వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ వర్సిటీపై ఉగ్రదాడి: ఎవరీ ఉమర్ మన్సూర్?

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని బచాఖాన్ విశ్వవిద్యాలయంలో బుధవారం ఉగ్రవాదులు మారణ హోమం సృష్టించారు. ఓ ప్రొఫెసర్ తోపాటు సుమారు 70మంది విద్యార్థుల ప్రాణాలను బలిగొన్నారు.

కాగా, ఈ దాడి వ్యూహకర్త కరడు గట్టిన ఉగ్రవాది ఉమర్‌ మన్సూర్‌ అని పాక్‌ నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఉగ్రదాడికి పాల్పడింది తామేనంటూ తెహ్రీక్ ఈ తాలిబన్(టిటిపి) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఉగ్ర సంస్థ జరిపే దాడులన్నింటికీ ఉమర్ మన్సూరే వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

TTP claims Bacha Khan terror attack, Know who is Umar Mansoor

ఎవరీ ఉమర్‌ మన్సూర్‌

ఖైబర్‌ ఫఖ్తున్వాలోని తెహ్రీక్‌ తాలిబాన్‌ పాకిస్థాన్‌ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలన్నీ ఉమర్‌ మన్సూర్‌ నేతృత్వంలోనే జరుగుతాయి. 2014 డిసెంబర్‌ 16న పెషావర్‌ ఆర్మీపబ్లిక్‌స్కూల్‌పై జరిగిన దాడిలో ఇతని హస్తమే వుందని దర్యాప్తులో వెల్లడయింది.

పాక్‌ సైనికదళాలు చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక దాడులను అడ్డుకునేందుకు సైనిక సారథ్యంలోని విద్యాసంస్థలపై విరుచుకుపడాలని.. మన్సూర్‌ పాక్‌ తాలిబాన్లకు సూచించినట్టు సమాచారం.2014లో ఆఫ్గన్‌కు పారిపోయిన మన్సూర్‌ అక్కడ నుంచే కార్యకలాపాలను కొనసాగించాడు.

మలాలా యూసుఫ్ జాయ్‌ను చంపాలని ఆదేశాలు జారీ చేసిన టిటిపి లీడర్ ముల్లా ఫజ్లుల్లాహ్‌కు మన్సూర్ సన్నిహితుడని తెలుస్తోంది. పెషావర్ సైనిక పాఠశాలలో జరిగిన ఉగ్రదాడిలో కూడా ఇతడే ప్రధాన సూత్రధారి అని తెలుస్తోంది. డిసెంబర్ 16, 2014లో జరిగిన ఈ దాడిలో 150మందికి పైగా విద్యార్థులు, సిబ్బంది మృతి చెందారు.

వాలీబాల్‌ అంటే ఇష్టపడే మన్సూర్‌ను ఫస్తూన్‌ భాషలో నరయ్‌ అని పిలుస్తారు. దీనర్థం స్లిమ్‌ అని. కాగా, విద్యార్థులను, అమాయకులను ఊచకోత కోస్తున్న మన్సూర్‌ను పాక్‌ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. మన్సూర్‌ను ఇప్పుడు యావత్‌ పాక్‌ ద్వేషిస్తోంది.

English summary
At least 21 people were killed when militants stormed the Bacha Khan University near Peshwar in Pakistan on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X