• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సునామీ విధ్వంసం.. తీరని శోకం.. 222 మంది మృత్యువాత

|
Google Oneindia TeluguNews

జకార్తా : ఇండోనేసియాలో అగ్నిపర్వతం బద్దలై పెను విధ్వంసం సృష్టించింది. ప్రకృతి ప్రళయం రాకాసి అలల రూపంలో ఎగిసిపడి తీరని విషాదం మిగిల్చింది. సునామీ రూపంలో ఎగిరెగిరి పడింది. మృత్యుపాశమై 222 మందిని బలి తీసుకుంది. వందల మందిని గాయాలపాలు చేసింది. మరో 30 మంది జాడ కానరాకుండా చేసింది. బీచులన్నీ కకావికలంగా మారాయి. వందల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి.

శనివారం రాత్రి క్రాకటోవా శిశువుగా పిలిచే ఓ అగ్నిపర్వతం బద్దలై బీభత్సం సృష్టించింది. దీంతో నీటిలోపలి భూమి కంపించి సునామీ సంభవించింది. ఇది జావా వెస్ట్ కోస్టల్ తో పాటు సుమత్రా దీవి సౌత్ కోస్టల్ పై తీవ్ర ప్రభావం చూపింది. ఎగిరెగిరిపడ్డ రాకాసి అలలు తీర ప్రాంతాలను ముంచెత్తాయి. స్వల్ప వ్యవధిలో బీచులన్నీ మృత్యు కుహారాలుగా మారిపోయాయి.

బద్ధలైన అగ్నిపర్వతం.. మృత్యు పాశం

బద్ధలైన అగ్నిపర్వతం.. మృత్యు పాశం

ఇండోనేసియాలో అగ్నిపర్వతం బద్దలయింది. సునామీ రూపంలో దూసుకొచ్చి మృత్యుపాశమైంది. ఊహకందని పెను విధ్వంసం సృష్టించి.. చరిత్ర పుటలపై చెరగని మరకను పూసింది. 222 మంది ప్రాణాలు కోల్పోగా.. 800 మందికి పైగా గాయాలపాలయ్యారు. మరో 30 మంది జాడ దొరకడం లేదు. ఇంతటి మహా విషాదం నింపిన ఈ సునామీ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

సునామీ విసిరిన పంజాకు జావా, సుమ్రతా దీవుల మధ్య ఉన్న సుందా జలసంధి తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. వందల సంఖ్యలో ఇళ్లు, చెట్లు నేలమట్టమయ్యాయి. సహాయక చర్యలు ముమ్మరం చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగింది. గాయపడ్డవారికి వైద్యం అందించేందుకు హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారు అధికారులు. భవనాల శిథిలాల కింద చిక్కుకున్నవారిని బయటకు తీసేలా శ్రమిస్తున్నారు.

బీచుల అంచున తీరని శోకం

బీచుల అంచున తీరని శోకం


శనివారం రాత్రి విరుచుకుపడ్డ జల ప్రళయం తీరని శోకం మిగిల్చింది. వీకెండ్ తో పాటు క్రిస్మస్ హాలిడేస్ ఉండటంతో బీచులకు పెద్దసంఖ్యలో తరలివచ్చారు జనాలు. ఊహించని పరిణామంతో ప్రకృతి ప్రళయం కాటేసింది. పెద్ద అలగా వచ్చి వందలాది మందిని మింగేసింది. ఇళ్లు, చెట్లు, ఎలక్ట్రిక్ పోల్స్ ఇలా బీచుల సమీపంలోని ప్రతిదీ నేలమట్టమైంది. సునామీ దెబ్బకు సముద్రపు నీరు బీచులను దాటి ఊహించని రీతిలో ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. వాహనాలను సముద్రగర్భంలోకి లాక్కెళ్లింది.

 భూకంపం రాలేదు.. అందుకే గుర్తించలేదు

భూకంపం రాలేదు.. అందుకే గుర్తించలేదు

సునామీని గుర్తించే వీలులేకుండా పోయిందని అభిప్రాయపడ్డారు జాతీయ విపత్తు సంస్థ అధికార ప్రతినిధి సుతొపొ పుర్వో. ముందస్తు సూచనగా భూకంపం రాకపోవడంతో సునామీని గుర్తించడం కష్టమైందని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఈమేరకు ఇండోనేషియా ప్రజలకు క్షమాపణలు చెప్పారు. మరోవైపు ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడొడో.. జల ప్రళయంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. త్వరలోనే పరిస్థితులు కుదుటపడుతాయని ఆకాంక్షించారు.

 ప్రధాని మోడీ సంతాపం

ప్రధాని మోడీ సంతాపం

ఇండోనేసియాలో పెను విధ్వంసం సృష్టించిన సునామీ తీరుపై ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. కష్టకాలంలో ఇండోనేషియాకు అండగా నిలవడానికి భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. జల ప్రళయంతో మృత్యువాత పడ్డ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని.. అక్కడి పరిస్థితులు తొందరా కుదుటపడాలని ఆకాంక్షించారు.

English summary
The volcano erupted in Indonesia and created a massive destruction. It took 222 people to death. The disaster of the tsunami has been not detected, "said Sutopo Purwow, a national disaster agency spokesman. Indonesian President Joco Vidodo expressed shock over the water flood. Prime Minister Narendra Modi has expressed regret over the tsunami pattern created by the massive destruction in Indonesia. India is ready to stand up to Indonesia in this difficult time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X