వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ట్రంప్ వచ్చాడు, హిట్లర్ లాగే చేస్తాడు, తెలివి ఉంటే బ్యాగులు సర్దుకోండి'

ట్రంప్ వచ్చాడని, యూదుల విషయంలో హిట్లర్ ఎలా చేశాడో, ఇప్పుడు ముస్లీంల విషయంలో ట్రంప్ కూడా అలాగే చేస్తాడని ముస్లీంలను బెదిరిస్తూ కొన్ని లేఖలు మసీదులకు వెళ్లాయి.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ వచ్చాడని, ఇక మీరు గడియలు లెక్కించుకునే రోజు వచ్చిందని, యూదుల విషయంలో హిట్లర్ ఎలా చేశాడో, ఇప్పుడు ముస్లీంల విషయంలో ట్రంప్ కూడా అలాగే చేస్తాడని అమెరికాలోని ముస్లీంలను బెదిరిస్తూ కొన్ని లేఖలు మసీదులకు వెళ్లాయి.

మూడు మసీదులకు గుర్తు తెలియని వ్యక్తులు ఈ బెదిరింపు లేఖలు పంపించారు. హిట్లర్‌ హయాంలో యూదులకు పట్టిచ్చిన గతే ఇప్పుడు ట్రంప్‌ ముస్లింలకు పట్టిస్తారని పేర్కొన్నారు. పూర్తిగా ద్వేషభావంతో నిండిన లేఖల్లో అధ్యక్షునిగా ఎన్నికైన ట్రంప్‌ని, ఆయన ముస్లిం వ్యతిరేక అభిప్రాయాలను ప్రశంసలతో ముంచెత్తారు. మీరంతా తెలివిగల వాళ్లయితే దేశాన్ని విడిచి ముందుగానే వెళ్లిపోవాలని పేర్కొన్నారు.

Trump will do to Muslims what 'Hitler did to the Jews', letters to California mosques say

ఉత్తర కాలిఫోర్నియాలోని శాన్‌హొసె, దక్షిణ కాలిఫోర్నియాలోని లాంగ్‌ బీచ్‌, పొమోనా మసీదులకు ఈ బెదిరింపు లేఖలు వచ్చినట్లు కౌన్సిల్‌ ఆన్‌ ఇస్లామిక్‌ అమెరికా రిలేషన్స్‌ అధికారులు వెల్లడించారు. ముస్లింలు అందరూ కిరాతకులు, మూర్ఖులు అంటూ లేఖల్లో పలు ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని, మీరంతా సామాను సర్దుకొని పారిపోవటం మంచిదని పేర్కొన్నారని తెలిపారు.

చేతిరాతతో రాసిన లేఖ చివరిలో అమెరికన్స్‌ ఫర్‌ ఏ బెటర్ వే, లాంగ్‌ లివ్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌, గాడ్‌ బ్లెస్ యూ అని రాసి ఉన్నట్లు తెలిపారు. ముస్లింలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఇటువంటి చర్యలను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని, ఇది మతానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న విషయంగా పరిగణనలోకి తీసుకొని వారిపై చర్యలు చేపట్టాలని సీఏఐఆర్‌ అధికారి ఒకరు కోరారు.

English summary
Trump will do to Muslims what 'Hitler did to the Jews', letters to California mosques say.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X