వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘టెర్రరిస్ట్’:ట్రంప్ సపోర్టర్‌కి సిక్కు కౌన్సిలర్ షాకింగ్ రిప్లై

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తోపాటు ఆయన మద్దతుదారులు కూడా వివాదాస్పద వ్యాఖ్యలతో రచ్చకెక్కుతున్నారు. తాజాగా ఓ ట్రంప్ మద్దతుదారుడు ఓ సిక్కు కౌన్సిలర్‌ను ఉగ్రవాదితో పోల్చాడు.

అతని పోలికకు స్పందించిన సదరు కౌన్సిలర్ ధీటైన జవాబిచ్చాడు. న్యూజెర్సీలోని హోబోకెన్ లార్డ్ అండ్ కౌన్సిల్ ప్రెసిడెంట్‌లో రవీందర్ భల్లా అనే సిక్కు సిటీ కౌన్సిల్ మెంబరుగా ఉన్నారు.

Trump Supporter Calls Sikh Councillor In US 'Terrorist'. He Hits Back

ఇటీవల హోబోకెన్ సిటీ కౌన్సిల్ ఓ వాటర్ ఫ్రంట్ మల్టీ యూజ్ పాత్‌వే నిర్మాణానికి అంగీకరించింది. ఈ విషయాన్ని రవీందర్ భల్లా ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ ట్వీట్ చూసిన ట్రంప్ మద్దతుదారు రాబర్ట్ డుబెనెజిక్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

వెంటనే తిరిగి ట్వీట్ చేశారు. 'భల్లాను కౌన్సిలర్‌గా హోబోకెన్ ఎలా అంగీకరించింది. ఇటువంటి టెర్రరిస్టులను యూఎస్‌లో ఉండేందుకు అనుమతించడమే తప్పు' అని ట్వీట్ చేశాడు.

కాగా, రాబర్ట్ ట్వీట్ చూసిన రవీందర్ భల్లా వెంటనే ధీటుగా స్పందించారు. 'సర్.. నేను పుట్టింది, పెరిగిందీ అమెరికాలోనే. టెర్రరిస్ట్ అంటే అసలైన అర్థం 'అమెరికన్‌గా ఉండు' అని. బహుశా మీకీ విషయం తెలియదేమో' అని దిమ్మదిరిగే జవాబిచ్చారు భల్లా. కాగా, చాలామంది భల్లాకు మద్దతుగా ట్వీటెత్తారు.

English summary
A Sikh-American councilman was called a "terrorist" on Twitter by a Donald Trump supporter but the Indian-origin politician hit back at the troll, saying "you clearly don't know what it means to be an American".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X