వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ తరహా నిర్ణయాలు ప్రారంభం!, 'ఆయన నచ్చకుంటే దేశం విడిచి వెళ్లండి'

ట్రాన్స్‌ పసిఫిక్‌ పార్టనర్‌షిప్‌ ట్రేడ్‌ (టీపీపీ) డీల్‌ నుంచి అమెరికా త్వరలో వైదొలగనున్నట్లు అమెరికా తదుపరి అధ్యక్షులు డోనాల్డ్‌ ట్రంప్‌ ఓ వీడియో సందేశంలో తెలిపారు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ట్రాన్స్‌ పసిఫిక్‌ పార్టనర్‌షిప్‌ ట్రేడ్‌ (టీపీపీ) డీల్‌ నుంచి అమెరికా త్వరలో వైదొలగనున్నట్లు అమెరికా తదుపరి అధ్యక్షులు డోనాల్డ్‌ ట్రంప్‌ ఓ వీడియో సందేశంలో తెలిపారు. తాను జనవరిలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత చేసే మొట్టమొదటి పని ఇదేనని చెప్పారు.

గతంలోనే ఆయన బొగ్గు ఉత్పత్తి రంగంలో ఉద్యోగాలను కోతను తగ్గిస్తానని పేర్కొన్నారు. వీటితో పాటు ఇప్పటికే ఆయన బరాక్ ఒబామా కేర్‌ రద్దు, మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణం వంటివి తొలి రోజే చేపడతానన్నారు.

సోమవారం టీపీపీ డీల్ పైన జపాన్‌ ప్రధాని షింగో అబే మాట్లాడారు. అమెరికా లేకపోతే ఈ డీల్‌కు అర్థం లేదన్నారు. 2015లో 12 దేశాలు టిపిపి డీల్‌ను కుదుర్చుకున్నాయి. ఈ దేశాల ఆర్థిక వ్యవస్థ మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నలభై శాతం వాటాను కలిగి ఉన్నాయి. కానీ ఈ డీల్‌ ఇప్పటివరకు జపాన్‌, మలేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, కెనడా, మెక్సికో దేశాలు ఇప్పటి వరకు ఈ డీల్‌ను ఆమోదించలేదు.

Trump: US to quit TPP trade deal on first day in office

దేశం విడిచి వెళ్లండి

అమెరికా తదుపరి అధ్యక్షులు ట్రంప్‌ అంటే మీకు ఇష్టం లేకపోతే మీరే వేరే దేశం వెళ్లిపోవాలని ఓ జడ్జి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అమెరికాలో వివాదాస్పదంగా మారాయి. శాన్‌ ఆంటోనియోలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్సన్‌ కల్చర్స్‌లో జరిగిన కార్యక్రమంలో కొత్తగా అమెరికా పౌరసత్వం స్వీకరించిన వారిని ఉద్దేశించి ప్రసంగించిన ఫెడరల్‌ మేజిస్ట్రేట్‌ జాన్‌ ప్రిమోమో ఈ వ్యాఖ్యలు చేశారు.

ట్రంప్‌ విజయం అనంతరం దేశంలో తలెత్తిన ఆందోళనలపై ఆయన స్పందించారు. నిరసన వ్యక్తం చేస్తున్న వారిని ఉద్దేశించి మాట్లాడారు. మీకు ఆయన అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఇష్టం లేకపోతే మీరే దేశం విడిచి వేరే దేశానికి వెళ్లవచ్చునని, మీరు ట్రంప్‌కు ఓటు వేసినా, వేయకపోయినా మీరందరూ యూఎస్‌ సిటిజన్స్‌, ఆయన మీ అధ్యక్షుడు అన్నారు.

ఆయన మా అధ్యక్షుడు కాదంటూ శాన్‌ ఆంటోనియో ప్రాంతంతో పాటు పలు ప్రాంతాల్లో ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేస్తున్న వారిని తీవ్రంగా విమర్శించారు. జాతీయ గీతం వస్తుండగా నిలబడకుండా మోకాలిపై కూర్చున్న క్రీడాకారులను ఉద్దేశించి ఆయన ఆందోళన చేసే హక్కు మీకు ఉందని, కానీ జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని అవమానించే హక్కు లేదన్నారు. తాను అధ్యక్ష పదవి మీద ఉన్న గౌరవంతో మాట్లాడుతున్నానని చెప్పారు.

English summary
President-elect Donald Trump says the US will quit the Trans-Pacific Partnership trade deal on his first day in the White House.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X