వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధనిక దేశం కాబట్టే దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు: భారత్ పై ట్రంప్ ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

Recommended Video

అమెరికాను దోచుకుంటున్నారు... భారత్ పై ట్రంప్ ఆగ్రహం || Oneindia Telugu

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికాలో ఉత్పత్తి అయి భారత్‌కు ఎగుమతి అయిన మోటార్ సైకిలుపై 100శాతం సుంకం నుంచి 50శాతం సుంకం తగ్గించినప్పటికీ అది కూడా చాలా ఎక్కువే అని ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన నాయకత్వంలో అమెరికా ఉందని ఆదేశాన్ని ఎవరూ మోసం చేయలేరని ట్రంప్ అన్నారు. ప్రధాని మోడీ తనకు మంచి మిత్రుడే అయినప్పటికీ అమెరికా మోటార్ సైకిళ్లపై 100శాతం సుంకం విధించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు.

అమెరికాలో తయారయ్యే హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిళ్లపై భారత్ సుంకం విధించడాన్ని ట్రంప్ ప్రస్తావించారు. ఈ మోటార్ సైకిళ్లపై ఎలాంటి సుంకం విధించరాదని ఆయన కోరారు. అమెరికా భారత్‌కు హార్లీ డేవిడ్సన్ బైకులను ఎగుమతి చేస్తుండగా భారత్ 100శాతం సుంకం విధిస్తోందని అదే భారత్‌లో తయారయ్యే వాటికి మాత్రం సున్నా శాతం పన్ను ఉందని చెప్పారు. ఈ క్రమంలోనే తాను ప్రధాని మోడీతో మాట్లాడి ఇలాంటి ఆఫర్ తమకు నచ్చలేదని చెప్పినట్లు ట్రంప్ తెలిపారు. ఒక్క ఫోన్ కాల్‌తో మోడీ 50శాతం సుంకం తగ్గించారని అన్నారు. అయితే ఇది తమకేమీ కాదని అందుకే భారత్ ఇచ్చిన ఆఫర్‌‌తో తాము సంతృప్తిగా లేమని వెల్లడించారు. దీనిపై భారత్ పునరాలోచిస్తోందని ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.

Trump unhappy with India over 50 percent tariff on US made Motor bikes

అమెరికా ధనిక రాష్ట్రం కాబట్టి తమ ప్రతిపాదనపై భారత్ ఆలోచిస్తోందని ఒకవేళ ఆదేశ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే ప్రతిపాదనను పట్టించుకునే వారే కాదని ట్రంప్ చెప్పారు. కానీ ప్రతి దేశానికి అమెరికాతో పని ఉంటుందని అందుకే అగ్రరాజ్యానికి అంత గౌరవం విలువ ఇస్తాయని పేర్కొన్నారు. అంతేకాదు అమెరికా ధనిక రాష్ట్రం కనుక ఏ చిన్న అవకాశం వచ్చినా... పక్క దేశాలు దండుకునేందుకు చూస్తాయని ఆరోపణలు చేశారు.దాదాపు 800 బిలియన్ డాలర్లు మేరా ఇప్పటి వరకు ఇతరదేశాల నుంచి నష్టపోయినట్లు ట్రంప్ చెప్పారు.

English summary
US President Donald Trump said that even though India has reduced its import tariff on American motorcycles from 100 per cent to 50 per cent, it is still too high and not acceptable to him.Trump said the United States, under his leadership, is a country that can no longer be fooled.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X