వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్రాన్స్ ప్రథమ మహిళతో ఇలాంటి వ్యాఖ్యలా?: ట్రంప్‌పై విమర్శలు

డొనాల్డ్ ట్రంప్‌ తన సతీమణి మెలానియాతో కలిసి ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్నారు. పారిస్‌ చేరుకున్న ట్రంప్‌కు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్‌ మేక్రాన్‌ సాదర స్వాగతం పలికారు.

|
Google Oneindia TeluguNews

పారిస్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌‌కి వివాదాల్లో చిక్కుకోవడం అలవాటుగా మారింది. ఆయన ఏ దేశ పర్యటనకు వెళ్లినా.. ఆయనకు ఎదురయ్యే లేదా చేసే పని వార్తల్లో నిలుస్తుండటం తెలిసిందే. మొన్నటికి మొన్న ఓ టీవీఛానల్‌ మహిళా రిపోర్టరుపై ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు హల్‌చల్‌ అయ్యాయి.

విమర్శలకు తావిచ్చేలా..

విమర్శలకు తావిచ్చేలా..

ఆ తర్వాత పోలాండ్ పర్యటనలో అధ్యక్షుడి భార్య అగటా మొదట ట్రంప్‌కి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా దాటవేసిన వీడియో కూడా బాగా వైరల్ అయ్యింది. తాజాగా మరోసారి ట్రంప్‌ షేక్ హ్యాండ్, ఆయన చేసిన వ్యాఖ్యలు విమర్శలకు తావిచ్చేలా ఉన్నాయి.

ఫ్రాన్స్ పర్యాటనకు..

ఫ్రాన్స్ పర్యాటనకు..

ట్రంప్‌ తన సతీమణి మెలానియాతో కలిసి ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్నారు. పారిస్‌ చేరుకున్న ట్రంప్‌కు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్‌ మేక్రాన్‌ సాదర స్వాగతం పలికారు.

ప్రశంసలు..

ప్రశంసలు..

ఈ సందర్భంగా మేక్రాన్‌ తన సతీమణి, ఫ్రాన్స్‌ ప్రథమ మహిళ బ్రిగిట్టిని అమెరికా అధ్యక్షుడికి పరిచయం చేశారు. ఆ సమయంలో బ్రిగెట్టిపై ట్రంప్‌ ప్రశంసల జల్లు కురిపించారు.

ఇలాంటి వ్యాఖ్యలా..?

ఇలాంటి వ్యాఖ్యలా..?

‘మీరు చాలా అందమైన శరీర ఆకృతిని కలిగివున్నారు. బ్యూటిఫుల్‌' అంటూ పొగిడారు ట్రంప్. ఫ్రెంచ్‌ ప్రభుత్వం తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్టు చేసిన వీడియోలో ట్రంప్‌.. బ్రిగెట్టిని బ్యూటిఫుల్‌ అంటూ పొగిడారు. అయితే, ఒక దేశ ప్రథమ మహిళ శరీరాకృతి గురించి ట్రంప్ ఇలా మాట్లాడటంపై పలువురు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ట్రంప్ వ్యవహార శైలి ఎప్పుడూ వివాదాస్పదమే అంటూ మండిపడుతున్నారు.

English summary
First, they shared an awkward handshake. Then, President Donald Trump complimented Brigitte Macron's "physical shape."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X