టర్కీ బొగ్గు గనిలో భారీ పేలుడు: 205 మంది మృతి
ఇస్తాంబుల్: టర్కీ పశ్చిమ ప్రాంతంలోని ఓ బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 205 మంది కార్మికులు మృతి చెందారు. మరో 200 మంది గనిలోనే చిక్కుకుపోయారు. మంగళవారం బొగ్గు గనిలో కార్మికులు షిప్టులు మారుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టర్కీ ప్రధాన వాణిజ్య నగరం ఇస్తాంబుల్ పట్టణానికి 250 కిలో మీటర్ల దూరంలోని సోమా ప్రాంతంలో ఈ బొగ్గు గని ఉంది.
ప్రమాదం జరిగిన సమయంలో బొగ్గు గనిలో 787 మంది కార్మికులు ఉన్నారని, గనిలో చిక్కుకుపోయిన వారి కోసం సహాయక చర్యలు చేపడుతున్నామని టర్కీ మంత్రి తానేర్ ఈల్డీజ్ తెలిపారు. కార్బన్ మోనాక్సైడ్ విషపూరితమవ్వడంతో పేలుడు సంభవించిందని, ఈ పేలుడు కారణంగా విద్యుత్ సరఫరా యూనిట్‌లో మంటలు చెలరేగడంతో ప్రమాదం మరింత తీవ్రమైందని చెప్పారు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన 88 మంది కార్మికులను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. 363 మంది కార్మికులు ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారని చెప్పారు. గనిలో చిక్కుకుపోయిన వారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. సహాయక చర్యల కోసం అంబులెన్స్ వాహనాలు, హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు.
కాగా, టర్కీ ప్రధాని రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ తన అల్బేనియా పర్యటనను రద్దు చేసుకున్నారు. ప్రమాద ఘటన సమాచారంతో హుటాహుటిన సోమా ప్రాంతానికి తరలివెళ్లారు. దేశంలో జరిగిన అతిపెద్ద బొగ్గు గని ప్రమాదమని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన, మంగళవారం నుంచి మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications