వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డబ్ల్యూహెచ్‌వోకు ట్రంప్ ఫైనల్ వార్నింగ్- నెలరోజుల డెడ్ లైన్- లేకపోతే నిధులన్నీ కట్..

|
Google Oneindia TeluguNews

ప్రపంచ దేశాలను కుదిపేస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్ధ తీసుకుంటున్న చర్యలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తప్పుబట్టారు. ప్రపంచ ఆరోగ్య సంస్ధ చర్యలు సంతృప్తి కరంగా లేవని ట్రంప్ మరోసారి మండిపడ్డారు. నెల రోజుల్లో పరిస్ధితిని చక్కదిద్దకపోతే పూర్తిగా నిధులు నిలిపేస్తానని ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు.

Recommended Video

Donald Trump Permanently Freeze US Funding To WHO

 బరాక్ ఒబామా ఒక అసమర్థుడు, ఇక అంతే: అక్కసు వెళ్లగక్కిన డొనాల్డ్ ట్రంప్ బరాక్ ఒబామా ఒక అసమర్థుడు, ఇక అంతే: అక్కసు వెళ్లగక్కిన డొనాల్డ్ ట్రంప్

 ట్రంప్ ఫైనల్ వార్నింగ్..

ట్రంప్ ఫైనల్ వార్నింగ్..

ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను కుదిపేస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రించడంలో ప్రపంచ ఆరోగ్య సంస్ధ దారుణంగా విఫలమైందని ట్రంప్ మరోసారి ఘాటుగా విమర్శించారు. ప్రపంచ ఆరోగ్య సంస్ధ కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా లేవని ఆరోపిస్తూ తాజాగా ట్రంప్ ఓ లేఖ రాశారు. ఇందులో కరోనా విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్ద తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ప్రపంచ ఆరోగ్య సంస్ధ చర్యలు ఇలాగే ఉంటే నెల రోజుల్లో అమెరికా తరఫున ఇస్తున్న నిధులన్నీ నిలిపివేస్తానని ట్రంప్ హెచ్చరించారు.

 అత్తమీద కోపం దుత్తమీద...

అత్తమీద కోపం దుత్తమీద...

చిరకాల ప్రత్యర్ధి చైనా మీద తనకున్న కోపాన్ని తీర్చుకునే విషయంలో ఏ చిన్న అవకాశం దక్కినా వదిలిపెట్టని ట్రంప్.. ఈసారి డబ్ల్యూహెచ్‌వో లక్ష్యంగా విమర్శలకు దిగుతున్నారు. ఈసారి డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రాస్ కు రాసిన లేఖలోనూ ట్రంప్ మరోమారు చైనాపై కోపాన్ని వెళ్లగక్కారు. కరోనా వైరస్ పై ప్రపంచదేశాలను అప్రమత్తం చేయడంలో చైనాతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్ధ కూడా దారుణంగా విపలమయ్యాయని ట్రంప్ ఆరోపించారు. ప్రపంచ ఆరోగ్య సంస్ధ వైఫల్యాలకు పలు కారణాలను ట్రంప్ తన లేఖలో ప్రస్తావించారు. ప్రపంచ ఆరోగ్య సంస్ధ పదేపదే చేస్తున్న తప్పిదాలతో ప్రపంచ దేశాలన్నీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని ట్రంప్ తన లేఖలో తీవ్ర ఆరోపణలకు దిగారు. ఇప్పటికైనా చైనా కబంధ హస్తాల నుంచి బయటికి వచ్చి స్వేచ్ఛగా వ్యవహరించాలని ట్రంప్ సూచించారు.

 ఈసారి శాశ్వతంగా నిలిపేస్తాం..

ఈసారి శాశ్వతంగా నిలిపేస్తాం..

ప్రపంచ ఆరోగ్య సంస్ధ తప్పిదాలకు శిక్షగా ఇప్పటికే అమెరికా తరపున ఇచ్చే నిధులను తాత్కాలికంగా నిలిపేశామని, నెల రోజుల్లో పద్దతి మార్చుకుని సంతృప్తికర చర్యలు చేపట్టకపోతే శాశ్వతంగా నిధులు నిలిపివేస్తానని ట్రంప్ ఘాటు హెచ్చరికలు చేశారు. ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే కరోనా వైరస్ పుట్టుపూర్వోత్తరాలపై స్వతంత్ర సమీక్ష కూడా నిర్వహించిన ప్రపంచ ఆరోగ్య సంస్ధ.. వైరస్ వ్యాప్తి బాధ్యులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెబుతోంది.

English summary
american president donald trump threatened to permanently freeze US funding to the world health organisation unless substantial improvements were made with in next 30 days. trump had already suspended the payments to w.h.o in april for being maintain close relations with china and covering the coronavirus pandemic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X