వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ ఖేల్ ఖతం: దుకాణం సర్దేశాడా? -వైట్‌హౌజ్‌ ఖాళీకి సామాన్ల తరలిపు వ్యాన్ -వైరల్ వీడియో

|
Google Oneindia TeluguNews

ఒకప్పుడు జాత్యహంకార వికృతాలకు కేంద్రంగా.. ఇప్పటికీ సంప్రదాయ రిపబ్లికన్లకు కంచుకోటగా ఉండిన జార్జియాలో సైతం జోబైడెన్ జోరు ప్రదర్శిస్తున్నాడు... అమెరికా 46వ అధ్యక్షుడు అయ్యేందుకు అడుగుల దూరంలో నిలిచాడు.. తాజాగా వెల్లడైన లెక్కల ప్రకారం... ఒకప్పటి జ్యాత్యంహంకారుల నియం.. ఇప్పటి ఎర్రకోట(రిపబ్లికన్ల రంగు) ఫిలడెల్ఫియాలోనూ బ్లూవేవ్(డెమోక్రాట్ల రంగు) కనిపిస్తోంది. ఫిలడెల్ఫియా కొలువైన పెన్సిల్వేనియా రాష్ట్రంలోనూ బైడెన్ ఆధిపత్యం సాధించడాడు.. ఈ పరిణామాలను తట్టుకోలేక..3

షాక్: వారం తర్వాతే అమెరికా ఫలితాలు -9రాష్ట్రాల్లోనే ఆలస్యం ఎందుకంటే -భారత ఈసీకి జేజేలుషాక్: వారం తర్వాతే అమెరికా ఫలితాలు -9రాష్ట్రాల్లోనే ఆలస్యం ఎందుకంటే -భారత ఈసీకి జేజేలు

సంచలన వీడియో వైరల్..

సంచలన వీడియో వైరల్..

పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ నిలిపేసి, తనను విజేతగా ప్రకటించాలంటూ వరుస ప్రకటనలు చేస్తోన్న రిపబ్లికన్ అభ్యర్థి, ప్రస్తుత అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. డెమోక్రటిక్ అభ్యర్థి జోబెడెన్ కు అనుకూలంగా మారుతోన్న పరిణామాలపై మండిపడుతున్నారు. ఈలోపే ఇంటర్నెట్ లో ఓ వీడియో సంచలనంగా మారింది. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్ ముందు ‘పెన్‌స్కే' కంపెనీకి చెందిన ట్రక్కు నిలిచినట్లు కనిపిస్తోన్న ఆ వీడియోపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే..

 వైట్ హౌజ్ ఖాళీ చేస్తున్నారా?

వైట్ హౌజ్ ఖాళీ చేస్తున్నారా?

అమెరికాకు చెందిన ‘పెన్‌స్కే' కంపనీ ట్రక్కు సర్వీసులను అందిస్తుంది. వీవీఐపీలు సహా చాలా మంది తమ సరుకుల బట్వాడాకు ఆ కంపెనీ ట్రక్కులనే ఉపయోగిస్తారు. రీఎలక్షన్ లో ట్రంప్ ఓటమి అనధికారికంగా ఖరారైన నేపథ్యంలో.. అసలే కోపధారి మనిషయిన ఆయన అలకతో అధికారిక భవంనం వైట్ హౌజ్ ను ఖాళీ చేస్తున్నారా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అయ్యాయి. అమెరికా ఎన్నికల ఫలితాలు ఉత్కంఠగా సాగుతున్న సమయంలో వైట్ హౌజ్ దగ్గర కూడా మీడియా ఫోకస్ ఎక్కువగా ఉన్న తరుణంలోనే ‘పెన్‌స్కే' ట్రక్కు అక్కడ దర్శనమివ్వడంపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి..

 మెలానియా చాలా తెలివైంది..

మెలానియా చాలా తెలివైంది..

వైట్ హౌజ్ ముందు సామాన్లు తరలించే వ్యాన్ నిలిచి ఉండటంపై నెటిజన్లు ట్రంప్ ను ట్రోల్ చేస్తున్నారు. ‘‘కచ్చితంగా చెప్పగలను ముందుగా ఇల్లు విడిడి పోతున్నది మెలానియానే'' అని ఒకరు, ‘‘మెలానియా చాలా తెలివైన మహిళ ముందుగానే మేల్కొని తన పని పూర్తిచేశారు''అని ఇంకొకరు.. ‘‘ఎట్టకేలకు ప్రజల భవనం తిరిగి ప్రజలకే దక్కింది''అని మరొకరు.. ‘‘ఇది నిజంగా నమ్మశక్యంగానే ఉంది''అని పలువురు కామెంట్లతో అదరగొట్టారు. కాగా..

 అమెరికా 46 ప్రెసిడెంట్ జోబైడెన్..

అమెరికా 46 ప్రెసిడెంట్ జోబైడెన్..

50 రాష్ట్రాల్లో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లకు గానూ ఇప్పటికే జోబైడెన్ 264 ఓట్లు, ట్రంప్ 214 ఓట్లు రాబట్టుకోగా, తొమ్మది రాష్ట్రాల్లో కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. వాటిలో ఐదు రాష్ట్రాల్లో హోరాహోరీ పరిస్థితి నెలకొంది. శుక్రవారం సాయంత్రానికి(అమెరికా కాలమానం ప్రకారం) వెల్లడైన ఫలితాల్లో 16 ఎలక్టోరల్ ఓట్లున్న జార్జియాలో, 20 ఎలక్టోరల్ ఓట్లున్న పెన్సిల్వేనియాలో డెమోక్రటిక్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. కౌంటింగ్ సాగుతోన్న తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రెండు గెల్చుకున్నా బైడెన్ అమెరికా 46 ప్రెసిడెంట్ గా గెలవడం ఖాయంగా కనిపిస్తోందని అక్కడి మీడియా చెబుతోంది. ఇక వైరల్ వీడియో విషయానికొస్తే.. ట్రంప్ ఓడినంత మాత్రాన వెంటనే వైట్ హౌజ్ ఖాళీ చేయాల్సిన అవసరం ఉండదు. జనవరి 20న కొత్త అధ్యక్షుడు ప్రమాణం చేసేనాటికి వెళ్లిపోతే సరిపోతుంది. ఏమో.. గుర్రం ఎగరా వచ్చు అనుకుంటే ట్రంప్ కూడా గెలుపొంది వైట్ హౌజ్ లోనే మరో నాలుగేళ్లు తిష్టవేయొచ్చు.

ట్రంప్‌కు భారీ షాక్: చీలిన రిపబ్లికన్లు -పిచ్చి ముదిరింది -ఎన్నికల సమగ్రతపై దాడి అంటూ తీవ్ర విమర్శలుట్రంప్‌కు భారీ షాక్: చీలిన రిపబ్లికన్లు -పిచ్చి ముదిరింది -ఎన్నికల సమగ్రతపై దాడి అంటూ తీవ్ర విమర్శలు

English summary
The video of an alleged Pesnke moving truck parked outside the White House is causing jokes on social media, even as Joe Biden inches ahead of Donald Trump in the race to becoming President. amid Democratic Presidential challenger Joe Biden races ahead of Trump in key states, slowly but steadily inching closer to becoming the next POTUS, this video gone viral
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X