేని హ్యారిస్ ఉపాధ్యక్ష పదవికి అర్హురాలు కాదంటూ పలు యూనివర్శిటీల అధ్యాపకులు రాజ్యాంగాన్ని ఉటంకిస్తూ కొత్త వాదనలు తెరపైకి తెస్తున్నారు. వీటిపై తాజాగా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు.

కమలా హ్యారిస్‌ రాక....

కమలా హ్యారిస్‌ రాక....

అమెరికా ఎన్నికల్లో డెమెక్రాట్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న భారతీయ-జమైకాన్ మూలాలున్న అమెరికన్ సెనేటర్ కమలా హ్యారిస్ పేరు తాజాగా ఖరారైంది. జో బిడెన్ కు డిప్యూటీగా రంగంలోకి దిగిన కమలా హ్యారిస్ పై ఇప్పుడు అందరి కళ్లూ పడ్డాయి. ముఖ్యంగా తాజాగా అమెరికాలో చోటు చేసుకున్న నల్లజాతీయుల హత్యల తర్వాత పెల్లుబుకుతున్న నిరసనలు ఆమెతో పాటు డెమోక్రాట్లకు ఎక్కడ అనుకూలంగా మారబోతున్నాయో అన్న ఆందోళన రిపబ్లికన్లలో కనిపిస్తోంది. దీంతో ఆమెపై ఎదురుదాడికి అవసరమైన ఆయుధాలను సిద్ధం చేసుకునే పనిలో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బిజీగా కనిపిస్తున్నారు.

జాత్యంహకార కుట్ర ఆరోపణలు...

జాత్యంహకార కుట్ర ఆరోపణలు...

నల్లజాతీయురాలైన కమలా హ్యారిస్‌ను గెలవనీయకుండా అడ్డుకునేందుకు రిపబ్లికన్ అభ్యర్ధిగా ఉన్న ట్రంప్ ప్రయత్నిస్తున్నారంటూ, ఇందులో భాగంగానే ఆమెపై రకరకాలుగా బురదజల్లిస్తున్నారని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా పలు వర్సిటీల అధ్యాపకులు రాజ్యాంగ నిబంధనలను, స్ధానికతను తెరపైకి తెస్తూ కమలా హ్యారిస్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారని, ఇదంతా ట్రంప్‌కు మేలు చేసేందుకే అనే విమర్శలు వస్తున్నాయి. ఇదంతా కమలా హ్యారిస్‌పై జాత్యహంకార కుట్రలో భాగమేనంటూ సోషల్ మీడియా దుమ్మెత్తి పోస్తోంది. వీటిపై అధ్యక్షుడు ట్రంప్ తాజాగా స్పందించారు. జాత్యహంకార కుట్ర ఆరోపణను మాత్రం తోసిపుచ్చారు.

కుట్ర అబద్ధం, కానీ అర్హత లేదన్న ట్రంప్..

కుట్ర అబద్ధం, కానీ అర్హత లేదన్న ట్రంప్..

నల్లజాతీయురాలైన కమలా హ్యారిస్‌పై జాత్యంహకార కుట్ర జరుగుతున్నట్లు వస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని, అదే నిజమైతే వీటిని సీరియస్‌గా తీసుకోవాల్సి ఉంటుందని ట్రంప్ తాజాగా వ్యాఖ్యానించారు. అయితే ఆమె స్ధానికతపై వస్తున్న విమర్శలు మాత్రం పరిగణనలోకి తీసుకోవాల్సిందేనంటూ ట్రంప్ చెప్పడం ఆయన వైఖరిని స్పష్టం చేసింది. యూనివర్శిటీల అధ్యాపకులు కమల స్ధానికతపై లేవనెత్తుతున్న ప్రశ్నలు తన దృష్టికి వచ్చాయని, ఈ ఆరోపణలు చేస్తున్న వారు సామాన్యులు కాదని ట్రంప్ తెలిపారు. తద్వారా ఈ ఆరోపణలను సీరియస్‌గానే పరిగణిస్తున్నట్లు ట్రంప్ చెప్పకనే చెప్పారు.

Recommended Video

Kamala Harris - 'US Crying Out For Leadership' || Oneindia Telugu
స్ధానికత పేరుతో హ్యారిస్‌పై విష ప్రచారం.

స్ధానికత పేరుతో హ్యారిస్‌పై విష ప్రచారం.

రాజ్యాంగంలోని సిటిజన్ క్లాజ్ ప్రకారం ఉపాధ్యక్ష పదవి పోటీకి కమలా హ్యారిస్ అనర్హురాలంటూ కన్జర్వేటివ్ గ్రూప్ జ్యుడిషియల్ వాచ్ ఛీఫ్ టిమ్ ఫిల్టన్ చేసిన ట్వీట్‌ను ట్రంప్ ప్రచార సలహాదారు జెన్నా ఎలిస్ రీట్వీట్ చేశారు. ఇదే కోవలో లా ప్రొఫెసర్ ఈస్ట్‌మ్యాన్ కూడా స్వతహాగా అమెరికాలో జన్మించిన వారే అధ్యక్ష పదవికి అర్హులంటూ అమెరికన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 2ను కోట్‌ చేస్తూ చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. వీటి వెనుక ట్రంప్ ప్రచార యంత్రాంగం ఉందనే చర్చ సాగుతోంది. కమలా హ్యారిస్‌ను అనర్హురాలిగా చూపేందుకు రాజ్యాంగాన్ని ట్రంప్ అడ్డుపెట్టుకుంటున్నారనే వాదన పెరుగుతోంది. అయితే గతంలోనూ బరాక్‌ ఒబామా విషయంలోనూ ట్రంప్ ఇవే ఆరోపణలు తెరపైకి తెచ్చారని, కానీ చివరికి ఏమైందని డెమోక్రాట్లు ప్రశ్నిస్తున్నారు.

English summary
US President Donald Trump says he has heard Democratic running mate Kamala Harris "doesn't qualify" to serve as US vice-president, amplifying a fringe legal theory critics decry as racist.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X