వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Trump Impeachment : అభిశంసనపై ట్రంప్‌ ఫస్ట్‌ రియాక్షన్ ఇదే- వీడియో సందేశం ద్వారా

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష పదవి నుంచి తనను తొలగించేందుకు సర్వప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం ప్రవేశపెడుతున్నప్పుడు వైట్‌హౌస్‌ నుంచే ఈ తతంగాన్ని డొనాల్డ్‌ ట్రంప్‌ టీవీల్లో వీక్షించారు. తన అవమానకర నిష్కృమణ గురించి తీవ్ర ఆవేదన చెందినట్లు తెలుస్తోంది. అభిశంసన పూర్తయ్యే వరకూ టీవీల్లో వీక్షించిన ట్రంప్‌.. అనంతరం అమెరికన్లు, తన మద్దతుదారులను ఉద్దేశించి ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

రెండోసారి అభిశంసనతో అధ్యక్ష పదవి నుంచి ఉద్వాసనకు గురైన ట్రంప్‌ అనంతరం వీడియో సందేశం ద్వారా తన తొలి స్పందనను తెలియజేశారు. అమెరికన్లు ఐక్యంగా ఉండాలని, హింసను నివారించాలని డొనాల్డ్‌ ట్రంప్ తన వీడియో సందేశంలో విజ్ఞప్తి చేశారు. కానీ తన అభిసంశన తీర్మానం గురించి కానీ, తాను పదవీచ్యుతుడు కావడం గురించి కానీ తన సందేశంలో ఎక్కడా ట్రంప్‌ ప్రస్తావించలేదు. అలాగే క్యాపిటల్‌ భవనంపై దాడి, అనంతర పరిణామాల గురించి కూడా ట్రంప్‌ తన వీడియోలో ఎక్కడా ప్రస్తావించలేదు.

trump urges americans united, but doesnt mention impeachment in his first reaction

అమెరికన్లు తమ ఆకాంక్షలను వదిలిపెట్టి ఐక్యంగా ఉండాలని మాత్రమే ట్రంప్‌ విజ్ఞప్తి చేశారు. మన కుటుంబాల భవిష్యత్తు, మంచి దృష్ట్యా ముందుకెళ్లేందుకు వీలుగా వ్యవహరించాలని వారిని అభ్యర్ధించారు. క్యాపిటల్‌ భవనంపై దాడి ఘటనపై మాత్రం ట్రంప్ స్పందించలేదు. దీనికి ఎలాంటి బాధ్యతా ప్రకటించుకోలేదు. జనవరి 20న జో బైడెన్ ప్రమాణస్వీకారం తర్వాత ట్రంప్‌ క్యాపిటల్‌ భవనంపై తన మద్దతుదారులతో దాడికి ప్రేరేపించిన ఘటనపై విచారణ ప్రారంభం కానుంది. ఇందులో దోషిగా తేలితే ట్రంప్‌ను జైలుకు పంపేందుకు కూడా బైడెన్ సర్కారు వెనుకాడకపోవచ్చని తెలుస్తోంది.

English summary
donald trump has urges americans united and avoid violence in his first reaction after being impeached wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X